పెట్రోల్ బంకుల్లో లిమిట్!
సిమ్లా: రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మీరు ఎంత మొత్తంలో పెట్రోల్, డీజిల్ కావాలని అరచి గోల చేసినా మేం మాత్రం 500 రూపాయల పెట్రోల్ మాత్రమే పోస్తామంటూ వినియోగదారులకు స్పష్టం చేశారు. దీంతో ఎక్కువ మొత్తంలో పెట్రోల్ పోయించుకొని బ్యాంకులకు వెళ్లకుండానే రూ. 500, 1000 రూపాయలను 'సేల్' చేద్దామనుకున్న వాహనదారులకు చుక్కెదురైంది.
దేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల నిర్వాహకులను చిల్లర కష్టాలు వేదిస్తున్న సంగతి తెలిసిందే. చిల్లర కష్టాలను తొలగించేందుకు టోల్ గేట్ల వద్ద టోల్ట్యాక్స్‌ను సైతం ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. నేటి నుంచి బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. అయితే.. ఒక్కో వ్యక్తికి 4 వేల వరకు మాత్రమే పరిమితి ఉంది. రేపటి నుంచి ఏటీఎంలు పనిచేయనున్నాయి.