
దేశవ్యాప్తంగా నేడు రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గల మహాకాళేశ్వరుని ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
నేటి(సోమవారం) తెల్లవారుజామున 2.30 గంటలకు మహాకాళేశ్వరునికి భస్మ హారతి అందించడంతోపాటు అందంగా అలంకరించిన రాఖీని కట్టారు. 1.25 లక్షల లడ్డూల మహాభోగాన్ని సమర్పించారు. ఈ లడ్డూలను ఈరోజు భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఆలయ పురోహితులు పండిట్ ఆశిష్ పూజారి, పండిట్ వికాస్ పూజారి భస్మ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
#WATCH उज्जैन (मध्य प्रदेश): सावन माह के 5वें सोमवार के अवसर पर श्री महाकालेश्वर मंदिर में भक्तों की भीड़ उमड़ी। pic.twitter.com/SSjHKAk6eR
— ANI_HindiNews (@AHindinews) August 19, 2024