![Man Died With Black Magic Practices Case Registered In Rangareddy - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/25/rrd1.jpg.webp?itok=2H30D84O)
సాక్షి, హైదరాబాద్: మంత్రాలతో రోగం మాయం చేస్తానని చెప్పి ఓ మంత్రగాడు నిండు ప్రాణం బలి తీసుకున్నాడు. మంత్రగాన్ని నమ్మినందుకు తన భర్తను బలి తీసుకున్నాడని మృతుడి భార్య ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం వెలిగొండ గ్రామంలో నివాసిస్తూ లారీలో లోడింగ్‌లో దినసరి కూలీగా జీవనం సాగిస్తున్న మహేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో (కడుపు నొప్పి) తో బాధపడుతునాడు. ఎన్ని ఆసుపత్రులు జబ్బు తగ్గకపోవడంతో వారి బంధువుల సలహా మేరకు నంది వనపర్తిలో శ్రీహరి అనే మంత్రగాడి దగ్గరకు ఈ నెల 24న వెళ్లారు.
ఒక రోజు మంత్రాలు వేసి పటం గీసి నేను బాగు చేస్తానంటూ 20వేల రూపాయల వసూలు చేశాడు. రూ.10 వేలు అడ్వాన్స్‌గా మహేష్ ముట్టజెప్పాడు. శ్రీహరి ఇంటిదగ్గరే మంత్రాల సామాగ్రితో కొన్ని కార్యక్రమాలు చేశారని మహేష్ బంధువులు తెలిపారు. దాంతో మహేష్ రోగం మరింత ముదిరి ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి నందివనపర్తి గ్రామంలో ప్రాణాలు విడిచాడు. రోగం నయం చేస్తానని నమ్మించి ప్రాణాలు తీసిన శ్రీహరి పై చర్యలు తీసుకోవాలని మహేష్ భార్య శివారని పోలీసులను వేడుకున్నారు. మాయమాటలతో భర్తను కోల్పోయానని కన్నీరుమున్నీరయ్యారు. ఏడు నెలల క్రితమే మహేష్, శివారని వివాహం జరిగిది. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి. కాగా, శివారని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: అపార్ట్‌మెంట్‌లోకి అనుమతి లేదన్నందుకు దారుణం)
Comments
Please login to add a commentAdd a comment