
ఈ పాస్‌తో ఫోర్జరీకి చెక్
- అమల్లోకి వచ్చిన సేవలు
- నర్సీపట్నం డివిజన్‌లో 1732 పాస్ పుస్తకాలు జారీ
నర్సీపట్నం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాస్ పుస్తక విధానం అమల్లోకి వచ్చింది. ఈపాస్ పుస్తకాల వల్ల ఫోర్జరీలు, భూ అక్రమాలు నివారించడంతో పాటు భూహక్కుదారులకు రక్షణగా నిలవడమే కాకుండా నకిలీ పాసు పుస్తకాల సమస్యకు అడ్డుకట్ట పడనుంది. జిల్లాలో తక్కువ సంఖ్యలో ఇవి తహశీల్దార్ కార్యాలయాలకు చేరాయి. సాధారణంగా ఇచ్చే వాటిని నిలిపివేశారు. ఈ నేపధ్యంలో నర్సీపట్నం డివిజన్‌లో 1,732 పాస్‌పుస్తకాలను జారీ చేశారు. పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చెన్నై కేంద్రంగా ఇవి జారీ అవుతున్నాయి.
భూమి యజమాని ఫొటో, తహశీల్దార్ సంతకం విస్తీర్ణం వివరాలు, భూమి స్వభావం, పట్టా నంబరు, భూమి హక్కుదారుని చిరునామా నమోదు చేసిన తేదీ, వ్యవసాయదారుని సంతకం, తహశీల్దార్ సంతకం చేసిన వ్యవసాయదారుని ఫొటో పొందుపరిచారు. దీనివల్ల నకిలీ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడినట్టే. ప్రస్తుతం తాజాగా దరఖాస్తుచేసుకున్న రైతులకు వీటిని అందిస్తున్నా, భవిష్యత్తులో అందరికీ అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ పాస్ పుస్తకాల వల్ల బ్యాంకులకు మేలు జరగనుంది. ఆన్‌లైన్ కావడం వల్ల రుణాల మంజూరు సులభతరం కానుంది. ఈ పాస్ పుస్తకాలకు ఆధార్ అనుసంధానమైతే ఎక్కడనుంచైనా భూ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రైతులకు ఎంతో ప్రయోజనం
ఈపాసు పుస్తకాల వల్ల రైతులకు మేలు జరుగుతుంది. బ్యాంకుల వద్ద రుణాలు పొందడానికి సులభంగా ఉంటుంది. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఒకరి భూమిని మరొకరు అక్రమించుకోవడంకుదరదు. వీటి కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ ఈపాస్ పుస్తకాలు అందజేస్తున్నామన్నాం. పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అన్‌లైన్‌లో పొందు పరచాలని తహశీల్దార్లను ఆదేశించాం. జిల్లాలో నర్సీపట్నం డివిజన్‌లో అధికంగా ఈపాస్ పుస్తకాలు ఇచ్చాం.