A.P Makes E Passes Mandatory For Emergency Travel From Today - Sakshi
Sakshi News home page

ఏపీ: కర్ఫ్యూ సమయంలో ఈ పాస్‌ తప్పనిసరి 

Published Tue, May 11 2021 9:59 AM | Last Updated on Tue, May 11 2021 11:27 AM

E Pass Is Mandatory During Curfew In AP - Sakshi

సాక్షి, అమరావతి: కర్ఫ్యూ సమయంలో అంతర్‌రాష్ట్ర ప్రయాణాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అందుకు అవసరమైన ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన వివరాలను ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిటిజన్‌ సర్వీసు పోర్టర్‌లో appolice.gov.in, twitter@appolice100, facebook@andhrapradeshstatepolice ద్వారా ఈ పాస్‌ పొందవచ్చని వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తగిన ధ్రువపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంబంధిత స్థానిక అధికారుల వద్ద నుంచి సరైన గుర్తింపుపత్రాలతో అనుమతులు పొందాలని సూచించారు. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ పోలీస్‌శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చదవండి: అత్యవసరమైతేనే బ్యాంకులకు రండి
Ongole: కోవిడ్‌ కేర్‌ సెంటర్‌.. మెనూ అదుర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement