అది అయిదు అంతస్తుల భవనం.. చుట్టు కొండల మధ్య ఒక్కటే బిల్డింగ్. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. అందరూ చూస్తుండగానే పేకమేడల్లా నెలకొరిగింది. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. అసలు ఏం జరిగిందంటే.. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాకు 26 కిలోమీటర్ల దూరంలో ధామి పట్టణంలోని మరహ్వాగ్ అనే గ్రామం ఉంది. అక్కడ రాజ్ కుమార్ అనే వ్యక్తికి అయిదు అంతస్తుల భవనం ఉంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి.
కొండ రాళ్లు ఈ బిల్డింగ్ గోడలను ఢీకొట్టాయి. ఈ క్రమంలో దానికి మరమ్మత్తులు చేశారు. అయినా కొన్ని రోజులుగా బిల్డింగ్‌లో కదలికలు రావడంతో అప్రమత్తమైన యజమాని.. బిల్డింగ్‌లోని నివాసితులను ఖాళీ చేయించి, మళ్లీ రిపేర్ చేయాలని భావించాడు. అధికారులను స్పందించగా బిల్డింగ్ ఎప్పుడైనా కూలిపోతుందని.. మరమ్మతులు చేయించిన ఫలితం ఉండదని చెప్పడంతో ఆ బిల్డింగ్‌ను అలాగే ఉంచేశాడు.. దీంతో కొన్ని రోజులకు బిల్డింగ్ బేస్‌మెంట్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. అందులోని నివాసితులను అధికారులు ముందుగానే ఖాళీ చేయించారు. విద్యుత్ సరాఫరా కూడా నిలిపివేశారు. దీంతో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ధామి ప్రభుత్వ డిగ్రీ పాఠశాలకు వెళ్లే రహదారి దెబ్బతింది. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. 15 సెకన్ల నిడివిగల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (రూరల్) నిశాంత్.. ఇంటి పైన ఉన్న కొండ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టడం వల్లే భవనం కూలిపోయిందని తెలిపారు.
చదవండి: భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. భారత్ కీలక నిర్ణయం
Breaking: Major landslide in Shimla, where a 5-story building collapsed, and cracks appeared in the adjoining area and buildings. No casualties reported till now. #Shimla #Himachal pic.twitter.com/hRVXPY45Km
— Gagandeep Singh (@Gagan4344) January 20, 2024
Comments
Please login to add a commentAdd a comment