సెల్‌ఫోన్ మాయలో పల్లెలు
ఊరు మారింది.. తీరు మారింది.. పల్లెల రూపురేఖలు వేగంగా మారిపోయాయి.. దశాబ్దాల కిందటి పల్లెల్లో కులాలు, మతాలకతీతంగా ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలు కనిపించేవి. చాలా కాలం తర్వాత తమవారిని చూస్తే ఆనందభాష్పాలు, పట్టలేని సంతోషం. ఇప్పుడవి కనుమరుగయ్యాయి. పల్లెలు సెల్‌ఫోన్ మాయలో పడ్డాయి. ప్రపంచాన్ని అరచేతిలోనే చూస్తున్నరు. కానీ, పక్కింటోళ్లతో, ఆత్మీయులతో మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కనిపించడం లేదు. మనస్ఫూర్తిగా నవ్వడం లేదు. మునుపటి ఆప్యాయతలు, అనురాగాలు లేవు. చలికి రైతులు నాగలి కడ్తలేరు. ఫోన్ చేసి, ట్రాక్టర్ మాట్లాడుకొని, పొలం దున్నిస్తున్నరు. పిండివంటలు చేయడం వద్దనుకునేవారు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతున్నరు. – సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment