సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సిమ్లా జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. స్వారా నుంచి తియునికి వెళ్తున్న జీపుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. జీపులో ఉన్న వారిలో పది మంది అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు. మృతుల్లో మూడు జంటలు, వారి పిల్లలూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment