Skoch Awards
-
రాష్ట్రానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన – పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు, గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ ఏడాది రాష్ట్రానికి మొత్తం ఆరు స్కోచ్ అవార్డులు దక్కాయి. సోమవారం ఢిల్లీలో స్కోచ్ గ్రూప్ నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో రాష్ట్ర అధికారులు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పిస్తోంది. అంతేకాకఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగానూ చర్యలు చేపట్టింది. తద్వారా మహిళలు ఆర్థికంగా తమ కాళ్ల మీద నిలబడుతున్నారు. బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖకు 5 స్కోచ్ అవార్డులు దక్కడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శక పౌర సేవలు.. దేశంలోనే ఆదర్శవంతంగా సుపరిపాలన – పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు రాష్ట్రానికి స్కోచ్ అవార్డు లభించింది. గుడ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కేటగిరీలో 2021–22కి ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలో స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచర్ చేతుల మీదుగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ అవార్డును అందుకున్నారు. బ్యాంకు లింకేజీకి గోల్డ్ అవార్డు.. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని కుటుంబ ఆదాయాలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను స్కోచ్ సంస్థ రాష్ట్రాన్ని గోల్డ్ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అహ్మద్, డీజీఎం కేశవ కుమార్ అవార్డును అందుకున్నారు. స్త్రీనిధి కార్యక్రమాలకు మరో గోల్డ్ అవార్డు.. సెర్ప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్త్రీనిధి సంస్థ బ్యాంకులతోపాటు పొదుపు సంఘాల మహిళలకు అదనంగా, అత్యంత సులభ విధానంలో 48 గంటల్లోనే బ్యాంకు రుణాలను అందిస్తోంది. ఇందుకుగాను స్కోచ్ మరో గోల్డ్ అవార్డును ప్రకటించింది. స్త్రీనిధి ఎండీ కె.వి.నాంచారయ్య, డిప్యూటీ జీఎం సిద్ధి శ్రీనివాస్ ఈ అవార్డును అందుకున్నారు. జిల్లాలకు మూడు సిల్వర్ అవార్డులు.. పొదుపు సంఘాల విజయగాథలను ‘మహిళా నవోదయం’ పేరుతో ప్రతి నెలా ప్రత్యేక మాస పత్రిక రూపంలో ప్రచురించడంపై చిత్తూరు జిల్లా డీఆర్డీఏ విభాగానికి ప్రత్యేక సిల్వర్ అవార్డు దక్కింది. అలాగే నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నందుకు చిత్తూరు డీఆర్డీఏకు మరో సిల్వర్ అవార్డు దక్కింది. అదేవిధంగా పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో మహిళలు పెద్ద ఎత్తున నాటుకోళ్ల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు. దీనికి నెల్లూరు జిల్లా డీఆర్డీఏ విభాగానికి ప్రకటించిన సిల్వర్ అవార్డు లభించింది. -
ఏపీకి రెండు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డులు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పించడమే కాకుండా ఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అలుపెరగని కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో రెండు స్కోచ్ గోల్డ్, మరో నాలుగు స్కోచ్ సిల్వర్ అవార్డులను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపు వంద ప్రాజెక్టులు ఈ ఏడాది స్కోచ్ అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఆయా రాష్ట్రాలు దరఖాస్తు చేసుకున్న అన్ని ప్రాజెక్టులపై ఇప్పటికే రెండు విడతల స్కూృటినీ నిర్వహించగా.. చివరగా బుధవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పలు ప్రాజెక్టులను మరో విడత సమీక్షించి.. స్కోచ్ సంస్థ అవార్డులను ప్రకటించింది. మొత్తంగా 6 అవార్డులు మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా రుణాలు పొందటమే కాకుండా వాటిని çసద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాలను పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో అందజేస్తున్న సహాయ సహకారాలకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్థ గోల్డ్ అవార్డును ప్రకటించింది. 2019 నుంచి 2022 మార్చి వరకు మూడేళ్ల కాలంలో రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలు రూ.77,106.74 కోట్లను రుణాలుగా పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రూ.35 వేల కోట్లను రుణాలుగా అందజేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో పొదుపు సంఘాలు సగటున రూ.5.31 లక్షల చొప్పున బ్యాంకు రుణాలు పొందాయి. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతలుగా ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందిస్తోంది. ఇప్పటికే రూ. 12,758 కోట్లను వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రెండు విడతల్లో మహిళలకు ఆర్థిక సహాయం అందజేసింది. సకాలంలో రుణాలు చెల్లించే వారికి వైఎ స్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రభుత్వం తిరిగి ఆయా పొదుపు సంఘాలకు చెల్లిస్తోంది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో మహిళలు బ్యాం కుల నుంచి తీసుకుంటున్న రుణాలను 99.5 శాతం మేర సకాలంలో చెల్లిస్తూ రికార్డు సాధించారు. ‘స్త్రీ నిధి’కి మరో గోల్డ్ అవార్డు ► గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు అనుబం« దంగా పనిచేస్తున్న ‘స్త్రీ నిధి’ సంస్థ బ్యాంకులిచ్చే రుణాలకు తోడు అత్యంత సులభ విధానంలో అదనంగా రుణాలు అందజేస్తుండటంతో స్కోచ్ సంస్థ స్త్రీ నిధిని గోల్డ్ అవార్డుకు ఎంపిక చేసింది. ► ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొదుపు సంఘాల విజయ గాథలను ‘మహిళా నవోదయం’ పేరిట ప్రతినెలా ప్రత్యేక మాసపత్రిక రూపంలో ప్రచురిస్తూ సభ్యులందరికీ తెలియజేస్తున్న ఆ జిల్లా డీఆర్డీఏ విభాగానికి ప్రత్యేక సిల్వర్ అవార్డు దక్కింది. ► ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో మహిళలు పెద్దఎత్తున నాటు కోళ్ల పెంపకం చేపట్టి అధిక ఆదాయం పొందుతున్నందుకు ఆ జిల్లా డీఆర్డీఏకు మరో సిల్వర్, పాడి గేదెల పెంపకం ద్వారా ఆధిక ఆదాయం సాధించేలా చేస్తున్న చిత్తూరు జిల్లా డీఆర్డీఏకు మరో సిల్వర్, జిల్లాలో నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల నిర్వహిస్తున్నందుకు చిత్తూరు డీఆర్డీఏకు మరో సిల్వర్ అవార్డు దక్కాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాల వల్లే.. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా పొదుపు సంఘాల మహిళలకు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ ప్రోత్సాహకాల కారణంగా మహిళలు కీలకంగా ఆర్థిక కార్యకలాపాలు పెంపొందించుకుంటున్నారు. ప్రభుత్వం అందజేసే అర్థిక సహాయానికి తోడు బ్యాంకుల నుంచి అందే రుణ మొత్తాలతో కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యవసాయం మాత్రమే తెలిసిన వారు పెద్ద సంఖ్యలో పాడి గేదెలు, ఆవులు, గొర్రెల పెంపకం చేపట్టి కుటుంబ ఆదాయాన్ని భారీగా పెంచుకుంటున్నారు. ఇలా లాభదాయక కార్యకలాపాలు సాగిస్తూ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం అందజేసే ప్రోత్సహకాలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సైకిల్ చాలా వేగంగా తిరుగుతోంది. ఇలాంటి విజయాలను నమోదు చేయడంతో సెర్ప్ కార్యక్రమాలకు ఈ ఏడాది ఆరు అవార్డులు దక్కాయి. – ఇంతియాజ్ అహ్మద్, సీఈవో, సెర్ప్ -
ఏపీకి నాలుగు స్కోచ్ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు స్కోచ్ అవార్డులు వరించాయి. 2021 సంవత్సరానికి గాను జౌళి, పశు సంవర్ధక, మత్స్యసంపద, వ్యవసాయ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు ఈ అవార్డులు దక్కాయి. శనివారం ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన 83వ స్కోచ్ సమ్మిట్‌లో ఇండియా గవర్నెన్స్ ఫోరం అవార్డులను ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక, మత్య్స సంపద, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న పశు సంరక్షక యాప్, ఈ–ఫిష్, ఆర్బీకే స్థాయిలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న హార్బర్లు వంటి అనేక అంశాలను ఇతర రాష్ట్రాలతో బేరీజు వేసుకొని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీని ఎంపిక చేశారని తెలిపారు. అంతేగాక వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఉన్నాయని తెలిపారు. దేశంలోనే ఆర్బీకే వంటి వ్యవస్థ ఏదీ లేదని, దేశానికి ఇది దిక్సూచి అని స్కోచ్ సంస్థ ప్రశంసించి ఏపీకి వ్యవసాయ రంగంలో అవార్డు ఇచ్చిందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనా దక్షత, ప్రజలకు మేలు చేసేందుకు ఆయన పడుతున్న తపన కారణంగానే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఇలాంటి అవార్డులు ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కాగా జౌళి శాఖలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద అనంతపురం జిల్లాకు అవార్డు లభించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో వైఎస్సార్ చేయూత, గ్రామ, వార్డు సచివాలయాలకు ఇచ్చిన అవార్డును శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అందుకున్నారు. -
ఆ 93 పల్లె సీమల్లో అంతా ప్రకృతి సేద్యమే!
‘‘అమాయకమైన మనసుకే నిండైన ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది..’’ అంటాడు ఓ తత్వవేత్త. విజయనగరం జిల్లా మారుమూల గ్రామాల్లోని గిరిజన రైతులను చూస్తే ఈ మాట ఎంత నిజమో తెలుస్తుంది. రసాయనిక వ్యవసాయం వల్ల మనకు, పశుపక్ష్యాదులకు, ప్రకృతికి ఎంత హాని జరుగుతోందో అర్థం చేసుకున్న ఆ అన్నదాతలు వెనువెంటనే ప్రకృతి వ్యవసాయంలోకి మారిపోయారు. ఒకరు, ఇద్దరు.. పది మంది కాదు.. ఊళ్లకు ఊళ్లే ఒకటి తర్వాత మరొకటి పూర్తిగా ప్రకృతి సేద్య గ్రామాలుగా మారిపోతున్నాయి (వీటినే అధికారులు ‘బయో గ్రామాలు’గా పిలుస్తున్నారు). కొండబారిడితో ప్రారంభమైన బయో గ్రామాల ప్రస్థానం మూడేళ్లలో 93కు చేరింది. మరికొన్ని గ్రామాలు ఈ వరుసలో ఉన్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు ఒక్క గ్రాము కూడా వాడకుండా నేల తల్లికి ప్రణమిల్లుతున్నాయి. బయో గ్రామాల చిన్న, సన్నకారు రైతులు ప్రకృతిని ప్రేమిస్తూ ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, పర్యావరణ పరంగా దినదినాభివృద్ధి సాధిస్తుండటం చాలా గొప్ప సంగతి. ‘ప్రపంచ నేలల పరిరక్షణ దినోత్సవం’ (డిసెంబర్ 5) సందర్భంగా.. బయో గ్రామాల నిర్మాతలైన భూమి పుత్రులందరికీ వినమ్ర ప్రణామాలు! కొండబారిడి.. విజయనగరం జిల్లా కురుపాం మండలంలో మారుమూల పల్లె. నాడు నక్సల్బరి ఉద్యమానికి పురుడు పోసిన ‘కొండబారిడి’ గ్రామామే.. నేడు సంపూర్ణ ప్రకృతి వ్యవసాయ విప్లవానికి నాంది పలికింది. పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కొండబారిడి ‘తొలి బయో గ్రామం’గా మారటం విశేషం. ప్రకృతి వ్యవసాయ ప్రేమికులకు పాఠశాలైంది. కొండబారిడి స్ఫూర్తితో తదుపరి రెండేళ్లలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో మరో 92 (2019లో 51, 2020లో మరో 41) గిరిజన గ్రామాలు వంద శాతం ప్రకృతి వ్యవసాయ గ్రామాలుగా మారాయి. వరితో పాటు రాగి తదితర చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. జీడిమామిడి తదితర తోటల్లోనూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. బయో గ్రామాల్లో వరి, రాగి పంటలను ‘శ్రీ’ విధానంలోనే రైతులు సాగు చేస్తున్నారు. ‘అన్నపూర్ణ’ నమూనాలో ఇంటింకి అరెకరం స్థలంలో కూరగాయలు, పండ్లు తదితర 20 రకాల పంటలు పండిస్తున్నారు. 365 రోజులూ భూమికి ఆకుపచ్చని ఆచ్ఛాదన కల్పిస్తున్నారు. గతంలో సేంద్రియ కర్బనం 0.5 శాతం మేరకు ఉండేది ప్రకృతి సేద్యం వల్ల రెండేళ్ల క్రితం 120 జీడిమామిడి తోటల్లో రెండేళ్ల క్రితం భూసార పరీక్షలు చేసినప్పుడు 0.75 శాతానికి పెరిగిందని జట్టు కార్యనిర్వాహక ట్రస్టీ డా. పారినాయుడు ‘సాక్షి’తో చెప్పారు. పండించిన ధాన్యాన్ని మహిళా స్వయం సహాయక బృందాల మహిళా రైతులు రోకళ్లతో దంచి కిలో రూ. 65 రూపాయలకు నేరుగా ప్రజలకు అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మూడు చోట్ల వీరి ఆహారోత్పత్తులను విక్రయించేందుకు స్టాల్స్‌ను తెరిచారు. కొండబారిడి సహా మొత్తం 93 బయోగ్రామాల్లోని 3,690 మంది రైతులు 10,455 ఎకరాల్లో రైతులు పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరంతా కాయకష్టం చేసుకునే చిన్న, సన్నకారు రైతులే. అంతా వర్షాధార సేద్యమే. వరి సాగు ఖర్చు ఎకరానికి రూ. 3 వేల నుంచి 4 వేల వరకు తగ్గింది. అంతకు ముందు ఎకరానికి 20 బస్తాల (75 కిలోల) ధాన్యం పండేది ఇప్పుడు 30 బస్తాలకు పెరిగింది. అంటే.. దాదాపు 40 నుంచి 50 శాతం అధిక దిగుబడి పొందుతున్నారు. పొల్లు లేకపోవడం, గింజ బరువు పెరగడంతో నికర బియ్యం దిగుబడితో పాటు రైతు ఆదాయం కూడా పెరిగింది. 93 బయో గ్రామాల్లో రైతులతో పాటు ప్రజలంతా ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యదాయక ఆహారం తింటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. బయో గ్రామాల్లో 98 మంది కోవిడ్ బారిన పడినప్పటికీ ఏ ఒక్కరూ చనిపోలేదు. మలేరియా కేసులు నమోదు కాలేదు. గత పదేళ్ల గణాంకాలు సేకరించగా.. బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యల తీవ్రత 30–40% మేరకు తగ్గిందని డా. పారినాయుడు వివరించారు. మరో 83 గ్రామాల్లో 80% మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారని, వచ్చే రెండేళ్లలో ఈ గ్రామాలు కూడా పూర్తి బయో గ్రామాలుగా మారనున్నాయని ఆయన సంతోషంగా చెప్పారు. ‘స్కోచ్’ అవార్డుకు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైతు సాధికార సంస్థ, జట్టు ట్రస్టు, రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల సహాయ సహకారాలు ప్రకృతి సేద్యంలో రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గిరిజన రైతుల అపూర్వ విజయాలను చూపి ముచ్చటపడిన జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి ‘స్కోచ్’ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపారు. నేలల సంరక్షణ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ‘అమృత భూమి’ పేరుతో ‘జట్టు’ ఆధ్వర్యంలో కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కూడా ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించటం విశేషం. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరం -
మరోసారి మెరిసిన ఏపీ పోలీస్
సాక్షి, అమరావతి: శాంతిభద్రతల పరిరక్షణలో సాం కేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడంలో ఏపీ పోలీస్ శాఖ జాతీయస్థాయిలో మరో సారి గుర్తింపు పొందింది. 2021 జాతీయస్థాయి స్కోచ్ అవార్డులను మంగళవారం ప్రకటించారు. వాటిలో ఆరు రజత పతకాలతో సహా ఏపీ పోలీస్ శాఖ 20 అవార్డులు సాధించింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం ప్రాజెక్టులు 6, అనంతపురం రేంజ్ ప్రాజెక్టులు 3, చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయం ప్రాజెక్టులు 3, కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయం ప్రాజెక్టులు 3, తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా ప్రాజెక్టులు 2, కడప జిల్లా పోలీస్ ప్రాజెక్టులు 2, పో లీస్ బెటాలియన్ ప్రాజెక్టుకు ఒక అవార్డు వచ్చాయి. ఈ ఏడాది 20 అవార్డులతో కలిపి ఇప్పటివరకు 150 స్కోచ్ అవార్డులు సాధించడం విశేషం. 2021 స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులు.. ఆటోమేటెడ్ ఆన్లైన్ సిస్టం, హాక్ వాహనాలు, స మ్మనపు, కోవిడ్ ట్రీట్మెంట్ ట్రాకర్, కోవిడ్ సెల్, ఫ్యాక్షన్ కంట్రోల్ సెల్, ఆపరేషన్ సమైక్య, టెక్నికల్ అనాలిసిస్ వింగ్, ఐ–స్పార్క్, టెక్నో సపోర్ట్ ఆన్ ఆ న్‌లైన్ క్లిక్, గ్రామ సంరక్షణ దళం, కరోనా సమయంలో పోలీసుల సంక్షేమం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, త్రినేత్రకు దక్కాయి. 2021 స్కోచ్ సిల్వర్ అవార్డులు.. ఆటోమేటెడ్ పోలీస్ ఆన్లైన్ సిస్టం, హాక్ వెహికల్, 3 నేత్ర, కరోనా మహమ్మారి సమయంలో పోలీస్ సంక్షేమం, ఆపరేషన్ సమైఖ్య, కోవిడ్ ట్రీట్మెంట్ ట్రాకర్ దక్కించుకున్నాయి. టెక్నాలజీ వినియోగంలో ఏపీ అగ్రగామి.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంలో దేశంలోనే ఏపీ పోలీస్ శాఖ అగ్రస్థానంలో ఉందని డీజీపీ గౌతమ్‌సవాంగ్ తెలిపారు. ఇప్పటికే జాతీయస్థాయిలో 150 స్కోచ్ అవార్డులు సాధించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతర సూచనలు, మార్గదర్శకత్వంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఆర్టీసీకి స్కోచ్ రజత పతకం .. రవాణా రంగంలో సంప్రదాయేతర విద్యుత్ విని యోగంలో ఆర్టీసీ స్కోచ్ రజత పతకాన్ని గెలుచుకుంది. రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ప్రాజెక్టుకుగానూ ఈ అవార్డు దక్కింది. ఆర్టీసీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ జి.విజయరత్నం ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. స్కోచ్ అవార్డు ఆర్టీసీకి దక్కడం ఇదే తొలిసారి. అవార్డు సాధించిన ఆర్టీసీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. అభినందించిన సీఎం జగన్ జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డులు సాధించిన పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మహిళలు, చిన్నారులు, సమాజంలో వెనుకబడిన వర్గాలకు మెరుగైన భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ సమూల మార్పులు చేస్తూ పోలీసుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందిస్తోందని ఆయన ప్రశంసించినట్లు పేర్కొంది. -
ఓటేసి గెలిపించండి: తెలంగాణ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నారు. తాజాగా టెక్నాలజీ అమ లు విభాగంలో స్కోచ్ సంస్థ పలు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ రేసులో ఉన్న తమను ఓటేసి గెలిపించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసు శాఖ పలు క్యాబ్సరీ్వసులతో కలిసి వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రాత్రిపూట పనిచేసే మహిళా ఉద్యోగినుల కోసం హాక్ఐ యాప్‌ను అందిస్తోంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నవారు క్యాబ్‌లలో ప్రయాణించేటప్పుడు ఏదైనా ఆపద ఎదురైతే ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే ఏసీపీ, సీఐ, కంట్రోల్‌రూమ్, పెట్రోలింగ్ వాహనాలతోపాటు మొత్తం ఏడు విభాగాలకు ఎమర్జెన్సీ సందేశం వెళ్తుంది. ఈ సేవలు అందిస్తున్న పోలీసులకు ప్రజలు స్కోచ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ఓటేయాలని పోలీసుశాఖ కోరుతోంది. చదవండి: ఆర్బీకేలకు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డు -
దేశంలోనే బెస్ట్ మంత్రిగా కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ద్వారా పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు గుర్తింపుగా 2020 సంవత్సరానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్’గా, తెలంగాణ రాష్ట్రం ‘ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. 2003 నుంచి కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాలు మెరుగైన పాలన కోసం అనుసరిస్తున్న విధానాలపై చేసిన అధ్యయనం తర్వాత తెలంగాణను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ వెల్లడించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్.. కొచ్చర్ తరఫున ఈ నెల 23న కేటీఆర్‌కు ఈ అవార్డును అంద జేశారు. ‘ఐటీ సాంకేతికత వినియోగం ద్వారా పౌర సేవలను మెరుగు పరచడంలో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. ముఖ్యంగా కోవిడ్–19 సమయంలో పౌర సేవలను అందించడంలో ఆధునిక టెక్నాలజీ జీవన రేఖగా నిలిచింది. ఈ విషయంలో అత్యంత శ్రద్ధ చూపిన కేటీఆర్‌కు 2020లో అవార్డు దక్కింది. 2016లోనూ కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు. రెండుసార్లు స్కోచ్ అవార్డును అందుకున్న ఏకైక మంత్రి కేటీఆర్’ అని కొచ్చర్ వ్యాఖ్యానించారు. తనకు అవార్డు లభించడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ గవర్నెన్స్‌లో తెలంగాణ టాప్.. ఈ గవర్నెన్స్‌లో 2019 స్కోచ్ ర్యాంకింగ్‌లో పదో స్థానంలో నిలిచిన తెలంగాణ, 2020 సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచింది. 2019లో ఎనిమిదో స్థానం సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రస్తుత ర్యాంకింగ్‌లో మహారాష్ట్రతో కలిసి రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2021 ర్యాంకింగ్‌కు సంబంధించి మదింపు ప్రక్రియ ప్రారంభమైందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పనితీరును కూడా మదింపు చేస్తామని స్కోచ్ అవార్డు కమిటీ పేర్కొంది. Delighted to share that Telangana IT Minister @KTRTRS has been awarded the SKOCH “Best Performing IT Minister” Award for the year 2020. Also, Telangana state has been awarded “e-Governance State of the Year” award by @skochgroup. pic.twitter.com/orV0dWO1AW — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 25, 2021 -
మరోసారి సత్తా చాటిన ఏపీ పోలీసుశాఖ
-
మరోసారి సత్తా చాటిన ఏపీ పోలీసుశాఖ
సాక్షి, అమరావాతి: టెక్నాలజీ వినయోగం విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరోసారి సత్తా చాటారు. టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ప్రకటించిన 18 అవార్డులలో ఏపీ పోలీసు శాఖ ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో నెల వ్యవధిలో ఏపీ పోలీసు శాఖ మూడో సారి భారీగా అవార్డులను కైవసం చేసుకోవడం విశేషం. ఇక నేడు ప్రకటించిన అవార్డుల్లో ప్రాజెక్ట్ టాటా, సైబర్ మిత్ర(మహిళ భద్రత)కుగాను ఏపీ పోలీసు శాఖ రజత పతకాలు కైవసం చేసుకుంది. వీటితో పాటు అఫెండర్ సెర్చ్, ఉమెన్ సేఫ్టీ (విజయనగరం జిల్లా), సువిధ(అనంతపురం), ప్రాజెక్ట్ టాటా (ప్రకాశం జిల్లా)విభాగాల్లో ఐదు స్కోచ్ అవార్డులు గెలుచుకుంది. (చదవండి: దిశ యాప్.. డౌన్లోడ్స్ 11 లక్షలు) 11 నెలల కాల వ్యవధిలో జాతీయ స్థాయిలో 108 అవార్డులను సొంతం చేసుకొని ఏపీ పోలీసు శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు సాధించిన అవార్డుల్లో రెండు బంగారు, 13 రజత పతకాలను కైవసం చేసుకొన్నది. అందుబాటులో ఉన్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న సిబ్బందిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంజ్ అభినందించారు. -
జాతీయ స్థాయిలో నం.1గా ఏపీ పోలీసు శాఖ
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగాలపై స్కొచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో భాగంగా జాతీయ అవార్డులను ప్రకటించింది. మొత్తం 84 అవార్డులను ప్రకటించిగా రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ 48 అవార్డులను దక్కించికుంది. కేరళ-9, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్-4, తెలంగాణ-1, తమిళనాడు-1 అవార్డులను దక్కించుకున్నాయి. ఇక ఏపీ పోలీసు శాఖ వరుసగా రెండవ సారి టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటికే 37 అవార్డులు సాధించిన ఏపీ పోలీస్ శాఖ తాజాగా వివిధ విభాగాల్లో 48 అవార్డులు కైవసం చేసుకోని మొత్తం 85 అవార్డుతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అత్యధిక అవార్డులు దక్కించుకోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసు శాఖను అభినందించారు. మహిళా రక్షణ కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన దిశ, దాని సంభందిత విభాగంలో అందిస్తున్న టెక్నాలజీ సేవలకుగాను 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల ప్రజల కోసం 87 సేవలతో అందుబాటులోకి తీసుకొని వచ్చిన ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్‌కు గాను అవార్డు లభించింది. ఇక కోవిడ్ సమయంలో అందించిన, అందిస్తున్న మెరుగైన సంక్షేమానికి గాను 3 అవార్డులు, టెక్నికల్ విభాగంలో -13 అవార్డులు, సీఐడీ- 4, కమ్యూనికేషన్-3, విజయవాడ, కర్నూల్ జిల్లాకు -3, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాకు-2, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు,గుంటూరు(అర్బన్), గుంటూరు(రూరల్), కృష్ణ జిల్లాకు- 1 అవార్డులు లభించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదిలో రికార్డ్ స్థాయిలో 85 అవార్డులను దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ విభాగంగా ఏపీ పోలీసు శాఖ నిలిచింది. టెక్నాలజీ వినియోగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారితనంతో, త్వరతగతిన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నామని, సీఎం జగన్ తెలిపారు. జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని అభినందించారు. ఇక సీఎం పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు సాధిస్తున్నామన్న ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. -
ఏపీ పోలీస్.. సూపర్
సాక్షి, అమరావతి: మన ఆంధ్రప్రదేశ్ పోలీస్.. సూపర్. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఇదే విషయాన్ని చాటి చెబుతున్నాయి. అనేక విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ పోలీసులకు లభించిన అవార్డులను గమనిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది. రాష్ట్రంలో పోలీస్ టెర్రరిజం అమలవుతోందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల సేవలకు జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపును పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర పోలీసులకు గత ఎనిమిది నెలల్లోనే ఏకంగా 20 అవార్డులు దక్కాయని గుర్తు చేస్తున్నారు. జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థ.. స్కోచ్, జీఫైల్స్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తదితర ప్రముఖ సంస్థలు ఈ అవార్డులు అందించాయని చెబుతున్నారు. శాంతిభద్రతల నిర్వహణలో రాజీ లేకుండా విధులు నిర్వర్తిస్తున్న తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పోలీసు అధికారుల సంఘం నేతలు అంటున్నారు. (ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురు) ఏపీ పోలీసుల పనితీరుకు ఇవే కొలమానం ► 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాల్లో బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డులు అందుకున్నారు. ► జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన 9 స్కోచ్ అవార్డులు ఏపీ పోలీస్ శాఖకు లభించాయి. పరిపాలన, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో ప్రతిభావంతులకు, ఆయా శాఖలకు స్కోచ్ సంస్థ ఈ అవార్డులను అందిస్తోంది. ► బాధితులకు తక్షణ న్యాయం అందించేలా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమానికి జీఫైల్స్ గవర్నెన్స్ అవార్డు లభించింది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని డైరెక్టర్ ఆఫ్ కోఆర్డినేషన్ పోలీస్ వైర్లెస్ నుంచి రాష్ట్ర పోలీసులు రెండు అవార్డులు అందుకున్నారు. నూతన సాంకేతిక పద్ధతులతో శిక్షణ, ఉత్తమ వినూత్న కార్యక్రమాల విభాగాల్లో ఈ అవార్డులు లభించాయి. ► డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి సైబర్ ఫోరెన్సిక్ శిక్షణ విభాగంలో ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయం అవార్డు అందుకుంది. అత్యుత్తమ సామర్థ్యం చూపుతున్నందుకు ఈ అవార్డు దక్కింది. ► ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ నిర్వహించిన టెక్నాలజీ సభ అవార్డుల్లో ఏపీ పోలీసులకు ఐదు అవార్డులు లభించాయి. ఏపీ పోలీసులకు ప్రధాని అభినందన రాష్ట్రంలో అమలవుతున్న పోలీస్ వీక్లీ ఆఫ్, స్పందన వంటి కార్యక్రమాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో ఏపీ పోలీస్ స్టాల్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్రమోదీ స్పందన, వీక్లీ ఆఫ్ గురించి తెలుసుకొని అభినందించారు. బాబుకు పోలీసులు టెర్రరిస్టులుగా ఎందుకు కనిపిస్తున్నారు? చంద్రబాబు పాలనలో అద్భుతంగా పనిచేశామని పొగిడిన చంద్రబాబుకు ఇప్పుడు పోలీసులు టెర్రరిస్టులుగా ఎందుకు కనిపిస్తున్నారు? అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ శాంతిభద్రతల కోసమే పోలీసులు పనిచేస్తారు. ఈ విషయం 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా? – జనకుల శ్రీనివాసరావు, ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఏపీ సీఐడీకి రెండు స్కోచ్ అవార్డులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం(సీఐడీ) అధికారులు అమలు చేస్తున్న ఈ-లెర్నింగ్, పీసీఆర్ డాష్ బోర్డు విధానానికి రెండు స్కోచ్ అవార్డులు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ఒక అవార్డు దక్కాయి. ఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ అందుకున్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం తదితర చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తూ సీఐడీ నిర్వహిస్తున్న ఈ లెర్నింగ్ ప్రోగ్రాంకు స్కోచ్ అవార్డు లభించింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు పలు పౌర హక్కులను పర్యవేక్షించే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్(పీసీఆర్) డాష్ బోర్డు పనితీరుకు మరో అవార్డు దక్కింది. దీనితోపాటు ప్రొజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు మరో స్కోచ్ అవార్డు దక్కింది. మూడు స్కోచ్ అవార్డులు అందుకున్న అధికారులకు అభినందనలు తెలుపుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
దటీజ్ ఏపీ పోలీస్.. దేశంలోనే టాప్‌లో..!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే తొలిసారిగా పోలీస్ శాఖలో ప్రవేశ పెట్టిన వీక్లీ ఆఫ్ విధానానికి `స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్` అవార్డు లభించింది. అంతేగాక.. వేర్వేరు విభాగాల్లో ఏపీ పోలీస్ శాఖకు 9 స్కాచ్ అవార్డులతో పాటు దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఢిల్లీలోని కాన్‌స్టిస్ట్యూషన్ క్లబ్లో జరిగిన స్కాచ్ సమ్మిట్‌లో ఈ `స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్` అవార్డులను సంబంధిత విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు అందుకున్నారు. అవార్డు ఎంపికలో భాగంగా వీక్లీ ఆఫ్ విధానంపై జరిగిన ఆన్లైన్ ఓటింగ్ కు అనూహ్య స్పందన లభించింది. దేశంలోనే తొలిసారిగా పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ విధానం ప్రవేశపెట్టడంతోపాటు పూర్తిగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులకెక్కింది. శనివారం నాటికి ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇదే రోజున ఈ శుభవార్త అందడం పట్ల పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీక్లీ ఆఫ్ తోపాటు ఉమెన్ జువైనల్ వింగ్, ఫేస్ ట్రాకర్, ప్రేరణ, స్ఫూర్తి, ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్, జూనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, ట్రాన్స్ఫర్ మేనేజ్మెంట్ సిస్టం, విజిటర్ మోనిటర్ సిస్టం తదితర విభాగాలకు కూడా `స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్` అవార్డులు లభించాయి. అవార్డులను ఆయా విభాగాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు అందుకున్నారు. అవార్డులు అందుకున్న పోలీసులను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు విశాఖపట్నం కమిషనర్ ఆర్కే మీనా, వివిధ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా.. -
ప్రకాశం పోలీస్‌కు మరోసారి అరుదైన గౌరవం
సాక్షి, ఒంగోలు: ప్రకాశం పోలీస్‌శాఖ మరోమారు స్కాచ్ అవార్డుకు ఎంపికైంది. వరుసగా రెండో ఏడాది ఈ అవార్డును దక్కించుకుంది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘ప్రాజెక్టు జియో’ ఇందుకు ఎంపికైంది. ప్రభుత్వ విభాగాలలో ప్రస్తుతం నడుస్తున్న విధానం కంటే వినూత్నంగా.. సమాజానికి మరింత మేలు కలిగేదిగా ఎవరైనా సాంకేతికతను ఉపయోగించుకుని 60 అంశాలలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. జాతీయస్థాయిలోని పోలీసు విభాగాలతోపాటు అన్ని రాష్ట్రాలకు చెందిన పోలీసు విభాగాలు దాదాపు వెయ్యికిపైగా దరఖాస్తులను పంపుకున్నాయి. వాటిని స్రూ్కటినీ చేసి దాదాపు 100 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వాటిలో 6 ప్రాజెక్టులు మన రాష్ట్రానికి చెందినవి ఉన్నాయి. వీటిలో ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రారంభించిన జియో ప్రాజెక్టు ఒకటికాగా, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం సిటీ, విశాఖపట్నం రూరల్, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రాజెక్టులు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ ఆరు జిల్లాల ఎస్పీలు ఈనెల 29న న్యూఢిల్లీలో జరిగే స్కాచ్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి అవార్డులు అందుకోనున్నారు. గతంలో ప్రకాశం జిల్లాకు రెండు స్కాచ్ అవార్డులు దక్కాయి. భూసారపు సత్యయేసుబాబు జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ఐకాప్ ప్రాజెక్టుకు, క్రైం డేటా ఎనలిటిక్స్ అనే వాటికి సంబంధించి స్కాచ్ అవార్డులు దక్కాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు దక్కడం పట్ల ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
రాష్ట్రానికి స్కోచ్ అవార్డుల పంట
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు వివిధ విభాగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు స్కోచ్ అవార్డుల పంట పండింది. స్కొచ్ 55వ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం ఢిల్లీలో జరిగింది. పారిశుధ్యం, మహిళా సాధికారత, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినందుకు సిరిసిల్ల మున్సిపాలిటీకి 5, మెదక్‌కు 2, íపీర్జాదిగూడకు 1, బోడుప్పల్‌కు 3, సూర్యాపేటకు 1 అవార్డు, మెప్మాకు 6 అవార్డులు దక్కాయి. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, సూర్యపేట కమిషనర్ ఎన్ శంకర్, మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీదేవి, బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొని అవార్డులు అందుకున్నారు. ఆస్తి పన్ను వసూలు, సిటిజన్ సర్వీస్ సెంటర్, వ్యర్థాల శుద్ధి విభాగాల్లో సిరిసిల్ల మెరుగైన ఫలితాలు సాధించేలా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించేందుకు దోహదపడ్డాయని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేశారని ఆమె పేర్కొన్నారు. -
‘ఈ స్టాంప్స్’ కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆన్లైన్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించేందుకు వీలు కల్పిస్తూ ప్రవేశపెట్టిన 'ఈస్టాంప్స్' ప్రాజెక్టుతోపాటు మరికొన్ని ప్రాజెక్టులకూ ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు లభించాయి. 'ఈ స్టాంప్స్'తోపాటు పౌరసరఫరాల, మార్కెటంగ్ శాఖలు నిర్వహిస్తోన్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్), ఈ-పీడీఎస్, ఎస్సీఎం (సప్లై చైన్ మేనేజ్మెంట్), ఓపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ సిస్టం), ఫిర్యాదుల పరిష్కారం వంటి ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డులకు ఎంపికయ్యాయి. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో గురువారం జరిగిన 45వ జాతీయ స్కోచ్ సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ స్టాంప్స్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ వి.శ్రీనివాసులు పురస్కారాన్ని అందుకున్నారు.