మరోసారి మెరిసిన ఏపీ పోలీస్‌ | AP Police Again Shine Got 20 National Skoch Awards | Sakshi
Sakshi News home page

మరోసారి మెరిసిన ఏపీ పోలీస్‌

Published Wed, Nov 17 2021 8:54 AM | Last Updated on Wed, Nov 17 2021 11:33 AM

AP Police Again Shine Got 20 National Skoch Awards - Sakshi

సాక్షి, అమరావతి: శాంతిభద్రతల పరిరక్షణలో సాం కేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడంలో ఏపీ పోలీస్‌ శాఖ జాతీయస్థాయిలో మరో సారి గుర్తింపు పొందింది. 2021 జాతీయస్థాయి స్కోచ్‌ అవార్డులను మంగళవారం ప్రకటించారు. వాటిలో ఆరు రజత పతకాలతో సహా ఏపీ పోలీస్‌ శాఖ 20 అవార్డులు సాధించింది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం ప్రాజెక్టులు 6, అనంతపురం రేంజ్‌ ప్రాజెక్టులు 3, చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయం ప్రాజెక్టులు 3,  కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయం ప్రాజెక్టులు 3, తిరుపతి అర్బన్‌ పోలీస్‌ జిల్లా ప్రాజెక్టులు 2, కడప జిల్లా పోలీస్‌ ప్రాజెక్టులు 2, పో లీస్‌ బెటాలియన్‌ ప్రాజెక్టుకు ఒక అవార్డు వచ్చాయి. ఈ ఏడాది 20 అవార్డులతో కలిపి  ఇప్పటివరకు  150 స్కోచ్‌ అవార్డులు సాధించడం విశేషం.

2021 స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులు..
ఆటోమేటెడ్‌ ఆన్‌లైన్‌ సిస్టం, హాక్‌ వాహనాలు, స మ్మనపు, కోవిడ్‌ ట్రీట్మెంట్‌ ట్రాకర్, కోవిడ్‌ సెల్, ఫ్యాక్షన్‌  కంట్రోల్‌ సెల్, ఆపరేషన్‌ సమైక్య, టెక్నికల్‌ అనాలిసిస్‌ వింగ్, ఐ–స్పార్క్, టెక్నో సపోర్ట్‌ ఆన్‌ ఆ న్‌లైన్‌ క్లిక్, గ్రామ సంరక్షణ దళం, కరోనా  సమయంలో పోలీసుల సంక్షేమం, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, త్రినేత్రకు దక్కాయి. 

2021 స్కోచ్‌ సిల్వర్‌ అవార్డులు..
ఆటోమేటెడ్‌ పోలీస్‌ ఆన్‌లైన్‌ సిస్టం, హాక్‌ వెహికల్, 3 నేత్ర, కరోనా మహమ్మారి సమయంలో పోలీస్‌ సంక్షేమం, ఆపరేషన్‌ సమైఖ్య, కోవిడ్‌ ట్రీట్మెంట్‌ ట్రాకర్‌ దక్కించుకున్నాయి. 

టెక్నాలజీ వినియోగంలో ఏపీ అగ్రగామి.. 
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంలో దేశంలోనే ఏపీ పోలీస్‌ శాఖ అగ్రస్థానంలో ఉందని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ తెలిపారు. ఇప్పటికే జాతీయస్థాయిలో 150 స్కోచ్‌ అవార్డులు సాధించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతర సూచనలు, మార్గదర్శకత్వంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.

ఆర్టీసీకి స్కోచ్‌ రజత పతకం ..
రవాణా రంగంలో సంప్రదాయేతర విద్యుత్‌ విని యోగంలో ఆర్టీసీ స్కోచ్‌ రజత పతకాన్ని గెలుచుకుంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్ల ప్రాజెక్టుకుగానూ ఈ అవార్డు దక్కింది.  ఆర్టీసీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ జి.విజయరత్నం ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. స్కోచ్‌ అవార్డు ఆర్టీసీకి దక్కడం ఇదే తొలిసారి. అవార్డు సాధించిన ఆర్టీసీ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాన్ని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. 

అభినందించిన సీఎం జగన్‌
జాతీయస్థాయిలో స్కోచ్‌ అవార్డులు సాధించిన పోలీసు శాఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. మహిళలు, చిన్నారులు, సమాజంలో వెనుకబడిన వర్గాలకు మెరుగైన భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ సమూల మార్పులు చేస్తూ పోలీసుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందిస్తోందని ఆయన ప్రశంసించినట్లు పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement