
కథలాపూర్: రాఖీ పండుగంటే అన్నాదమ్ముల వద్దకు వచ్చి సోదరీమణులు రాఖీలు కట్టడం సర్వసాధారణం. అయితే తాను వృద్ధాప్యంలో రాలేను తమ్ముడు.. అనగానే ఓ తమ్ముడు సుమారు పది కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వెళ్లి అక్కతో రాఖీ కట్టించుకున్నాడు. కథలాపూర్ మండలం భూషణరావుపేటకు చెందిన ఉశకోల శంకరయ్యకు సుమారు 75ఏళ్లు ఉంటాయి.
ఆయన అక్క, మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన చిలివేరి భాగమ్మకు సుమారు 80 ఏళ్లు ఉంటాయి. రాఖీ పండుగ సందర్భంగా భాగమ్మ తమ్ముడి వద్దకు వచ్చి రాఖీ కట్టాల్సి ఉంది. కానీ.. వృద్ధాప్యంతో రాలేకపోతున్నామని తమ్ముడికి కబురు పంపింది. దీంతో శంకరయ్య మనసు ఆపుకోలేక సైకిల్‌పై ఆత్మనగర్‌లోని అక్క వద్దకు వెళ్లి ఆమెతో రాఖీ కట్టించుకున్నాడు.