
సాక్షి, హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూఅమలుపై పోలీస్ ఐజీలు, కమీషనర్లు, ఎస్పీలతో తెలంగాణ డీజీపీ ఎమ్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవోలో పేర్కొన్న విధంగా పటిష్టంగా కర్ప్యూను అమలుచేయాలని తెలిపారు. అంతేకాకుండా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసివేయాలని పేర్కొన్నారు. ఏ గూడ్స్ వాహనాలను ఆపకూడదన్నారు.
కాగా, నైట్ కర్ఫ్యూలో మినహాయింపు ఉన్నవారు సెల్స్ ఐడెంటిటీ కార్డును కచ్చితంగా వెంట ఉంచుకోవాలని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని పోలీసులకు విజ్ఙప్తి చేశారు. అంతేకాకుండా కర్ఫ్యూ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను పాటించాలని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్,జితేందర్, ఐ. జీ. లు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, రాజేష్ కుమార్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment