‘భారత బంకర్లు పేల్చాం.. ఇదిగో వీడియో‌’ | Pakistan Army releases video claiming destruction of Indian posts | Sakshi
Sakshi News home page

‘భారత బంకర్లు పేల్చాం.. ఇదిగో వీడియో‌’

Published Sun, Jun 4 2017 6:00 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

‘భారత బంకర్లు పేల్చాం.. ఇదిగో వీడియో‌’

‘భారత బంకర్లు పేల్చాం.. ఇదిగో వీడియో‌’

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మరో వీడియో విడుదల చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత మిలిటరీ స్థావరాలను తాము ధ్వంసం చేశామని పేర్కొంటూ పాక్‌ ఆర్మీ అధికారిక ప్రతినిధి మేజర్‌ జనరల్‌ అసిఫ్‌ ఘఫూర్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు. 27 సెకన్లపాటు ఉన్న ఆ వీడియోలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఉంది. గతంలో కూడా పాక్‌ ఇలాంటి ఓ వీడియోనే విడుదల చేయగా అది ఫేక్‌ వీడియో అని భారత్‌ కొట్టి పారేసిన విషయం తెలిసిందే.

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న తట్టపాని సెక్టార్‌లో తాము ఐదుగురు భారత సైనికులను చంపేశామంటూ ప్రకటించిన మరుసటి రోజే పాక్‌ ఈ వీడియోను విడుదల చేయడం గమనార్హం. పాక్‌ అంతర్గత సేవల విభాగం(ఐఎస్‌పీఆర్‌) శనివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ తాము నియంత్రణ రేఖ వద్ద భారత్‌ సైనికులపై దాడులు చేశామని, అందులో ఐదుగురు సైనికులు చనిపోయారని, ఇండియన్‌ బంకర్లను ధ్వంసం చేశామంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై భారత్‌ వైపు నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయినప్పటికీ అదే జరిగినట్లుగా పాక్‌ వీడియో విడుదల చేయడం ఆశ్చర్యాన్నిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement