![Old Woman Garlanded With Shoes Face Blackened - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/11/himachal.jpg.webp?itok=RIbJ3q1Q)
సిమ్లా : మంత్రగత్తె ముద్ర వేసి 81 ఏళ్ల మహిళ ముఖానికి నల్ల రంగు పూసి, చెప్పుల దండతో ఊరేగించిన ఘటనకు సంబంధించి 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ పోలీసులను ఆదేశించారు. సర్కాఘట్ సబ్‌డివిజన్‌లోని సమహాల్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలిని మంత్రాల నెపంతో హింసించిన కేసులో 21 మందిని అరెస్ట్ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని మండి ఎస్పీ గౌరవ్ శర్మ తెలిపారు. కాగా ఇలాంటి ఘటన జరుగుతుందనే ఆందోళనతో తాను అక్టోబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు కుమార్తె వెల్లడించారు. ఫిర్యాదు రాగానే పోలీసులు గ్రామాన్నిసందర్శించారని అయితే తర్వాత ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment