witch
-
ఈ రత్నాలను మంత్రగాళ్లు, మంత్రగత్తెలు ధరించేవారు!
ప్రాచీన నాగరికతలలో రకరకాల రత్నాలు వినియోగంలో ఉండేవి. సాధారణంగా సానుకూల ఫలితాలను ఇస్తాయనే నమ్మకంతోనే ప్రాచీనులు రత్నాలను ధరించేవారు. దోషభరితమైన రత్నాలను ధరించినప్పుడే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయని నమ్మేవారు. దోషాలు లేకుండా ఎలాంటి రత్నమైనా ధరించదగ్గదేనని భావించేవారు. దోషాలతో నిమిత్తం లేకుండా ప్రాచీనులలో కొందరిని భయపెట్టిన రత్నం ఒకటి ఉండేది. అదే ‘ఓనిక్స్’. పురాతన సంస్కృత గ్రంథాలు దీనిని గోమేధకభేదంగా, శివధాతువుగా, పీతరత్నంగా పేర్కొన్నాయి. ‘ఓనిక్స్’ జాతికే చెందిన ‘హేసొనైట్ సార్డోనిక్స్’ను మన ప్రాచీనులు ‘గోమేధికం’గా నవరత్నాల జాబితాలో చేర్చారు. ‘ఓనిక్స్’ గోమేధికం కంటే కొంత భిన్నమైన రత్నం. అంతర్గతంగా సూక్ష్మస్ఫటికాలు కలిగిన క్వార్ట్, సిలికా, మోగనైట్ ఖనిజాలతో కూడిన ఖనిజ శిలల నుంచి ‘ఓనిక్స్’ రత్నాలు ఏర్పడతాయి. మోహ్స్ స్కేలుపై ‘ఓనిక్స్’ దారుఢ్యం 6.5–7.0 వరకు ఉంటుంది. ఇవి రకరకాల రంగుల్లో దొరుకుతాయి. అయితే, వీటిలో నలుపురంగులోనివి కొంత విరివిగా దొరుకుతాయి. ఓనిక్స్ రత్నాలను సానబెడితే చాలా నునుపుగా తయారవుతాయి. వీటిని కోణాలుగా తీర్చిదిద్ది సానబెట్టడం కొంత తక్కువే. ముడి ఖనిజం నుంచి కాస్త పెద్దసైజు రత్నాలుగా కూడా ఇవి దొరుకుతాయి. అందువల్ల శిల్పాలు చెక్కడానికి, వీటి ఉపరితలంపై చిత్రాలు చెక్కడానికి, తొలిచి పాత్రలు వంటి గృహోపకరణాలను తయారు చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ప్రాచీన గ్రీకు, రోమన్ నాగరికతల ప్రజలు వీటితో మలచిన శిల్పాలను, రకరకాల గృహోపకరణాలను తయారుచేసుకుని వినియోగించేవారు. ప్రాచీన చైనా ప్రజలు ‘ఓనిక్స్’ రత్నాలను దురదృష్టానికి సంకేతంగా భావించేవారు. ముఖ్యంగా గాఢమైన నలుపు రంగులోని ఓనిక్స్ రత్నాలను ధరించడానికి వెనుకాడేవారు. విశేషమేమిటంటే, విదేశాలకు నౌకలలో వెళ్లే చైనా వర్తకులు మిగిలిన రత్నాలతో పాటు ఓనిక్స్ రత్నాలతోనూ వ్యాపారం చేసేవారు. మిగిలిన రత్నాలను తిరిగి వచ్చేటప్పుడు స్వదేశానికి తీసుకొచ్చేవారు గాని, ఓనిక్స్ రత్నాలను స్వదేశానికి రాక ముందే అయినకాడికి అమ్మేసేవారు. నలుపు రంగు ఓనిక్స్కు అరబిక్ భాషలో ‘ఎల్ జజా’ అనే పేరు ఉంది. అంటే, విషాదం అని అర్థం. విక్టోరియన్ కాలంలో బ్రిటన్‌లో ప్రముఖుల అంత్యక్రియలకు హాజరయ్యేవారు జెట్‌తో పాటు నలుపు రంగు ఓనిక్స్తో తయారైన ఆభరణాలను సంతాప సూచకంగా ధరించేవారు. ప్రేమ తాపాన్ని ఉపశమింపజేసేందుకు ప్రాచీన భారతీయులు ఓనిక్స్ రత్నాలను ధరించేవారని పదహారో శతాబ్దికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞశాలి గిరొలామో కార్దానో తన గ్రంథంలో రాశాడు. విపరీతమైన భావోద్వేగాలను నియంత్రణలో ఉంచడానికి ఓనిక్స్ రత్నం బాగా పనిచేస్తుందని కొందరు ప్రాచీనులు నమ్మేవారు. అయితే, ఇది జీవనోత్సాహాన్ని కూడా తగ్గించి, దిగులు గుబులు పెంచుతుందని చాలామంది ఈ రత్నాన్ని ధరించడానికి భయపడేవారు. నల్లని ఓనిక్స్ రత్నాలకు ప్రేతాత్మలను ఆకర్షించే లక్షణం ఉందనే నమ్మకం కూడా అప్పట్లో బలంగా ఉండేది. ఓనిక్స్ రత్నాలకు సంబంధించి కొన్ని సానుకూల నమ్మకాలు కూడా ఉండేవి. ప్రాచీన రోమన్ సైనికులు ఓనిక్స్ రత్నాలపై యుద్ధాలకు అధిష్ఠాన దేవుడైన ‘మార్స్’ రూపాన్ని చెక్కించి, లాకెట్‌లా ధరించేవారు. దీనివల్ల యుద్ధంలో గెలుపు సాధించగలమని వారు నమ్మేవారు. నలుపురంగు ఓనిక్స్ రత్నాన్ని ధరించడం వల్ల మూర్ఛవ్యాధి తగ్గుతుందని పర్షియన్లు నమ్మేవారు. ప్రాచీనకాలం నుంచి వివిధ దేశాల్లో ఓనిక్స్ రత్నాలు వాడుకలో ఉన్నప్పటికీ, వీటి శిల్పాలు, గృహోపకరణాలతో పోల్చితే, ఆభరణాల్లో వీటి వినియోగం చాలా తక్కువగానే ఉండేది. నల్లని ఓనిక్స్ రత్నాలకు పూసల్లా రంధ్రాలు చేసి, వాటిని కూర్చిన దండలను ప్రాచీన, మధ్యయుగాల కాలంలో ఎక్కువగా మంత్రగాళ్లు, మంత్రగత్తెలు ధరించేవారు. ఆధునిక ఫ్యాషన్‌రంగంలో మార్పులు మొదలైన తర్వాతనే జనాలు ఓనిక్స్ రత్నాలను కాస్త ధైర్యంగా ఆభరణాల్లో ధరించడం మొదలైంది. చదవండి: పింక్‌బెల్ట్ మిషన్ ఏం చేస్తుందో తెలుసా? -
మంత్రగత్తె ముసుగుపై పోరాటం
పల్లెజీవనంలో స్వచ్ఛత ఉంటుంది. అమాయకత్వం కూడా ఉంటుంది. అక్కడే మూఢవిశ్వాసాలు కూడా బలంగా ఉంటాయి. మంత్రాలతో, చేతబడులతో మమ్మల్ని నాశనం చేస్తున్నారన్న అపోహలతో అలాంటి వారిని వేటాడి చంపాలనుకుంటారు. మంత్రాల నెపంతో జరిగే దారుణాలకు అడ్డుకట్టవేయడానికి కృషి చేస్తున్న స్త్రీ మూర్తి బిరుబాలా. గ్రామాల్లోని ఇలాంటి దురాచారాలకు, మంత్రవిద్యలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 63 ఏళ్ల బిరుబాలా మంత్రగత్తెలు అనే పేరుతో మహిళలను చంపడం, వారిపై జరిగే దాడులను అడ్డుకోవడానికి ఆమె చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరుగుతుంది. అలా 15 ఏళ్లుగా 42 మంది మహిళల ప్రాణాలను కాపాడింది. బిరుబాలా సేవలకు గాను ఇప్పటికే ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి. ఈ యేడాది భారత ప్రభుత్వం బిరుబాలా సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డును ఇచ్చి సత్కరించింది. అస్సామ్ రాష్ట్రం గోల్పరా జిల్లాలో ఓ మారుమూల ప్రాంతంలో ఉంటారు బిరుబలా రభా. బెదిరింపులు ఎదురైనా సమాజానికి పట్టిన మూఢాచార దెయ్యంపై ఆమె ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉంది. ఊరూరా తిరుగుతూ.. ఆమె ప్రస్తుతం 15 మంది సభ్యులతో కలిసి ‘విచ్ హంట్స్’ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేస్తోంది. ‘మంత్రగత్తెలు’ అనే పేరుతో మహిళల ప్రాణాలు తీసే దుష్టచర్యకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటాను’ అంటారు ఆమె. బిరుబాలా ఈ విషయమ్మీద మరింత స్పష్టతను వ్యక్తం చేస్తూ –‘నా విధానాలు నచ్చిన వ్యక్తులతో కలిసి గ్రామీణ ప్రాంతాలలో పర్యటించడం ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. అస్సాంలో పురుషులను కూడా ‘మంత్రగాళ్లు’ అనే నెపంతో చంపాలని ప్రయత్నాలు చేస్తుంటారు. 1996లో మతిస్థిమితం సరిగ్గా లేని బిరుబాలా కుమారుడిని ‘మంత్రగాడు’ అనే నెంపతో చంపాలని చూశారు. దీంతో తల్లడిల్లిన ఆమె ‘మిషన్ బిరుబాలా’ అని ఆ రోజునే మొదలుపెట్టారు. అందుకు స్థానిక సామాజిక కార్యకర్తలు, స్కూల్ టీచర్లు, వైద్యుల సహాయంతో మంత్రగత్తెల వేటకు వ్యతిరేకంగా ఒక బిల్లును సూచించారు. ఊరి నుంచి వెలి మంత్రవిద్య వ్యతిరేక చట్టాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇలాంటి ప్రమాదకరమైన పద్ధతులను అంతం చేయడంలో సమాజానిది కీలకప్రాత అని తెలిపారు. 2010 నుండి మంత్రగత్తె–వేట పేరిట అస్సాం అంతటా దాదాపు 80 మంది మరణించారు. ఇటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా స్వరం పెంచినందుకు ఒకప్పుడు తన ఊరి నుండే తరిమేయబడిన బిరుబాలా 42 మంది మహిళలను రక్షించారు. దయచేసి విడిచిపెట్టండి.. అస్సాం అసెంబ్లీ విచ్ హంటింగ్ యాక్ట్ 2015లో ఆమోదించింది. ఈ చట్టం మంత్రగత్తె పేరుతో మనుషులను వేటాడటం సరికాదనడానికి సహాయపడుతుంది. దీని పట్ల మరింత సామాజిక అవగాహన కల్పించడానికి అదనపు డైరెక్టర్ జనరల్ పోలీస్ కులాధర్ సైకియా 2001లో ప్రాజెక్ట్ ప్రహరీని ప్రారంభించారు. 2015లో సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డును బిరుబాలాకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బిరుబాలా మాట్లాడుతూ ‘మూఢనమ్మకాలు పెరగడానికి కారణం సరైన విద్య, ఆరోగ్య సదుపాయాలు గిరిజనులకు లేకపోవడమే. సదుపాయాలు కల్పించండి. నిందితులను దయతో విడిచిపెట్టండి’ అని వివరించి మానవత్వాన్ని చాటుకుంది. గౌరవ డాక్టరేట్.. బిరుబాలా సేవలను గుర్తించిన అస్సాం ప్రభుత్వం ఉత్తమ సామాజిక వ్యవస్థాపక పురస్కారాన్ని అందించింది. దీంతో పాటు మరెన్నో అవార్డులు బిరుబాలాను వరించాయి. మంత్రవిద్య, మంత్రగత్తె వేటకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బిరుబాలాకు గౌహతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన మూఢాచార వ్యవస్థను ఒక్కరి వల్ల ఏమవుతుందిలే అనుకోకుండా గళం విపి, కదం తొక్కి వ్యవస్థను గాడిన పెట్టిన బిరుబాలా లాంటి వ్యక్తులు ఎక్కడునా ఆదర్శప్రాయమైనవారే. -
అసోంలో అమానుష ఘటన!
దిస్పూర్: అసోంలోని ఒక గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సమాజం ఎంతో ముందుకు వెళ్తూ విజ్ఞానం పెరిగినప్పటికీ ఇంకా మూడ నమ్మకాల భ్రమలో నుంచి చాలా మంది బయటపడలేక పోతున్నారు. మంత్రగత్తె అన్న అనుమానంతో ఒక వృద్ధ మహిళను గ్రామస్తులు తల నరికి చంపారు. ఈ ఘటనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన 28 ఏళ్ల టీచర్‌ను కూడా గ్రామస్తులు విచక్షణారహితంగా తల నరికి ప్రాణం తీసేశారు. డోక్మోకా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాంగ్హిన్ రహీమాపూర్లో ఈ సంఘటన జరిగింది. గ్రామంలో రామావతి హలువా అనే మహిళ క్షుద్రపూజలు చేస్తుందనే నెపంతో గ్రామస్తులు ఆమెపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనను అడ్డుకోవడానికి అక్కడే ఉన్న ఉపాధ్యాయురాలు బిజోయ్ గౌర్ ప్రయత్నించి, మూఢనమ్మకాల కారణంగా ఇలాంటి పనులు చేయవద్దు అని నిలువరించే ప్రయత్నం చేసింది. దీంతో కోపం తెచ్చుకున్న గ్రామస్తులు ఆమెపై దాడి చేసి తల నరికేశారు. తరువాత వారి మృతదేహాలను కొండ ప్రాంతాలకు తీసుకువెళ్లి దహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన వారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని జిల్లా ఎస్పీ తెలిపారు. వారందరూ ఆర్ధికంగా వెనుకబడిన వారని, వారిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. చదవండి: జాతిపితపై గుడ్లు, రాళ్లు రువ్విన వేళ -
రోగం పోతుందంటూ మంత్రాలు, కానీ..
సాక్షి, హైదరాబాద్: మంత్రాలతో రోగం మాయం చేస్తానని చెప్పి ఓ మంత్రగాడు నిండు ప్రాణం బలి తీసుకున్నాడు. మంత్రగాన్ని నమ్మినందుకు తన భర్తను బలి తీసుకున్నాడని మృతుడి భార్య ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం వెలిగొండ గ్రామంలో నివాసిస్తూ లారీలో లోడింగ్‌లో దినసరి కూలీగా జీవనం సాగిస్తున్న మహేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో (కడుపు నొప్పి) తో బాధపడుతునాడు. ఎన్ని ఆసుపత్రులు జబ్బు తగ్గకపోవడంతో వారి బంధువుల సలహా మేరకు నంది వనపర్తిలో శ్రీహరి అనే మంత్రగాడి దగ్గరకు ఈ నెల 24న వెళ్లారు. ఒక రోజు మంత్రాలు వేసి పటం గీసి నేను బాగు చేస్తానంటూ 20వేల రూపాయల వసూలు చేశాడు. రూ.10 వేలు అడ్వాన్స్‌గా మహేష్ ముట్టజెప్పాడు. శ్రీహరి ఇంటిదగ్గరే మంత్రాల సామాగ్రితో కొన్ని కార్యక్రమాలు చేశారని మహేష్ బంధువులు తెలిపారు. దాంతో మహేష్ రోగం మరింత ముదిరి ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి నందివనపర్తి గ్రామంలో ప్రాణాలు విడిచాడు. రోగం నయం చేస్తానని నమ్మించి ప్రాణాలు తీసిన శ్రీహరి పై చర్యలు తీసుకోవాలని మహేష్ భార్య శివారని పోలీసులను వేడుకున్నారు. మాయమాటలతో భర్తను కోల్పోయానని కన్నీరుమున్నీరయ్యారు. ఏడు నెలల క్రితమే మహేష్, శివారని వివాహం జరిగిది. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి. కాగా, శివారని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అపార్ట్మెంట్లోకి అనుమతి లేదన్నందుకు దారుణం) -
మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు
పాట్నా: బిహార్‌లో అమానుష ఘటన జరిగింది. మంత్రగత్తెలన్న అనుమానంతో ముగ్గురు మహిళలను చిత్రహింసలకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముజఫర్‌పూర్‌లోని డక్రామా గ్రామంలో ముగ్గురు మహిళలను గ్రామస్తులు మంత్రగత్తెలుగా భావించారు. వారివల్ల తమకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన గ్రామ ప్రజలు అంతా ఏకమై వారిపై దాడికి దిగారు. మహిళల గుండు గీయించి, అర్ధనగ్నంగా ఊరేగిస్తూ పైశాచికత్వం ప్రదర్శించారు. అంతేకాక వారిచేత మూత్రం తాగిస్తూ నీచానికి ఒడిగట్టారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (అశ్లీల ఫొటోలు షేర్ చేసి.. ఆపై..) -
మంత్రగత్తె ముద్రవేసి..
గంజాం : మనలాంటి మనిషే అయినా కేవలం 20 కాలివేళ్లు, చేతులకి 12 వేళ్లతో జన్మించినందుకు 63 ఏళ్ల వృద్ధురాలిని నాలుగు గోడలకే పరిమితం చేసిన ఘటన ఒడిశాలోని గంజాంలో వెలుగు చూసింది. గంజాం జిల్లా కదపడ గ్రామంలో 63 ఏళ్ల మహిళ నయక్ కుమారి తాను చేయని పాపానికి వివక్షకు గురైంది. తనను మంత్రగత్తె ముద్ర వేసి ఇరుగు పొరుగు వారు తనను ఇల్లు కదలనీయడం లేదని ఆమె వాపోయింది. తాను పుట్టుక లోపంతోనే ఇలా ఉన్నానని, పేదరికం కారణంగా చికిత్స చేయించుకోలేదని తనను మంత్రగత్తెగా స్ధానికులు భావిస్తూ దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు తమది చిన్నగ్రామమని, ఇక్కడి ప్రజల్లో మూఢనమ్మకాలు పేరుకుపోయాయని, దీంతో ఆమెను మంత్రగత్తెగా అందరూ భావిస్తున్నారని కుమారి దీనగాధను అర్ధం చేసుకున్న మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఒకటి రెండు వేళ్లు అధికంగా ఉండటం అసాధారణమేమీ కాదని సర్జన్ డాక్టర్ పినాకి మహంతి చెప్పారు. అయితే 20 కాలి వేళ్లు, 12 వేళ్లు ఉండటం అరుదని, జన్యుపరంగా ఇలాంటివి జరగవచ్చని, ప్రతి ఐదు వేల మందిలో ఒకరిద్దరికి ఇలా జరుగుతుందని తెలిపారు. వైద్య పరమైన విషయంలో సామాజిక వివక్ష తగదని ఆయన పేర్కొన్నారు. -
మంత్రగత్తె ముద్ర వేసి చెప్పుల దండతో ఊరేగింపు..
సిమ్లా : మంత్రగత్తె ముద్ర వేసి 81 ఏళ్ల మహిళ ముఖానికి నల్ల రంగు పూసి, చెప్పుల దండతో ఊరేగించిన ఘటనకు సంబంధించి 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హిమాచల్‌ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ పోలీసులను ఆదేశించారు. సర్కాఘట్ సబ్‌డివిజన్‌లోని సమహాల్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలిని మంత్రాల నెపంతో హింసించిన కేసులో 21 మందిని అరెస్ట్ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని మండి ఎస్పీ గౌరవ్ శర్మ తెలిపారు. కాగా ఇలాంటి ఘటన జరుగుతుందనే ఆందోళనతో తాను అక్టోబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితురాలు కుమార్తె వెల్లడించారు. ఫిర్యాదు రాగానే పోలీసులు గ్రామాన్నిసందర్శించారని అయితే తర్వాత ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని అధికారులు తెలిపారు. -
అయినవాళ్లు రోడ్డున పడేస్తే...
నైజీరియాలో మంత్రగాడి పేరుతో బహిష్కరణకు గురైన పసివాడిని ఓ స్వచ్ఛంద సంస్థ ఆదుకున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఆఫ్రికాలో అనాథ బాలల కోసం స్వచ్ఛంద సంస్థ స్థాపించిన అంజా రింగ్రెన్ లోవెన్ ఎంతో కష్టపడి మరీ ఆ పిల్లాడిని వెదికి పట్టుకుంది. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న ఆ బాలుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఎముకల గూడులా మారి, నిస్సహాయంగా దొరికిన చిన్నారి మొఖంలో నవ్వులు పూయించింది. వివరాల్లోకి వెళితే నైజీరియాలో మంత్రగాడు అనే నెపంతో ఓ పసి బాలుడిని కుటుంబసభ్యులు రోడ్డున పడేశారు. సుమారు ఏడాదిన్నర వయసు ఉన్న ఆ పిల్లాడిని ఆకలితో మాడ్చి చంపేయాలని అలా మూర్ఖంగా వదిలేశారు. చంటి బిడ్డ అలా రోడ్డున తిరుగుతున్నా... ఏ ఒక్కరూ జాలి పడలేదు. సరికదా మంత్రగాడంటూ దుర్భాష లాడుతూ, అమానుషంగా ప్రవర్తించారు. అలా ఎనిమిది నెలల నుంచి నడిరోడ్డుపై జీవనం సాగించిన ఆ చిన్నారి అష్టకష్టాలు పడ్డాడు. కడుపు నింపుకోవడం కోసం రోడ్డు మీద ఏది పడితే అది తిన్నాడు. ఫలితంగా కడుపంతా నులి పురుగులు పట్టాయి. రక్త ప్రసరణ సన్నగిల్లింది. ఒళ్లంతా మట్టి కొట్టుకుపోయి శరీరమంతా విషమయంగా మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న లోవెన్ ఆ పిల్లాడిని వెతికి పట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టి చివరికి సాధించింది. చిక్కి శల్యమై ఎముగల గూడులా మారిన ఆ చిన్నారిని చేరదీసి 'హోప్' అని పేరు పెట్టింది. సపర్యలు చేసి స్నానం చేయించి... ఆసుపత్రిలో చేర్చింది. దీంతోపాటుగా బాలుడి సహాయార్ధం లోవెన్ సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్థిక సాయాన్ని అర్ధించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. రెండు రోజుల్లో ... పదిలక్షల డాలర్లు సమకూరాయి. 'ఇపుడు హోప్ నవ్వుతున్నాడు.. తనకు తానుగా కూర్చుంటున్నాడు. నా కొడుకుతో ఆడుకుంటున్నాడంటూ' లోవెన్ తన సంతోషాన్ని ఫేస్బుక్ ద్వారా పంచుకుది. కాగా 'ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ పౌండేషన్ ' అనే సంస్థను స్థాపించిన లోవన్ గత మూడేళ్లుగా తన సేవలందిస్తోంది. భర్త డేవిడ్ ఇమ్మానుయేల్ ఆమెకు పూర్తిగా అండగా ఉన్నారు. 2016, జనవరి 29న ఆ బాలుడి ఆచూకీ కనుక్కొని లోవెల్ చేరదీసింది. ఆ రోజు నుంచి అతడిని కంటికి రెప్పలా కాపాడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు హోప్ ఆసుపత్రిలోనే ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడినట్టు లోవెన్ ఫేస్ బుక్ ద్వారా తెలిపింది. తనంతట తాను ఆహారం తీసుకోగలుగుతున్నాడని పేర్కొంది. కాగా ఆఫ్రికా దేశాల్లో చాలాచోట్ల ఇలాంటి అనాగరిక అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వేలాదిమంది హోప్ లాంటి పిల్లలు వీధి పాలవుతున్నారు. -
పీఛేముడ్ జైలుకెళ్లిన మంత్రగత్తె..
ఒకప్పుడు బ్రిటిష్ చట్టాలు చేతబడి వంటి విద్యలను శిక్షార్హమైన నేరాలుగా పరిగణించేవి. ‘హెల్లిష్ నెల్’గా పేరుమోసిన మంత్రగత్తెకు 1944లో బ్రిటిష్ ప్రభుత్వం చేతబడుల చట్టం (విచ్‌క్రాఫ్ట్ యాక్ట్) కింద జైలుశిక్ష విధించింది. చేతబడి నేరానికి జైలుశిక్ష అనుభవించిన చిట్టచివరి మంత్రగత్తెగా ఈమె చరిత్రలో నిలిచిపోయింది. ‘హెల్లిష్ నెల్’ అసలు పేరు హెలెన్ మెక్‌ఫార్లేన్. మంత్రతంత్రాల సాధనలో మునిగితేలే ఈమెను పదహారో ఏటనే తల్లిదండ్రులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తర్వాత ఆమె హ్యారీ డన్కన్ అనే మంత్రగాడిని పెళ్లాడింది. ఇద్దరూ కలసి ఆత్మలతో సంభాషణ పేరిట జనాన్ని యథాశక్తి బురిడీ కొట్టిస్తూ బాగా సొమ్ము చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పాశ్చాత్య దేశాలలో ఇలాంటి విద్యలకు గిరాకీ మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం నాటికి అక్కడి జనాల్లో ఈ పిచ్చి పీక్కు చేరుకుంది. అలాంటి రోజుల్లో ‘హెల్లిష్ నెల్’ ప్రదర్శనలకు జనం తండోప తండాలుగా వచ్చేవారు. ప్రదర్శనలకు వచ్చే వారి నుంచి ఆమె భారీగా ప్రవేశ రుసుము వసూలు చేసేది. ఆమె ప్రదర్శించేదంతా బురిడీ విద్య మాత్రమేనంటూ 1931లోనే హ్యారీ ప్రైస్ అనే మానసిక శాస్త్రవేత్త బయటపెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, ఆమె వ్యవహారం ప్రభుత్వానికే ఎసరుపెట్టే స్థాయికి చేరుకోవడంతో, చట్టాన్ని ప్రయోగించింది. ఇంతకీ ఏమైందంటే, 1941లో బ్రిటిష్ యుద్ధ నౌక ‘బర్హామ్’ జర్మనీ సమీపంలో తుపాను ధాటికి సముద్రంలో మునిగిపోయింది. అందులోని 800 మందీ మరణించారు. ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చెందుతాయని భావించి ప్రభుత్వం ఈ సంగతిని దాచిపెట్టింది. ఆ సంఘటన తర్వాత కొన్నాళ్లకు తన వద్దకు వచ్చిన ఒక మహిళతో ‘బర్హామ్’ నౌకలోని ఆమె కొడుకు మరణించాడని, ఆ నౌక మునిగిపోయిందని ‘హెల్లిష్ నెల్’ చెప్పింది. ఈ సంగతి కలకలం రేపడంతో పోలీసులు ఆమె ప్రదర్శనపై దాడిచేసి, అరెస్టు చేశారు. పాతబడ్డ ‘విచ్‌క్రాఫ్ట్’ చట్టం కింద ఆమెకు శిక్ష విధించారు. ఆ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన విన్స్టన్ చర్చిల్, ఆమెకు కాలంచెల్లిన చేతబడుల చట్టం కింద శిక్ష విధించడాన్ని ఖండించడమే కాకుండా, ఆ చట్టాన్ని రద్దు చేశాడు. -
మంత్రగత్తెలని ఐదుగురి హత్య
జార్ఖండ్‌లో దారుణం 27 మంది అరెస్ట్ రాంచీ: జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో మంత్రగత్తెలనే నెపంతో ఐదుగురు మహిళలను దారుణంగా హత్య చేశారు. గిరిజన ప్రాబల్యమున్న కంజియా గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. గ్రామస్తులు కొందరు.. 32-50 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు మహిళలను వారి ఇళ్ల నుంచి లాకొచ్చి, క్షుద్రవిద్యలకు పాల్పడుతున్నారంటూ లాఠీలు, పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపారు. తర్వాత మృతదేహాలను సంచుల్లో ఉంచి ఊరి బయట పడేశారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి శనివారం ఉదయం వెళ్లగా గ్రామస్తులు నిరసన తెలిపారు. గ్రామంలో ఇటీవల ముగ్గురు చనిపోవడంతో హత్యకు గురైన మహిళలు చేతబడులకు పాల్పడుతున్నారని వదంతులు వ్యాపించాయి. ఈ కేసుకు సంబంధించి 50 మందిని నిందితులుగా గుర్తించామని, 27 మందిని అరెస్ట్ చేశామని డిప్యూ టీ ఐజీ అరుణ్ కుమార్ తెలిపారు. జార్ఖండ్‌లో ఇలాంటి దారుణాలు తరచూ జరుగుతున్నాయి. 2013 దేశవ్యాప్తంగా మంత్రగత్తెలనే నెపంతో 160 మంది మహిళలు హత్యకు గురికాగా, వారిలో 54 హత్యలు జార్ఖండ్‌లోనే జరిగాయి. 2001 నుంచి రాష్ట్రంలో 400 మంది మహిళలను ఇదే కారణంతో హత్య చేశారు. దేశంలో 2001-12 మధ్య ఇలాంటి హత్యలు 2,097 జరిగినట్లు జాతీయ నేర రికార్డుల సంస్థ అంచనా వేసింది. కాగా తాజా హత్యలను జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ఖండించారు. ప్రస్తుత విజ్ఞాన యుగంలో ఇలాంటి ఘటనలు జరగడం విషాదకరమని, దీనిపై సమాజం ఆలోచించాలని ఓ ప్రకటనలో కోరారు. తాజా హత్యలను జార్ఖండ్ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా ఖండించింది. వీటిని అరికట్టేందుకు, మహిళలకు భద్రత కల్పించి, ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పటిష్టమైన విధానం అవసరమని కమిషన్ చైర్పర్సన్ మహువా మాంఝీ చెప్పారు. వితంతువుల భూములను లాక్కోవడానికి కొందరు స్వార్థపరులు వదంతులు ప్రచారం చేస్తున్నారని, తమకు గిట్టని మహిళ ఎన్నికల్లో పోటీ చే స్తే ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారన్నారు. నిరుద్యోగం, నిరక్షరాస్యత, పట్టణాలతో రోడ్ల అనుసంధానం లేకపోవడం మూఢనమ్మకాలకు కారణమని ఆమె పేర్కొన్నారు. -
మంత్రాల పేరుతో వృద్ధురాలి తల నరికివేత
గౌహతి: అసోంలో అమానుషం చోటు చేసుకుంది. చేతబడి నెంపతో గ్రామస్తులంతా కలిసి అరవైమూడేళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సోనిత్ పూర్జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానిక దేవాయలంలో దేవుని ప్రతినిధిగా, అమ్మగా చలామణిలో ఉన్న అనిమా రోఘంటి (35) అనే మహిళ ఈ ఘాతుకానికి పురికొల్పింది. ఓరంగ్ అనే ఆదివాసీ వృద్ధురాలి వల్ల గ్రామానికి చెడు జరగబోతోందని చెప్పింది. ఆమె చేతబడులు చేస్తోందని గ్రామస్తులను నమ్మబలికింది. దీంతో ఆగ్రవేశాలతో ఊగిపోయిన జనం..వృద్ధురాలిని ఇంటినుంచి బైటికి లొక్కొచ్చారు. సుమారు 200 మంది గ్రామస్తులు ఆమెను చుట్టుముట్టారు. నడివీధిలో పట్టపగలు నగ్నంగా ఊరేగించారు. గ్రామం నడిబొడ్డులో నిర్దాక్షిణ్యంగా తలనరికి వేశారు. కాగా అనిమా చెప్పిన జోస్యం ఆధారంగా గ్రామస్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఎస్పీ సమద్ హుస్సేన్ తెలిపారు. అనిమా భర్తతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు, మరికొంతమంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అసోంలో గత అయిదేళ్లలో వందమందికికి పైగా మహిళలను చేతబడి చేస్తున్నారనే అనుమానంతో హతమార్చిన ఘటనలు నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పెచ్చుమీరుతున్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ముందని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో అవగాహనా సదస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతబడులకు వ్యతిరేకంగా చట్టం చేయాలనే ఆలోచనలో ఉంది. -
మంత్రగత్తె నెపంతో జాతీయ క్రీడాకారిణిపై దాడి
దిపూ(అసోం): జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ మహిళపై మంత్రగత్తె అనే అనుమానంతో దాడి చేసిన ఘటన అసోంలో చోటు చేసుకుంది. కర్బి అంగోలా జిల్లా చేరేకులిలో కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. జావలిన్ త్రోలో జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన దేబజాని బోరాను నిందితులు బుధవారం సాయంత్రం కట్టేసి చితకబాదినట్లు ఎస్పీ ఎంజే మహంతా తెలిపారు. గ్రామంలో సమస్యలకు ఆమే కారణమనే అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. గాయపడి స్పృహ కోల్పోయిన దేబజానిని ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. దీనికి సంబంధించి ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.