సాక్షి, హైదరాబాద్: వెబ్‌సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోల్లో నచ్చిన రాఖీని ఎంపిక చేసుకొని.. అక్కడే ఉన్న నచ్చిన సందేశాన్ని కూడా క్లిక్ చేసి పంపాల్సిన చిరునామా టైప్ చేసేసి.. రూ.100 చెల్లిస్తే స్పీడ్ పోస్టులో సందేశంతోపాటు ఎంపిక చేసిన రాఖీ ఆ అడ్రస్‌కు చేరిపోతుంది. తొలిసారి రాఖీని ఈ–షాప్ పద్ధతిలో సోదరులకు పంపే ఏర్పాటు చేసింది. తపాలాశాఖ ఠీఠీఠీ.్ఛటజిౌp.్టటఞౌట్టట.జీn వెబ్‌సైట్ ద్వారా ఈ అవకాశం లభించనుంది. శుక్రవారం తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ దీన్ని ప్రారంభించారు. వెబ్‌సైట్‌లో రకరకాల నమూనాల రాఖీల చిత్రాలుంటాయి. పోస్టల్ కవర్, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ సందేశాలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment