
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా పేరును శ్యామలగా మార్చేందుకు అధికార బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హిందుత్వవాదులు, నేతల ఒత్తిడితో సిమ్లా పేరు మార్చాలనే ప్రతిపాదనకు జైరాం ఠాకూర్ నేతృత్వంలోని ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం గురించి జాతీయ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర వైద్యశాఖ మంత్రి విపిన్ సింగ్... ‘దేశంలోని చాలా మటుకు చరిత్రాత్మక ప్రదేశాల పేర్లను మార్చారు. ఒకవేళ ప్రజలు సిమ్లా పేరును శ్యామలగా మారాలని కోరుకుంటే అందులో తప్పేం ఉంది. ఈ ప్రతిపాదనను మేము కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు.
రాజధాని పేరు మార్పు విషయమై బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం రాజకీయాలకే ప్రభుత్వం పరిమితమవుతోందంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత హర్భజన్ సింగ్ భజ్జీ విమర్శించారు. కాగా ఇటీవలే ఉత్తరప్రదేశ్ ముఖ్య పట్టణం అలహాబాద్ పేరును ప్రయాగరాజ్‌గా మారుస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment