Indian posts
-
నచ్చిన రాఖీ.. మెచ్చిన సందేశం..
సాక్షి, హైదరాబాద్: వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోల్లో నచ్చిన రాఖీని ఎంపిక చేసుకొని.. అక్కడే ఉన్న నచ్చిన సందేశాన్ని కూడా క్లిక్ చేసి పంపాల్సిన చిరునామా టైప్ చేసేసి.. రూ.100 చెల్లిస్తే స్పీడ్ పోస్టులో సందేశంతోపాటు ఎంపిక చేసిన రాఖీ ఆ అడ్రస్కు చేరిపోతుంది. తొలిసారి రాఖీని ఈ–షాప్ పద్ధతిలో సోదరులకు పంపే ఏర్పాటు చేసింది. తపాలాశాఖ ఠీఠీఠీ.్ఛటజిౌp.్టటఞౌట్టట.జీn వెబ్సైట్ ద్వారా ఈ అవకాశం లభించనుంది. శుక్రవారం తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ దీన్ని ప్రారంభించారు. వెబ్సైట్లో రకరకాల నమూనాల రాఖీల చిత్రాలుంటాయి. పోస్టల్ కవర్, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ సందేశాలుంటాయి. -
‘భారత బంకర్లు పేల్చాం.. ఇదిగో వీడియో’
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరో వీడియో విడుదల చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత మిలిటరీ స్థావరాలను తాము ధ్వంసం చేశామని పేర్కొంటూ పాక్ ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ ఘఫూర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. 27 సెకన్లపాటు ఉన్న ఆ వీడియోలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఉంది. గతంలో కూడా పాక్ ఇలాంటి ఓ వీడియోనే విడుదల చేయగా అది ఫేక్ వీడియో అని భారత్ కొట్టి పారేసిన విషయం తెలిసిందే. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తట్టపాని సెక్టార్లో తాము ఐదుగురు భారత సైనికులను చంపేశామంటూ ప్రకటించిన మరుసటి రోజే పాక్ ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం. పాక్ అంతర్గత సేవల విభాగం(ఐఎస్పీఆర్) శనివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ తాము నియంత్రణ రేఖ వద్ద భారత్ సైనికులపై దాడులు చేశామని, అందులో ఐదుగురు సైనికులు చనిపోయారని, ఇండియన్ బంకర్లను ధ్వంసం చేశామంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయినప్పటికీ అదే జరిగినట్లుగా పాక్ వీడియో విడుదల చేయడం ఆశ్చర్యాన్నిస్తోంది. Ref PR285/17 Video clip showing destruction of Indian posts on LOC by Pak Army in response to unprovoked Indian firing on innocent citizens. pic.twitter.com/ceErT8KzlC — Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) 3 June 2017