ఢిల్లీ కాలుష్యం హిమచల్ ప్రదేశ్ కాసులు పండిస్తోంది. ఇదేంటి అనుకుంటున్నారా. ఇది అక్షరాల నిజం. కాలుష్య కాసారంగా మారిన దేశ రాజధాని నుంచి హిమచల్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. స్వచ్ఛమైన గాలికోసం సిమ్లా, ధర్మశాలకు తరలివస్తున్నారు. హస్తినలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో టూరిస్టులు ఢిల్లీవైపు చూసేందుకు జంకుతున్నారు. ఢిల్లీవాసులు కూడా కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు శీతల ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో హిమచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సిమ్లా, ధర్మశాల టూరిస్టులతో కిటకిటలాడుతున్నాయి.