విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో రేషన్ షాపులతో పాటు అంగన్వాడీ కేంద్రాలకూ ఈపాస్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చినా జిల్లాలో అమలు కావడం లేదు. చాలా చోట్ల సాధారణ పద్ధతుల్లోనే సరుకులను అందజేస్తున్నారు. దీనిపై జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్ ఇచ్చిన ఆదేశాలు అమలు కావడంలేదు. జిల్లాలో 3,728 అంగన్వాడీ కేంద్రాలుండగా వాటికి గతంలో కాంట్రాక్టు పద్ధతిలో సరుకులు ఇచ్చేవారు. కాంట్రాక్టు పొందిన వారు బియ్యం తదితర సరుకులను ఇచ్చేవారు. ఏప్రిల్ నుంచి అంగన్వాడీలకు కూడా ఈ-పాస్ వర్తింపజేయాలనీ, కార్యకర్తల వేలిముద్రలు తీసుకుని సరుకులు ఇవ్వాలని సూచిం చారు. దీనివల్ల చాలా వరకూ అనధికార హాజరు తగ్గి, సరుకులు చాలావరకూ మిగులుతాయని భావించారు.
రేషన్‌డీలర్ల ఇబ్బందులు
దీనిపై పలువురు రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. తమకు సాధారణ రేషన్ సరుకులకే కమీషన్ ఇవ్వడం లేదనీ, అంగన్వాడీల బాధ్యతను అప్పగించినా దానికీ కమీషన్ లేదని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలతో అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు ఇవ్వలేకపోతున్నామని డీలర్లే స్వయంగా చెబుతున్నారు.
ముఖ్యం గా జిల్లాలోని పంపిణీ చేయాల్సిన సరుకులన్నీ ఒకేసారి పంపించకుండా నచ్చినప్పుడు పంపించడంతో ఇబ్బందు లు పడుతున్నట్టు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రపు రామారావు తెలిపారు. కమీషన్లు ఇవ్వకుండా ఇలా సాంకేతిక తప్పిదాలతో అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారన్నారు. ఇదే కొనసాగితే రాష్ట్ర నాయకులతో చర్చించి త్వరలోనే రేషన్ పంపిణీని నిలిపివేస్తామని తెలిపారు. దీనిపై ఐసీడీఎస్ పీడీ ఏఈ రాబర్ట్స్ మాట్లాడుతూ అతి తక్కువ కేంద్రాలకు మాత్రమే మాన్యువల్‌గా ఇస్తున్నామని, చాలావరకూ ఈ-పాస్ విధానంలోనే ఇస్తున్నామని తెలిపారు.
ఈ-పాస్ అక్కడ ఫెయిల్
Published Wed, Jun 29 2016 8:22 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM
Advertisement