విమానయానరంగంలో భారీ అవకాశాలు | UDAN Scheme Takes Off BY PM Modi says :air travel not just for rich anymore | Sakshi
Sakshi News home page

విమానయానరంగంలో భారీ అవకాశాలు

Published Thu, Apr 27 2017 11:44 AM | Last Updated on Tue, Oct 2 2018 7:21 PM

విమానయానరంగంలో భారీ అవకాశాలు - Sakshi

విమానయానరంగంలో భారీ అవకాశాలు

సిమ్లా:  విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకూ అందుబాటులో కితీసుకొచ్చే ప్రణాళిలో భాగంగా  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ఉడాన్‌ ​ విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు.   ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకంలో భాగంగా  మొట్టమొదటి ‘ఉడాన్’ ప్రాంతీయ విమానాలను   హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో ప్రధాని  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ప్రసంగించిన  ప్రధాని ఇక విమాన  ప్రయాణాలు కేవలం ధనికులకు మాత్రమే కాదు, పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయని  వ్యాఖ్యానించారు.   దేశీయ  విమానయారంగం భారీ అవకాశాలతో నిండి ఉందని  తెలిపారు.

చండీగడ్‌ విమానాశ్రయంలో  హర్యానా ముఖ‍్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌,  పంజాబ్ గవర్నర్‌  వి.పి. బడ్నోర్ హర్యానా గవర్నర్‌ కెప్టెన్‌ సింగ్ సోలంకి, ఇతర ముఖ్య అధికారులు మోదీకి స్వాగతం పలికారు. సిమ్లా-ఢిల్లీ మార్గంతో సహా,  కడప-హైదరాబాద్‌, నాందేడ్‌-హైదరాబాద్‌ మార్గాల్లోనూ ఉడాన్‌ విమాన సర్వీసులను  మోదీ ప్రారంభించారు. ప్రపంచ విమానయాన రంగంలో ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.

 
సిమ్లాలో ప్రధాని  చారిత్రాత్మక రిడ్జ్ మైదాన్‌ లో  ఒక ర్యాలీలో ప్రసంగించనున్నారు.  ప్రధానమంత్రి  పదవిని చేపట్టిన అనంతరం  సిమ్లాకు రావడం ఇదే  మొట్టమొదటి సారి . ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 2003 లో హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో పర్యటించారు.  
కాగా గంట ప్రయాణానికి రూ.2,500 మాత్రమే వసూలు చేయాలనే ఉద్దేశంతోఅందుబాటులోకి తీసుకువస్తామని మోదీ సర్కార్ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement