‘ఈ స్టాంప్స్’ కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆన్‌లైన్‌లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ప్రవేశపెట్టిన 'ఈస్టాంప్స్' ప్రాజెక్టుతోపాటు మరికొన్ని ప్రాజెక్టులకూ ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు లభించాయి.
'ఈ స్టాంప్స్'తోపాటు పౌరసరఫరాల, మార్కెటంగ్ శాఖలు నిర్వహిస్తోన్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్), ఈ-పీడీఎస్, ఎస్‌సీఎం (సప్లై చైన్ మేనేజ్‌మెంట్), ఓపీఎంఎస్ (ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టం), ఫిర్యాదుల పరిష్కారం వంటి ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డులకు ఎంపికయ్యాయి. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో గురువారం జరిగిన 45వ జాతీయ స్కోచ్ సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ స్టాంప్స్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ వి.శ్రీనివాసులు పురస్కారాన్ని అందుకున్నారు.