వ్యాక్సినేషన్‌ పూర్తి.. మరోసారి పాజిటివ్‌ | doctors found Covid positive 10 days after vaccine | Sakshi
Sakshi News home page

టీకా తీసుకున్న పదిరోజులకే పాజిటివ్‌

Published Sat, Feb 13 2021 1:25 PM | Last Updated on Sat, Feb 13 2021 4:04 PM

doctors found Covid positive 10 days after vaccine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన మహ్మమారి కరోనా వైరస్‌ ఇప్పటికీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నప్పటికీ ఏదో ఒక మూలన దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా భారత్‌లోనూ అక్కడక్కడ కరోనా కొత్త కేసులు రావడం ఆందోళన కలుగుతోంది. అయితే వ్యాక్సిన్‌ వారికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వైద్యులను సైతం కలవరానికి గురిచేస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజీలో వైద్యులుగా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురికి తాజాగా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. వీరిలో వైద్యులైన భార్యభర్తలు కూడా ఉన్నారు. వారు 10 రోజుల కిందటే వ్యాక్సిన్‌ తొలి డోసును తీసుకున్నారు.

గత రెండు రోజులుగా వారిలో స్పల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో అత్యున్నత వైద్య బృందం సమక్షంలో మరోసారి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గిరికీ పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక కూడా పాజిటివ్‌గా తేలడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం వారిని కోవిడ్‌ వార్డులో ఐసోలేషన్‌ చేసినట్లు తెలిపారు. అయితే ఇతరుల ద్వారానే వైరస్‌ వీరికి సోకినట్లు డాక్టర్‌ పతానియా వెల్లడించారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా రెండో డోస్‌ ప్రక్రియ కూడా ఆరంభమైన విషయం తెలిసిందే. తొలిడోస్‌ వేసుకున్న వారికి ఈ విడతలో వ్యాక్సిన్‌ వేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement