telangana government
-
‘ఆరు’పై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులపై అటు అధికారిక వర్గాల్లో, ఇటు రాష్ట్ర ప్రజానీకంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాము కేటాయించిన నిధులతో ఆరు గ్యారంటీల అమలు జరిగి తీరుతుందని సర్కారు చెబుతోంటే.. మరికొన్ని నిధులు అవసరమని అధికార వర్గాలు లెక్కలు కడుతున్నాయి. మరోవైపు ఎన్నికల సమయంలో, మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయాలంటే.. ఇప్పుడు బడ్జెట్లో పెట్టిన దానికి సుమారు మూడు రెట్లు ఎక్కువగా నిధులు అవసరమనే చర్చ జరుగుతోంది. హామీలను సంపూర్ణంగా అమలు చేయాలంటే ఏటా రూ.1.36 లక్షల కోట్లకుపైనే కావాల్సి ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఆరు గ్యారంటీల అమలు వ్యవహారం అయోమయంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ గ్యారంటీలను పూర్తిస్థాయిలో కాకుండా, కొందరికే పరిమితం చేసినా ఏటా రూ.80 వేలకోట్లకుపైనే అవసరమని అధికార వర్గాలు అంటున్నా.. దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఆరు గ్యారంటీల్లో.. 13 పథకాలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ‘మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, యువ వికాసం ఉన్నాయి. ఈ ఆరు గ్యారంటీల పరిధిలో మొత్తం 13 పథకాలను అమలు చేయాల్సి ఉంది. వీటిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు భారీ స్థాయిలో నిధులు అవసరం కానున్నాయి. రైతు భరోసా.. గత సర్కారు రాష్ట్రంలోని దాదాపు 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి సుమారు 69లక్షల మంది రైతులకు ఏటా ఎకరానికి రూ.10,000 చొప్పున చెల్లించింది. కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ.15,000 ఇస్తామని ప్రకటించింది. దీనికి ఏటా సుమారు రూ.22,800 కోట్లు అవసరం. ► రాష్ట్రంలో భూమి లేని కౌలు రైతులు 6.5 లక్షల మంది ఉన్నట్టు అంచనా. వారికి ఏటా రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు ఏటా రూ. 975 కోట్లు కావాలి. ► కాంగ్రెస్ కూలీలకు ఏటా రూ. 12 వేలు ఇస్తామని పేర్కొంది. రాష్ట్రంలో 52లక్షలకుపైగా ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉన్నా యాక్టివ్‌గా ఉన్న జాబ్‌కార్డులు దాదాపు 32 లక్షల మేర ఉన్నాయి. జాబ్‌కార్డులున్న అందరికీ పథకాన్ని వర్తింపజేస్తే ఏటా రూ.6,240 కోట్లు కావాలి, యాక్టివ్ వారికే ఇస్తే రూ.3,840 కోట్లు అవసరం. ► వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న కోటీ 30లక్షల టన్నుల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటే రూ.6,500 కోట్లు అవసరం. గృహ జ్యోతి.. ప్రస్తుతం రాష్ట్రంలో 200యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 95.23 లక్షలు. ఆ కుటుంబాలు ఏటా దాదాపు 9,022 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఒక్కో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం సగటున రూ.7గా లెక్కించినా.. ఏటా గృహజ్యోతి అమలు కోసం సుమారు రూ.6,315 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రంలో సొంతిల్లు లేనిపేదలకు 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అంటే ఏటా నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం కోసం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ మేరకు.. 20లక్షల ఇళ్లకు మొత్తంగా రూ. లక్ష కోట్లు అవసరం. ఏటా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే సర్కారు తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. ఏడు వేల కోట్లే కేటాయించింది. చేయూత.. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 43.68 లక్షల మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రతినెలా దివ్యాంగులకు రూ.4వేలు, ఇతర లబ్ధిదారులకు రూ.2 వేలు ఇస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు, ఇతర పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఏటా 5.5 లక్షల మంది దివ్యాంగుల పింఛన్లకు రూ.3,960 కోట్లు, సుమారు 38 లక్షల ఇతర పింఛన్లకు రూ.18,240 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. యువ వికాసం.. యువ వికాసం పథకంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. విద్యార్థుల ఫీజులు, కోచింగ్ చెల్లింపుల కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఏటా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ వంటివి పూర్తి చేసుకుంటున్నారు. వీరికి విద్యా భరోసా కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఇస్తారా? ఎలా సర్దుబాటు చేస్తారు. లోన్లు తీసుకుని ఇస్తే వడ్డీ ఎవరు భరిస్తారన్నది తేలలేదు. మహాలక్ష్మి.. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కలి్పస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటీ 65లక్షల మంది ఉన్నారు. ఇందులో సుమారు 26 లక్షల మంది ఇప్పటికే వితంతు, ఒంటరి, వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. వారిని మినహాయించినా మిగతా కోటీ 39లక్షల మందికి ప్రతీనెలా రూ.2,500 లెక్కన ఏటా రూ.41,700 కోట్లు కావాల్సి ఉంటుంది. ► రాష్ట్రంలో మొత్తం 70లక్షల మంది మహిళల పేరిట వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ రూ.500కే ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏడాదికి పన్నెండు సిలిండర్లు ఇస్తే.. ఏటా రూ.4,200 కోట్లు గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు సిలిండర్లకే పరిమితం చేస్తే రూ.2,100 కోట్లు చెల్లించాలి. ► ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. దీనికోసం ప్రతి నెలా రూ.300 కోట్ల చొప్పున ఏటా ఆర్టీసీకి రూ.3,600 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. -
TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ సలహాదారులు వీరే.. ► హర్కర వేణుగోపాల్- ప్రోటోకాల్,పబ్లిక్ రిలేషన్ ► వేం నరేందర్ రెడ్డి- సీఎం వ్యవహారాలు ► షబ్బీర్ అలీ- ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ, మైనారిటీ శాఖలు ► మల్లు రవి- ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ నలుగురికీ కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. ఇక.. ఆర్టీసీ చైర్మన్ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి తన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చాక పలు నియామకాలపై స్పష్టత రానున్నట్లు చర్చ జరుగుతోంది. చదవండి: ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం -
శ్వేత-స్వేద పత్రాలు కాదు కావాల్సింది! మరి..
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పత్రాల యుద్దం మరీ రక్తి కట్టించినట్లు అనిపించదు. ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఏవో కొన్ని ఆరోపణలు చేయడానికే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు కనిపిస్తుంది. దానికి సమాధానంగా బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రం తమ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సమాధానం కన్నా,సెంటిమెంట్ ప్రయోగానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్దిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఆర్దిక, విద్యుత్ శాఖల శ్వేతపత్రాలలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టే యత్నం చేశారు. విద్యుత్ ఆర్ధిక రంగంలో వివిధ శాఖల ద్వారా ,కార్పొరేషన్ ల ద్వారా చేసిన అప్పులను ఆయన వివరించారు. మొత్తం మీద 6.71 లక్షల కోట్ల అప్పులు గత ప్రబుత్వం చేసిందని లెక్కగట్టారు. ✍️కాని ఆ అప్పులు వినియోగించిన తీరు, దాని వల్ల మంచి జరిగిందా?లేదా? ఎక్కడ లోపం జరిగింది?దానివల్ల తెలంగాణకు ఏ రకంగా నష్టం వాటిల్లింది అనేదానిపై స్పష్టంగా మాట్లాడినట్లు కనబడదు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రస్తుతం అప్పులు చేయక తప్పని స్థితి. ఆ అప్పులు ఏ రకంగా తెచ్చారు? వాటికి ఎంత వడ్డీ చెల్లించాలి?కరోనా వంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పులు లేకుండా ప్రభుత్వం ఎలా నడవాలి అన్న ప్రశ్నలకు సమాదానం లేదు. పోనీ తాము అప్పులు తేబోమని కాని, అప్పులు తెచ్చినా ఫలానా అందుకే వినియోగిస్తామని కాని భట్టి విక్రమార్క చెప్పలేకపోయారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే కొన్ని కొంత అభ్యంతరకరంగానే కనిపిస్తాయి. నీళ్లు అమ్మి అప్పులు కడతామని వేల కోట్ల అప్పు తేవడం ఆశ్చర్యంగానే ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో మంచినీటిని రెండువేల లీటర్ల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో వాటర్ వర్క్స్ సంస్థ ఆర్దిక పరిస్థితి కుదేలు అయ్యే ప్రమాదం ఏర్పడింది. ✍️ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానిని మార్చగలుగుతుందా?అన్నది అనుమానమే. ప్రైవేటు సంస్థలు అప్పులు తెచ్చేటప్పుడు ఏదో రకంగా బ్యాంకర్లను ఒప్పించేందుకు రకరకాల అబద్దాలు చెబుతుంటాయి.అంకెలను పెంచి ప్రాజెక్లు రిపోర్లులు ఇస్తుంటాయి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిందన్న భావన కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల అప్పు తేవడం విశేషం. అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటే దానికి అంత అప్పు అయినా ఫర్వాలేదు. ఆ అప్పు పూర్తిగా సద్వినియోగం అయి ఉంటే మంచిదే. కాని అక్కడే పలు సందేహాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బారేజీ కుంగడం బీఆర్ఎస్ కు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టింది. విద్యుత్ రంగానికి సంబందించిన శ్వేతపత్రంలో కూడా ఆయా బకాయిల గురించి భట్టి విక్రమార్క వెల్లడించారు. అందులో ప్రభుత్వ సంస్థల బకాయిలే ముప్పైవేల కోట్ల వరకు ఉన్నాయి. ✍️ప్రభుత్వమే అతిపెద్ద బాకీదారుగా ఉంటే ప్రజలు మాత్రం విద్యుత్ బిల్లులు సకాలంలో ఎందుకు చెల్లిస్తారు?దీనిపై ప్రభుత్వ వివరణ ఇచ్చి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ మెంట్ ఆఫీస్ లకు సంబంధించి బకాయిలను ఎప్పటికప్పుడు తీర్చివేస్తామని ఎందుకు చెప్పలేకపోయిందన్నది ప్రశ్న. లిఫ్ట్ ఇరిగేష్ స్కీములకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 15 వేల కోట్ల వరకు పెండింగులో ఉండడం ఊహించిందే.కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అవి బయటపడకుండా కప్పిపుచ్చింది.డిస్కంలకు సంబంధించి ఎనభైఒక్కవేల కోట్ల మేర అప్పులు,నష్టాలు చూస్తే ఆ వ్యవస్థ కోలుకోవడం ఎలా అన్న ప్రశ్న వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం విద్యుత్ సరఫరాలో దాదాపు కోత లేకుండానే అందించింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించేది. కాని శ్వేతపత్రంలో దానికి ఆధారాలు చూపించలేదు. ✍️గత ప్రభుత్వం చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అయినా అక్రమాలు జరిగాయని భట్టి విక్రమార్క చెబుతారా! కొత్త విద్యుత్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని విక్రమార్క చేసిన ఆరపణలపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్ చేయడం, దానిపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అందులో ఏమి బయటపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం.ఈ శ్వేతపత్రాలు ఇవ్వడంలో తప్పు లేదు.కాని గత ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రోజులోల చేసినవే.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అలవిగాని హామీలను ఎలా ఇచ్చిందన్నదానికి జవాబు దొరకదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల సాయం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ,గ్యాస్ బండ ఐదువందల రూపాయలకే ఇవ్వవలసి ఉంది.రైతు భరోసా గా తక్షణం ఎకరాకుపదిహేనువేల రూపాయల చొప్పు ఆర్ధిక సాయం అందించవలసి ఉంది. ✍️దళిత బంధు వంటి భారీ స్కీములు ఉండనే ఉన్నాయి. అన్ని స్కీములకు కలిపి అయ్యే వ్యయం నమూడు లక్షల కోట్లపైనే ఉంటుందన్నది ఒక అంచనా . ప్రభుత్వం వీటికి ఎంత వ్యయం అవుతుది అన్నదాని గురించి కూడా ఏమైనా పత్రాలు విడుదల చేస్తుందా అన్నది డౌటే. ఈ స్కీముల అమలులో ఎలాంటి కోత పెడతారో చూడాలి.ప్రజాపాలన పేరుతో ఈ స్కీములు కావాల్సిన వారు నమోదు చేసుకోవాలని అనడమే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నికల మానిఫెస్టోలో అలా చెప్పారా అన్నది ప్రశ్న.ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికి స్కీములు అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వలంటీర్ల వ్యవస్థను పెడతామని గతంలో ఒక సందర్భంలో రేవంత్ అన్నారు. బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నిలబెట్టుకున్నప్పటికీ, దాని వల్ల ఆర్టిసికి ఎంత నష్టం వాటిల్లిందన్నది చెప్పాలి. ✍️దానిని ఎలా భర్తీ చేస్తారు? ఈ స్కీము వల్ల ఆటోలు,క్యాబ్ ల వారికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏమి చూపుతుంది?ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి.గత ప్రభుత్వం ఆర్దిక నిర్వహణ సరిగా లేదు కనుక తాము స్కీములు అమలు చేయలేకపోతున్నామంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు. వందరోజుల తర్వాత కాంగ్రెస్ జవాబు ఇవ్వక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇక కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ప్రభుత్వానికి జవాబు ఇచ్చినప్పటికీ, అందులో అతిశయోక్తులు కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆరులక్షల కోట్లలో ప్రభుత్వ అప్పు మూడున్నరలక్షల కోట్లేనని, మిగిలినవి గ్యారంటీల కింద తెచ్చిన అప్పులని అన్నారు. ఏ అప్పు అయినా ఒకటే అని అనుకుంటారు. పదమూడు లక్షల కోట్లు వ్యయం చేస్తే ఏభై లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ చెబుతున్నారు. ✍️ఆ సంపద నిజంగానే ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే. ఆ సంపద ద్వారా ఆదాయం వస్తున్నట్లయితే ఇన్ని వేల కోట్ల బకాయిలు ఎందుకు పెండింగులో ఉన్నది వివరించాలి. ప్రభుత్వం శ్వేతపత్రంలో వెల్లడించిన వాటికి సమాధానం లేనప్పుడు కేటీఆర్ సెంటిమెంట్ ప్రయోగించారు. రాష్ట్రం అప్పుల పాలైందని పదే,పదే ప్రభుత్వం చెబితే తెలంగాణ పరపతి దెబ్బతింటుందని, తెలంగాణ అస్తిత్వం నిలబడిందంటే దానికి కేసీఆర్ కారణమని కేటీఆర్ అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే కేసీఆర్ పాలన మరీ అద్వాన్నం అని అనలేకపోయినప్పటికీ, కొన్ని విషయాలలో మితిమీరి వ్యవహరించడం వల్ల నష్టపోయారన్నది వాస్తవం. నిజానికి వారు చెబుతున్నదాని ప్రకారం అంత స్వేదం చేసి సంపాదించి ఉంటే ప్రజలు ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు?వారిని ఎందుకు ఓడించారు?కేవలం రాజకీయ కారణాలతోనే ఓటమిపాలయ్యారా?లేక ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల కూడానా అన్నది వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ✍️అప్పుడు కేసీఆర్ మరీ అతిగా వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఈ ఓటమి ఎదురయ్యేది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై అన్నిటిని నెట్టేసి కాలం గడుపుదామన్నా కుదరదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెంచుతున్నది రాజకీయ పార్టీలే. వాటిని నెరవేర్చకపోతే ప్రజలు వెంటనే స్పందించే అవకాశం కూడా ఉంటుంది. వారికి కావల్సింది శ్వేతపత్రాలు,స్వేదపత్రాలు కాదు. రాజకీయ పార్టీలు తాము విడుదల చేసిన ఎన్నికల పత్రాలలోని వాగ్దానాలను నెరవేర్చడం. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
రిజిస్ట్రేషన్లకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల తర్వాత కూడా రెవెన్యూ కార్యకలాపాల్లో కదలిక కనిపించడం లేదు. వాస్తవానికి ఎన్నికలకు ముందే (షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడే) రెవెన్యూ లావాదేవీలు నిలిచిపోయాయి. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన జిల్లాల కలెక్టర్లు కీలకమైన ధరణి పోర్టల్‌తోపాటు ఇతర కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం దాటినా వాటిని పట్టించుకోకపోవడంతో రెవెన్యూ వ్యవస్థ సుప్తచేతనావస్థకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఆ ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచనతో కలెక్టర్లు తమ దగ్గరకు వచ్చిన ఫైళ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కన పెట్టేయడం, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కూడా పట్టించుకోకపోవడంతో తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది రెవెన్యూ పనులు తప్ప మిగిలిన పనులతో కాలం వెళ్లదీస్తుండటం గమనార్హం. ధరణిపై సమీక్షించినా... వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి ధరణి పోర్టల్‌పై సమీక్షించి 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్‌ను ఆదేశించారు. కానీ రెవెన్యూ ఫైళ్ల పరిష్కారం అంశం ఈ సమావేశంలో చర్చకు రాలేదు. ధరణి పోర్టల్ కింద 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సమావేశంలో భాగంగా రెవెన్యూ అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమస్యల పరిష్కారంపైన ఆయన ఎలాంటి ఆదేశాలివ్వకపోవడం గమనార్హం. దీనికితోడు రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కూడా నిలిచిపోయింది. జీవో 58, 59తోపాటు ఇతర జీవోల ద్వారా జరగాల్సిన ఈ ప్రక్రియ కూడా ఎన్నికల కారణంగానే ఆగిపోయింది. ఎన్నికల తర్వాత తమ విన్నపాలకు పరిష్కారం లభిస్తుందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆ దరఖాస్తులను కూడా కలెక్టర్లు పరిష్కరించడం లేదు. అటు ధరణి పోర్టల్, ఇటు భూముల క్రమబద్ధీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో కేవలం ధరణి పోర్టల్ ద్వారా భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి, క్రిస్మస్ తోఫాను పంపిణీ చేయడానికే పరిమితమయ్యామని, భూ సంబంధిత సమస్యలపై తమ కార్యాలయాలకు వచ్చే వారికి సమాధానం చెప్పుకోలేక పోతున్నామని తహసీల్ కార్యాలయాల సిబ్బంది వాపోతున్నారు. అటు ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంతోపాటు భూముల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని, కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారనే కారణంతోనే వ్యవస్థ స్తంభించిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ వ్యవహారాలపై స్పష్టతనివ్వాలని, అప్పుడే భూ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
పామ్ ఆయిల్ : ప్రతి మొక్కపై రూ.90 వరకు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం
-
కేసీఆర్ అప్పుడు మాటిచ్చాడు.. ఇప్పుడు నెరవేర్చాడు GO 111 రద్దుపై హర్షం వ్యక్తం చేసిన రంజిత్ రెడ్డి
-
ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. కేసీఆర్ మాత్రమే మాట నిలబెట్టుకున్నాడు
-
సరికొత్త పాలనకు నాంది.. నేడే సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం నుంచి పరిపాలన వ్యవహారాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టనుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్‌ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. తర్వాత సీఎంతోపాటు మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులై.. కొత్త సెక్రటేరియట్ నుంచి తొలి సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత అతిథులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఉదయం సుదర్శన యాగంతో.. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సుదర్శన యాగంతో శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం సచివాలయ ప్రాంగణంలో యాగశాలను సిద్ధం చేశారు. శృంగేరి పీఠానికి చెందిన వైదికుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6 గంటలకు యాగం ప్రారంభం కానుంది. మద్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్, శోభ దంపతులు పాల్గొంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. కాసేపు సచివాలయంలో కలియదిరిగి.. 6వ అంతస్తులోని తన చాంబర్‌కు చేరుకుంటారు. తన సీట్లో ఆసీనుడై పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేస్తారు. మధ్యాహ్నం 1.58 – 2.04 గంటల మధ్య మంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులు, అదనపు/సంయుక్త/ఉప కార్యదర్శులు, సెక్షన్ అధికారులు, అదనపు సెక్షన్ అధికారులు తమకు కేటాయించిన చాంబర్లు/ సెక్షన్లలో ఆసీనులై ఏవైనా ఫైల్స్‌పై తొలి సంతకాలు చేస్తారు. 2,500 మంది అతిథులకు ఆహ్వానం మధ్యాహ్నం 2.15–2.45 గంటల మధ్య సచివాలయం ప్రాంగణంలో మంత్రులు, సచివాలయ అధికారులు, ఇతర అతిథులతో జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ప్రారం¿ోత్సవ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని శాఖల హెచ్ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, మేయర్లతో సహా మొత్తం 2,500 మంది అతిథులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. మూడేళ్ల 10 నెలల తర్వాత.. పాత సచివాలయ భవనాలను కూల్చి నూతన సచివాలయం కట్టేందుకు 2019 జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. సుమారు మూడేళ్ల 10 నెలల తర్వాత ప్రారం¿ోత్సవం జరుగుతోంది. వాస్తవానికి అన్ని అనుమతులు లభించాక 2021 జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించి.. ఈ నెలాఖరు నాటికి 26 నెలల్లో పూర్తి చేశామని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇన్నాళ్లూ బీఆర్కేఆర్ భవన్లో తాత్కాలికంగా సచివాలయాన్ని నిర్వహించారు. హైమాస్ట్ లైట్ పోల్‌పై కెమెరా.. మొత్తం 300 కెమెరాలు తొలిరోజున పని మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు పనులను చిత్రీకరించేందుకు.. సచివాలయం ఎదురుగా తూర్పు దిశలో రోడ్డుపై ఉన్న భారీ హైమాస్ట్ లైట్ స్తంభంపై ప్రత్యేకంగా కెమెరాను ఏర్పాటు చేశారు. మూడేళ్లుగా జరిగిన పనులను అది చిత్రిస్తూ వచి్చంది. దాని ఆధారంగా ఇటీవలే ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు కూడా. సీఎం ప్రజాదర్బార్‌కు ఏర్పాట్లు కొత్త సచివాలయం 6వ అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఎం చాంబర్ ఏర్పాటు చేశారు. పూర్తిగా పాలరాతితో సీఎం కార్యాలయం, సిబ్బంది విభాగాలను తీర్చిదిద్దారు. సీఎం ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బార్ నిర్వహించేందుకు ‘జనహిత’ పేరిట 250 మంది కూర్చునే సామర్థ్యంతో ఒక హాల్‌ను ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికిపైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్ హాల్‌ను సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60మంది కూర్చునేలా ఒక హాల్, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాల్ నిర్మించారు. ఈ నాలుగు సమావేశ మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలసి భోజనం చేసేందుకు 25 మంది కూర్చోగలిగే అత్యాధునిక డైనింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు. సచివాలయం విశేషాలివీ.. సచివాలయంలో మొత్తం 28 ఎకరాల స్థలం ఉండగా.. 2.45 ఎకరాల(7,79,982 చదరపు అడుగుల)లో.. 265 అడుగుల ఎత్తుతో భవనాన్ని నిర్మించారు. మొత్తం 635 గదులు, 30 సమావేశ మందిరాలు, 34 గుమ్మటాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రధాన భవనం ఆరు అంతస్తులు ఉండగా.. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులు కలిపి మొత్తం 11 అంతస్తులతో నిర్మించారు. సెక్రటేరియట్ ముందువైపు 10 ఎకరాల్లో పచి్చక మైదానం ఉండగా.. కోర్ట్ యార్డు (భవనం మధ్య ఖాళీ భాగంలో) రెండెకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. మొత్తంగా రూ.617 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేయగా.. ఇప్పటివరకు రూ.550 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ఇంకా కొన్ని పనులు సాగుతున్నాయి. అనుకున్న దానికంటే 20–30 శాతం వ్యయం ఎక్కువ అవుతోందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త సచివాలయం విస్తీర్ణం వివరాలివీ.. మొత్తం భూ విస్తీర్ణం: 28 ఎకరాలు భవనం నిర్మించిన ప్రాంతం: 2.45 ఎకరాలు ల్యాండ్ స్కేపింగ్: 7.72 ఎకరాలు సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్: 2.2 ఎకరాలు పార్కింగ్ సామర్థ్యం: 560 కార్లు, 700 బైకులు ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా: 8,58,530 చదరపు అడుగులు లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు: 14 అడుగులు మొత్తం ఎత్తు: 265 అడుగులు నిర్మాణానికి ఉపయోగించిన సామగ్రి ఉక్కు: 8,000 టన్నులు సిమెంటు: 40,,000 టన్నులు ఇసుక: 30,000 టన్నులు (5 వేల లారీలు) కాంక్రీట్: 60,000 క్యూబిక్ మీటర్లు ఇటుకలు: 11 లక్షలు ఆగ్రా రెడ్ స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు గ్రానైట్: మూడు లక్షల చదరపు అడుగులు మార్బుల్: లక్ష చదరపు అడుగులు ధోల్పూర్ రెడ్‌స్టోన్: 3,500 క్యూబిక్ మీటర్లు కలప: 7,500 క్యూబిక్ అడుగులు పనిచేసిన కారి్మకులు: మూడు షిప్టుల్లో 12,000 మంది యాక్సెస్ కార్డు ఉంటేనే లోపలికి.. నూతన సచివాలయ భవనంలోకి ప్రవేశించాలంటే ప్రత్యేకంగా రూపొందించే యాక్సెస్ కార్డు పాస్ తప్పనిసరి. ఏదైనా పనిమీద వచ్చేవారు ఏ శాఖ కార్యాలయానికి వెళ్లాలో అక్కడివరకు మాత్రమే వెళ్లగలిగేలా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. లోపలికి అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండేలా భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు షిఫ్టుల్లో 300 మంది చొప్పున సచివాలయంలో పహారా కాస్తారు. వారికి నిర్ధారిత డ్యూటీ పాయింట్లు ఉంటాయి. – గతంలో పాత సచివాలయంలో కూడా పాస్‌ల జారీ విధానం ఉండేది. ఒకసారి లోనికి వెళ్లాక సీఎం ఉండే సీ బ్లాక్‌లోకి తప్ప మిగతా అన్ని భవనాల్లోకి సులువుగా వెళ్లేందుకు అవకాశం ఉండేది. – సచివాలయంలోకి వెళ్లేందుకు నాలుగు ప్రధాన ద్వారాలు ఉంటాయి. ఇందులో ఆగ్నేయం (గతంలో పెట్రోల్ బంకు ఉండే ప్రాంతం) వైపు ఉండే ద్వారం నుంచి సందర్శకులను అనుమతిస్తారు. సందర్శకులు నిర్ధారిత కార్యాలయానికి వెళ్లేందుకు అక్కడ అనుమతి తీసుకుని, యాక్సెస్ పాస్ పొందాలి. లోపల ఉండే చెకింగ్ పాయింట్ల వద్ద ఆ పాస్‌ను చూపుతూ వెళ్లాలి. ఆ పాస్‌లో ఏ కార్యాలయానికి, ఎటువైపు అనుమతి ఉంటుందో అక్కడికి మాత్రమే సిబ్బంది అనుమతిస్తారు. – మీడియాను కూడా – భవిష్యత్తులో ఫేస్ రీడింగ్‌తో కూడిన యాక్సెస్ కార్డులను జారీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మ్యాన్యువల్‌గా తనిఖీ చేసి పంపే యాక్సెస్ కార్డులను జారీ చేయనున్నారు. – సచివాలయం భద్రత కోసం 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మీడియాకూ ఆంక్షలు! ఆగ్నేయ దిక్కున గేటు సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లోకి మాత్రమే అనుమతిస్తారు. ఏదైనా మంత్రిత్వ శాఖ సమావేశ మందిరాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే.. ముందుగా అధికారులు సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇస్తేనే.. మీడియాను లోపలికి పంపుతారని అధికార వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే సంబంధిత అధికారులు మీడియా సెంటర్ వద్దకే వచ్చి సమాచారం ఇచ్చి వెళ్లేలా యోచన కూడా చేస్తున్నారు. -
నేడు సుప్రీంలో తెలంగాణ గవర్నర్ బిల్లుల పెండింగ్ కేసు విచారణ
-
మూడు బిల్లులకు ఆమోదం..రెండు బిల్లులు పెండింగ్
-
ఆస్కార్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం ఘన సన్మానం
-
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి
చండ్రుగొండ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ ఆదివాసీల చేతిలో మరణించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన మరణం బాధాకరమే. నిజానికి ప్రభుత్వం పోడు భూములపై ఆదివాసీలకు హక్కులు కల్పించడంలో చూపిస్తున్న సాచివేత ధోరణే ప్రజలకూ – ప్రభుత్వ అధికారులకు మధ్య యుద్ధం జరగడానికి కారణం అని చెప్పక తప్పదు. అసలు ఈ సంఘటనకు కారణమేమిటో తేల్చడానికి జిల్లా జడ్జితో విచారణ జరిపించాలని ఆదివాసీలు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమంగా తప్పుడు పద్ధతులలో భూ పట్టాలను మంజూరు చేస్తున్నారు అధికారులు. అలాగే గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తుంటే అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇదంతా తెలిసినా ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన షెడ్యూల్డ్ ప్రాంతంలో కనిపించకుండానే శాంతియుతమైన వాతావరణం క్రమక్రమంగా కరిగి పోతోంది. అందుకు ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్‌పై దాడి ఒక మంచి ఉదాహరణ. అటవీ అధికారులు రాష్ట్రంలో ఆదివాసీ మహిళల మీద, చిన్నారుల మీద దాడులు చేసినప్పడు; పంటలకూ, ఆహార ధాన్యాలకూ, ఇళ్ళకూ నిప్పుపెట్టినప్పుడూ, మనుషుల మీద మూత్రం పోసినప్పుడూ, ఇటువంటి మరికొన్ని అమానవీయ ఘటనలకు పాల్పడినప్పుడూ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు కనిపించవు. పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీ సంఘాలు ఆందోళనలు నిర్వ హించినప్పుడు... పోడు సాగుదారులకు పట్టాలిస్తామనీ, పోడు సమస్యను పరిష్కరిస్తామనీ ఒకపక్క చెబుతూనే... మరోపక్క సాగు చేసుకుంటున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులను ఉసిగొలుపుతోంది ప్రభుత్వం. ఆ నిర్లక్ష్య ధోరణి వల్లే ఈరోజు అటవీ అధికారి శ్రీనివాస్ హత్య జరిగింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ముఖ్యమ్రంతి. చనిపోయిన శ్రీనివాసరావును ముఖ్యమంత్రి తిరిగి తీసుకొస్తాడా? ఆయన పోడు భూముల సాగుపై స్పష్టమైన వైఖరినీ, చిత్తశుద్ధినీ వెల్లడించకుండా ప్రతిసారీ ఎన్నికలసమయంలో సబ్ కమిటీల (అటవీ హక్కుల కమిటీలు) నియామకం పేరుతో కాలం వెళ్ళదీస్తూ అసలు విషయాన్ని దాటవేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. ఏదేమైనా... ఆదివాసీ ప్రజలూ సహనం, ఓపికతో చట్టానికి లోబడే పోరాటం కొనసాగించాలే తప్ప... ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం తగదు. సంయమనం పాటించాలి. (క్లిక్ చేయండి: 28 ఏళ్ల కిందట ఆయుధాలు రద్దు.. అటవీ సంరక్షకులకు రక్షణ ఏదీ?!) – వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
ఇంజనీరింగ్ ఫిజులను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
సింగిల్ ఎజెండా.. టార్గెట్ సెంటర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కొనసాగాయి. 6, 12, 13 తేదీల్లో సమావేశాలు జరిగాయి. శాసనసభ 11 గంటల పాటు, శాసన మండలి 11 గంటల 2 నిమిషాల పాటు కొనసాగాయి. 3 రోజుల ఎజెండాలో చేపట్టిన అంశాలను పరిశీలిస్తే కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపడమే టార్గెట్‌గా ప్రభుత్వం సభను నడిపిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కేంద్ర విద్యుత్ చట్టం–పర్యవసానాలు, ఎఫ్ఆర్బీఎం చట్టం అమలులో కేంద్రం ద్వంద్వ వైఖరి, రాష్ట్ర విభజన హామీల అమలు అంశాలపై జరిగిన మూడు లఘు చర్చల్లోనూ కేంద్రం తీరును రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టింది. కేంద్ర విద్యుత్ చట్టంపై జరి గిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తడమే కాకుండా, తాను చెప్పింది తప్పయితే రాజీనామాకు కూడా సిద్ధమంటూ సంచలన వ్యాఖ్య లుచేశారు. ఎఫ్ఆర్బీఎంపై జరిగిన చర్చలో పాల్గొన్న మంత్రి హరీశ్.. కేంద్రం తీరుపై విమర్శలు చేశారు. ఈ లఘు చర్చల్లో పాల్గొన్న ఇత రమంత్రులు, అధికార పార్టీ సభ్యులు కూడా కేంద్రాన్ని తూర్పారబట్టారు. వీరికి ఎంఐఎం సభ్యులు కూడా జత కలిశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ.. బీజేపీ తప్పులను ఎత్తిచూపుతూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా సభ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈసారి ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. రాజాసింగ్ జైలుకు వెళ్లడం, ఈటలను సభ నుంచి సస్పెండ్ చేయడంతో రఘునందన్ ఒక్కరే టీఆర్ఎస్, కాంగ్రెస్ దాడిని ఎదుర్కొంటూ కేంద్రాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాసం మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం శాసనసభలో మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సభ్యుల సంఖ్యను బట్టి కోఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచామన్నారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, జవహర్‌నగర్ వంటి చోట్ల కోఆప్షన్ సభ్యులను పెంచా మని చెప్పారు. మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు మూడేళ్లు దాటితే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాసం ప్రవేశపెట్టవచ్చని ఉన్న నిబంధనను మార్చేసి దాని వ్యవధిని నాలుగేళ్లకు పెంచామని తెలిపారు. కేతనపల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపురం మున్సి పాలిటీగా మార్చామన్నారు. గ్రామపంచాయతీగా కొనసాగుతున్న జిల్లా కేంద్రమైన ములుగు పట్టణాన్ని మున్సిపాలిటీగా మా ర్చుతున్నామన్నారు. తర్వాత బిల్లును సభ ఆమోదించింది. కాగా, మంత్రి తలసాని మంగళవారం ప్రవేశపెట్టిన తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. అలాగే ఆజామాబాద్ పారిశ్రామిక చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 136.4 ఎకరాల పారిశ్రామిక ప్రాంతంలో కొందరు సొంత లీజుతో పరిశ్రమలు నడుపుతుండగా, మరికొన్నింటికి యజమానులు మారారని మంత్రి కేటీఆర్ తెలిపారు. లీజు గడువు ముగి యడంతో పరిశ్రమలు నడుస్తున్న భూములను క్రమబద్ధీకరించి, మిగతావి ప్రజాప్ర యోజనాలకు ఉపయోగిస్తామన్నారు. జీరో అవర్, ప్రశ్నోత్తరాలు లేకుండానే.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఈసారి జీరో అవర్, ప్రశ్నోత్తరాలు లేకుండానే ముగిశాయి. ప్రభుత్వ బిల్లులు, సభ్యుల మృతికి సంతా పాలు, లఘుచర్చలకే పరిమితమయ్యాయి. వినాయక చవితి ఉత్స వాలు, ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు జరిగే జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు 3 రోజులకే పరిమితమయ్యాయి. సమావేశాల్లో మూడు అంశాలపై లఘు చర్చ జరగ్గా, రెండు అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఎనిమిది ప్రభుత్వ బిల్లులను ఈ నెల 12న శాసనసభలో ప్రవేశపెట్టగా, మంగళవారం చర్చించి ఉభయ సభలు ఆమోదించాయి. తొలిరోజు దివంగత మాజీ సభ్యులు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌రెడ్డికి సంతాపం ప్రకటించి ఎజెండా లేకుండానే వాయిదా పడింది. ఈ నెల 12న తిరిగి ప్రారంభమైన శాసనసభ రెండోరోజు ఏడు ప్రభుత్వ బిల్లుల సమర్పణకే పరిమితమైంది. చివరిరోజు 13న అనుబంధ ప్రభుత్వ బిల్లుతో పాటు మొత్తం 8 బిల్లులు నామమాత్ర చర్చతో ఆమోదం పొందాయి. నిరవధిక వాయిదా అసెంబ్లీలో చేపట్టిన మూడు లఘు చర్చ లతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో వరదముంపుపైనా తొలిరోజు శాసన మండలి లఘు చర్చ చేపట్టింది. శాసనసభలో 28 మంది సభ్యులు ప్రసంగించారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు మంగళవారం సాయంత్రం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించడంతో వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఇదీ చదవండి: ఆనాటి తారకరాముడి డైలాగ్‌తో అదరగొట్టిన కేటీఆర్.. అసెంబ్లీలో చప్పట్ల మోత! -
తెలంగాణ ప్రభుత్వం పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
-
KCR Government: బడ్జెట్ లోటు.. పూడ్చుకునేదెట్లా? ఏకంగా రూ.45 వేల కోట్ల లోటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు నిధులు సమకూర్చుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుత ఆదాయ వనరులను పెంచుకోవడంతోపాటు కొత్త, అదనపు ఆదాయ వనరుల అన్వేషణపై ఫోకస్ చేసింది. 2022–23 బడ్జెట్లో పెట్టుకున్న కేంద్ర పద్దులు, రుణ సేకరణ అంచనాల్లో ఏకంగా రూ.45 వేల కోట్ల లోటు ఏర్పడుతుండటంతో.. దానిని పూడ్చుకునేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో ఆదాయ వనరుల సమీకరణతోపాటు పలు ఇతర అంశాలపై మిగతా 5వ పేజీలో చర్చ జరుగుతుందని సీఎంవో కార్యాలయ వర్గాలు ప్రకటించాయి. ఆదాయ వ్యయాల లెక్కలు తేల్చి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాల లెక్కలను మంత్రివర్గ భేటీలో పరిశీలించనున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. రుణ సమీకరణలో కేంద్రం సహాయ నిరాకరణ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సాయంలో తెలంగాణ పట్ల వివక్షపై చర్చించే అవకాశం ఉందని వెల్లడించాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన సబ్‌కమిటీ సిఫార్సులను కేబినెట్ భేటీలో పరిశీలించి.. ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. రుణాలపై కేంద్ర నిర్ణయంతో.. కార్పొరేషన్ల పేరిట తీసుకునే రుణాలకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీని కూడా.. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కింద లెక్కగడతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీనివల్ల ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిపై ప్రభావం పడుతుందని, రుణ అంచనాల్లో రూ.15 వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇక గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద కేంద్ర సాయం అంచనాల్లో రూ.18 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతోందని అంచనా వేసింది. ఈ లెక్కన ఈసారి రూ.30 వేల కోట్ల మేర తక్కువగా రావొచ్చని లెక్కించింది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రూ.45 వేల కోట్ల వరకు లోటు ఏర్పడుతోందని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచామంటున్నా.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, ఇతర పథకాలకు కోతలతో గతంలో కంటే తక్కువగా నిధులు వస్తున్నాయని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను భారీగా పెంచుతుండటం, రూ.లక్ష వరకు రుణమాఫీ, వరద నష్టం, ప్రాజెక్టుల మరమ్మతులు, నిర్మాణ వ్యయం, రుణాల అసలు, వడ్డీ చెల్లింపుల వంటివాటికి నిధుల అవసరం భారీగా పెరగనుందని వివరిస్తున్నారు. పన్నేతర ఆదాయంపై దృష్టి రాష్ట్రంలో ఇసుక అమ్మకాలు, మైనింగ్ రాయల్టీ పెంపు, రాజీవ్ స్వగృహ ఇండ్లు, నిరుపయోగ భూముల అమ్మకాలు, ఎల్ఆర్ఎస్ అమలు, పన్ను లీకేజీలను అరికట్టడం వంటి అంశాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. భూముల మార్కెట్ విలువలను మరోసారి పెంచే అవకాశాలనూ కేబినెట్ పరిశీలించే అవకాశం ఉందని అంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో భూముల విలువలను సవరించినా.. చాలా ప్రాంతాల్లో అంచనా వేసుకున్నదానికన్నా తక్కువే పెరిగిందని, ఆయా ప్రాంతాల్లో మరోసారి భూముల విలువలను సవరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి.. ప్రజలపై ఎక్కువగా భారం పడకుండా అదనపు నిధులను సమీకరించే మార్గాలను ప్రభుత్వం అనుసరించనుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాదీ గ్రాంట్లు అంతంతే! 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ నెల గణాంకాలను మాత్రమే కాగ్ విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యంలో.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేవలం 6 శాతం, కేంద్ర పన్నుల్లో వాటా 5 శాతం మేర మాత్రమే వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల కింద 48,724.12 కోట్లు సమీకరించుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంకాగా.. ఇప్పటివరకు రూ.14,500 కోట్లను ఆర్బీఐ నుంచి బాండ్లను వేలం ద్వారా సమకూర్చుకుంది. మరో రూ.10 వేల కోట్ల రుణ వెసులుబాటుకు కేంద్రం అంగీకరించింది. లక్ష్యం మేరకు మరో రూ.25 వేల కోట్లవరకు బహిరంగ మార్కెట్ నుంచి రుణాలనే సేకరించాల్సి ఉంది. అయితే కార్పొరేషన్ల కింద తీసుకున్న రుణాల విషయం ఇంతవరకు తేలలేదు. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గకుంటే భారీగా నిధుల లోటు ఏర్పడుతుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశంపైనా.. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈనెల 21న నిర్వహించే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, స్థానిక సంస్థల సమావేశాలు, మునుగోడు ఉప ఎన్నిక, ఇతర అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకు రానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చదవండి: నేతిబీరకాయలో నేతి లాంటిదే.. నీతి ఆయోగ్‌లోని నీతి: మంత్రి కేటీఆర్ ట్వీట్ -
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి సింధియా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంద్రి జ్యోతిరాదిత్య సింధియా. రాష్ట్రం తిరోగమనంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్ సర్కార్ సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. బీజేపీ హయాంలోనే తెలంగాణకు అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. అలాగే తెలంగాణలో అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని సింధియా ఆరోపించారు. తప్పు చేయనప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అంటే భయమెందుకు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పార్లమెంట్ ప్రవాస్ యోజనలో పాల్గొన్నారు సింధియా. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు సింధియా. గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆయనకు స్వాగతం పలికారు. చదవండి: రాజగోపాల్‌రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్లో ఉత్కంఠ -
తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’
Telangana Government: రాష్ట్రంలో వ్యవసాయానికి కీలకమైన సాగునీటి సౌకర్యం, రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం నేపథ్యంలో భూముల ధరలు పెరిగిపోతున్నాయి. దీన్ని రాష్ట్ర ఖజనాకు కచ్చితమైన ఆదాయం తెచి్చపెట్టే వనరుగా ప్రభుత్వం మార్చుకుంటోంది. ఏడేళ్ల పాటు భూముల విలువల పెంపుపై దృషి?ట్పట్టని ప్రభుత్వం ఏడెనిమిది నెలల క్రితం భూ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచింది. తాజాగా మరోసారి భూముల విలువలు పెంచేందుకు కసరత్తు దాదాపు పూర్తిచేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురవడంతో.. నల్లధనాన్ని కొద్దిగానైనా అరికట్టే అవకాశాలుంటాయని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది జూలైలో సవరించిన విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో నెలకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుండగా, తాజాగా భూ విలువల పెంపుతో ప్రతినెలా మరో రూ.200 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున రూ.1,200 కోట్లుంటుందని, సాలీనా ఇది రూ.15 వేల కోట్లకు చేరుతుందని చెబుతున్నారు. గతేడాది వరకు రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా కేవలం రూ.5,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు రాబడులు వచ్చేవని గత నాలుగేళ్లలో జరిగిన లావాదేవీల గణాంకాలు స్పష్టం చే స్తుండగా, తాజా సవరణలు అమల్లోకి వస్తే అది ఏటా రూ.15 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభు త్వ సొంత పన్నుల ఆదాయం ఒక్క స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే ఏడాదికి అదనంగా రూ.8,000 కోట్ల వరకు పెరగనుందన్నమాట. ఇప్పటికి రూ.9 వేల కోట్ల పైమాటే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజి్రస్టేషన్ల ఆదాయాన్ని పరిశీలిస్తే జూలైలో ప్రభుత్వ విలువల సవరణకు ముందు మూడు నెలలు కలిపి వచి్చంది కేవలం రూ.1,500 కోట్లపైమాటే. అంటే నెలకు సగటున రూ.500 కోట్లకు పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా ఆదాయం వచి్చంది. కానీ జూలైలో భూముల ప్రభుత్వ విలువలను సవరించడంతో పాటు అప్పటివరకు 6 శాతంగా ఉన్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతానికి పెంచారు. అలాగే యూజర్ చార్జీలను కూడా భారీగా పెంచారు. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. జూలైలో ఏకంగా 2.2 లక్షల డాక్యుమెంట్ లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,201 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఒక్క ఆగస్టులో మినహా అన్ని నెలల్లోనూ ఆదాయం రూ.1,000 కోట్లకుపైనే వస్తోంది. ఇప్పుడు తాజాగా కేవలం భూముల విలువలను మాత్రమే సవరిస్తుండడంతో నెలకు అదనంగా రూ.200 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘వ్యవసాయ’ఆదాయంలోనూ పెరుగుదల 2021–22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే ఆదాయం క్రమంగా పెరుగుతోందని తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో రూ.81.93 కోట్లు వచి్చన ఆదాయం జూలైలో అత్యధికంగా రూ.156.43 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఆగస్టు, అక్టోబర్ నెలల్లో మినహా అన్ని నెలల్లో రూ.150 కోట్లు దాటింది. మొత్తమ్మీద ధరణి పోర్టల్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 6,00,443 లావాదేవీలు జరగ్గా రూ.1,220.54 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. -
తెలంగాణలో కోవిడ్ మృతులెందరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. మంగళవారం (18న) రాత్రి వరకు కరోనా వైరస్ సోకి చనిపోయినవారు 4,062 మంది మాత్రమే. కానీ సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12 వేల మందికి పైగా కరోనా బాధిత కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించింది. ఇంకా పెద్దసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పొంతనలేని లెక్కలు చర్చనీయాంశమయ్యాయి కేంద్ర సాయం కోసం..: కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించా లని గతేడాది డిసెంబర్లో సుప్రీంకోర్టు కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాటిని జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీల ద్వారా పరిశీలించి అర్హమైన దరఖాస్తులను ఎంపికచేసి, పరిహారమిస్తున్నారు. పరిహారం కోసం ఇప్పటివరకు 28,969 దరఖాస్తులు రాగా.. అందులో 15,270 ఆమోదం పొందాయని, 12,148 మం దికి పరిహారం అందించామని ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులిటెన్లలో వెల్లడిస్తున్న కరోనా మృతుల లెక్కల కంటే.. దరఖాస్తుల సంఖ్య ఏడెనిమిది రెట్లు ఎక్కువున్నాయి. కరోనా మృతుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించిన క్రమంలోనే ఎక్కువ దరఖాస్తుల ను ఆమోదిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
మరో 2,398 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 2,398 మందికి కోవిడ్–19 వ్యాప్తి చెందినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 7,05,199 మంది కోవిడ్–19 బారిన పడగా, వీరిలో 6,79,471 మంది కోలుకున్నారు. మరో 21,676 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 4,052కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 68,525 నిర్ధారణ పరీక్షలు చేయగా, 10,118 నమూనాలకు సంబంధించి ఫలితాలు వెలువడాల్సి ఉంది. కోవిడ్–19 నిర్ధారణ కోసం రాష్ట్రంలో ఇప్పటివరకు 3.05కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. -
వద్దన్నా.. వరి సాగు
-
రెండేళ్లయినా రెండు జతలే.. పాత దుస్తులతోనే..
సాక్షి,కరీంనగర్: సర్కారు పాఠశాలల్లో చదివేవిద్యార్థులకు ప్రభుత్వం రెండు జతల యూనిఫాం దుస్తులు అందిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఉచితదుస్తుల పంపిణీకి మంగళం పాడడంతో పాత దుస్తులు వేసుకునే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇటీవల ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యపెరగడంతో దుస్తులు, పాఠ్యపుస్తకా లు, సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. రెండేళ్లుగా దుస్తుల పంపిణీ లేకపోవడంతో చాలా చోట్ల సాధారణ దుస్తులతోనే విద్యార్థులు బడికివెళ్తున్నారు. కరోనా ఉధృతి తగ్గాక ఈ ఏడాది సెప్టెంబరు 1నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా.. ఇప్పటి వరకు ఏకరూ ప దుస్తులు అందలేదు.కుట్టించడానికి వస్త్రం కూడా జిల్లాకు రాలేదు. గతంలో ఇచ్చిన ఏకరూప దుస్తులు పెరిగిన పిల్లలకు పొట్టివై పనికి రావడం లేదు. జిల్లాలో 652 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 42,218 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఏటా రెండు జతల దుస్తులను ప్రభుత్వం అందిస్తోంది. టెస్కో సంస్థ నుంచి దుస్తులకు అవసరమైన వస్త్రాన్ని సరఫరా చేసేది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు.. తప్ప దుస్తుల పంపిణీ జరుగలేదు. ‘రెండు జతల దుస్తుల పంపిణీపై జిల్లా నుంచి నివేదిక పంపించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటిని విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. రాగానే అందరికి పంపిణీ చేస్తాం’ అని డీఈవో జనార్ధన్‌రావు తెలిపారు. చదవండి: ‘సచ్చినా సరే.. టీకా మాత్రం వేసుకోను’ -
ఆన్లైన్ పాఠాల్లేవ్.. పనులే
ఆన్లైన్ పాఠాలు అర్థంగాక.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరికి చెందిన ఈ విద్యార్థి పేరు నరేశ్. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ పాఠాలు అర్థంకావడం లేదని ఆవేదన చెందుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అన్నయ్యకు తోడుగా గొర్రెలు మేపేందుకు పంపుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్తున్న క్రమంలో.. పదేళ్లలోపు పిల్లలను ఇంటివద్ద ఒంటరిగా వదలలేక పోతున్నారు. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నా తమ వెంట తీసుకెళ్తున్నారు. కరోనాతో ఉపాధి దెబ్బతినడం.. ఆస్పత్రులకు అయిన ఖర్చులతో చాలా కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. ఇప్పుడు వ్యవసాయ పనుల సీజన్ కావడం, ఆన్లైన్ క్లాసులు అర్థంకాని పరిస్థితులు ఉండటంతో.. పిల్లలను కూడా పనులకు పంపుతున్నారు. కూలీల కరువు.. రేట్లు పెరగడంతో.. ఈ ఫోటోలో కన్పిస్తున్న విద్యార్థి పేరు పీరబోయిన గణేశ్. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాలకు చెందిన గణేశ్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కూలి రేట్లు పెరిగిపోయి తల్లిదండ్రులు వ్యవసాయంలో ఇబ్బంది పడుతుండటంతో.. క్లాసులకు హాజరుకాకుండా తల్లిదండ్రులకు సాయం చేస్తున్నాడు. (సాక్షి నెట్వర్క్) కరోనా దెబ్బతో పాఠశాలలు మూసి ఉంచడం, ఆన్లైన్ పాఠాలే దిక్కు అవడం పిల్లల చదువులకు శరాఘా తంగా మారింది. సెల్ఫోన్లు, ట్యాబ్‌లు లేక, అవి ఉన్నా సిగ్నళ్లు సరిగా అందక, డేటా చార్జీలను భరించలేక, అన్నీ ఉన్నా ఆన్లైన్ పాఠాలు అర్థంగాక.. పిల్లలు చదువులు వదిలి పనుల బాట పడుతున్నారు. ఈ పరిస్థితిపై ‘సాక్షి’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల ఉపా ధ్యాయులతో మాట్లాడి పలు అంశాలపై సర్వే చేసింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఇబ్బందులను గుర్తించింది. ఆన్లైన్ పాఠాలు, బోధన తీరుపై దాదాపు అందరిలోనూ అసంతృప్తి కనిపించింది. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు రాయటం, చదవటం సమస్యగా మారిందని.. వారి మానసిక స్థితి ఇబ్బందికరంగా తయారవుతోందని ఆందో ళన వ్యక్తమైంది. ఆన్లైన్ పాఠాలు అర్థమయ్యే పరిస్థితి లేద ని.. పలు కఠిన నిబంధనలు పెట్టి అయినా పాఠశాలలను తెరవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడటం గమనార్హం. ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ఆర్థిక ఇబ్బందులతో.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఆన్లైన్ క్లాసులు ఓ మోస్తరుగా బాగానే జరుగుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేద కుటుంబాలు కావడంతో స్మార్ట్ఫోన్లు కొనలేకపోవడం, కొన్నా డేటా కోసం అదనపు ఖర్చు, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నచోట ఒకే ఫోన్ ఉండటంతో వారు మాత్రమే పాఠాలు వినడం వంటివి జరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలను వ్యవసాయం, ఇతర పనులకు తీసుకెళ్తు న్నారు. ఆన్లైన్ పాఠాలు సరిగా అర్థం కావడంలేదని పిల్లలు చెప్తుండటం, ఇంట్లోనే ఉంటుండటం కూడా దీనికి కారణమవుతోంది. వ్యవసాయ సీజన్ కావడంతో కూలీల కొరత నెలకొంది. రేట్లు పెరిగాయి. దీనివల్ల కూడా పిల్లలు ఆన్లైన్ పాఠాలను పక్కనపెట్టి.. కూలిపనులకు వెళ్లడం పెరిగింది. అందని సిగ్నళ్లు.. కరెంటు కోతలు పట్టణప్రాంతాల్లో సెల్‌ఫోన్ సిగ్నళ్లు బాగానే ఉన్నా.. జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో సెల్‌ఫోన్ సిగ్నళ్లు సరిగా అందడం లేదు. కాసింత సిగ్నల్ వచ్చినా అది ఆన్లైన్ పాఠాలకు సరిపడేంతగా డేటా స్పీడ్ రావడం లేదు. పొలాల్లో మంచెలు, చెట్లు ఎక్కి పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గ్రామాల్లో కూడా సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగా ఉండటం లేదు. అక్కడక్కడా కరెంటు కోతలు కూడా ఉంటున్నాయి. దీంతో పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండలేక తల్లిదండ్రులతో పనులకు వెళ్తున్నారు. ఆన్లైన్ పాఠాలు అర్థంగాక.. చాలా మంది విద్యార్థులు తమకు ఆన్లైన్ పాఠాలు సరిగా అర్థంకావడం లేదని వాపోతున్నారు. సిగ్నల్ సరిగాలేక తరచూ ఆగిపోతుండటం, ఉపాధ్యాయుల గొంతు సరిగా వినిపించకపోతుండటం వంటి సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. దానికితోడు తమ వద్ద ఉన్న ఫోన్లలో ధ్వని సరిగా రావడం లేదని కొందరు చెప్తున్నారు. ఏదైనా సందేహం వస్తే.. అడిగి తెలుసుకునే అవకాశం లేక పాఠం అర్థంకావడం లేదని వాపోతున్నారు. ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారని.. ఆన్లైన్ పాఠాల కోసమని తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ అప్ప గిస్తే.. పలుచోట్ల పిల్లలు గేమ్స్ ఆడుతూ, యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ గడిపేస్తున్నారు. ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. పిల్లలను ఆన్లైన్ క్లాసుల కోసం ఇంట్లో వదిలి తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్తున్న చోట ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అంతేగాకుండా పిల్లలు క్లాసులను పక్కనపెట్టేసి ఆటలు ఆడటానికి వెళ్తున్నారని కొందరు తల్లిదండ్రులు చెప్పారు. అందుకని ఇంట్లో వదలకుండా వ్యవసాయం, ఇతర పనుల కోసం తమ వెంట తీసుకెళ్తున్నామని తెలిపారు. సరైన పర్యవేక్షణ, అవగాహన ఏదీ.. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఆన్లైన్ తరగతులతోపాటు టీవీల్లో డిజిటల్ పాఠాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫోన్, టీవీ సదుపాయం లేనివారికి సమీపంలోని తోటి విద్యార్థుల ఇళ్లలోగానీ, గ్రామ పంచాయతీల్లోని టీవీల్లో గానీ తరగతులు వీక్షించేలా ఏర్పాట్లు చేయా లని విద్యా శాఖ గతంలోనే ఆదేశించింది. కానీ ఈ విషయంగా సరైన పర్యవేక్షణ జరగక.. చాలా మంది విద్యార్థులు పాఠాలకు దూరమవుతున్నారు. ఎక్కడిక్కడ 70–80 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్/డిజిటల్ తరగతులకు హాజరవుతున్నట్టు అధికారులు చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. పాఠాలు వింటున్నది సగమే! ఆన్లైన్/డిజిటల్ పాఠాలపై ‘సాక్షి’నిర్వహించిన సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. పాఠశాల ల్లో తోటివారితో కలిసి చదువుకునే విద్యార్థులు.. ఇప్పుడు ఒంటరితనం అనుభవిస్తున్నారని, ప్రవర్తనలో మార్పులు వచ్చాయని, క్రమశిక్షణ లేని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు వెల్లడించారు. విద్యార్థులకు ఫోన్ వ్యసనంగా మారుతోందని, గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం వంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో పాఠాలు వినడం లేదని.. విన్నా సరిగా అర్థం కావడం లేదని దాదాపు సగం మంది విద్యార్థులు తెలిపారు. ఆన్లైన్ తరగతులు బాగోలేవని విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు టీచర్లు కూడా అభిప్రాయపడ్డారు. తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్/ట్యాబ్ అందుబాటులో లేవని, అప్పులు చేసి కొన్నామని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. ఆన్లైన్ పాఠాలకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల అభిప్రాయాలు. స్మార్ట్‌ఫోన్ లేక.. పశువులు కాస్తున్న ఈ చిన్నారి పేరు గణేశ్. మెదక్ మండలం మక్తభూపతిపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో తండ్రి శ్రీశైలం వద్ద ఒక్కటే ఫోన్ ఉంది. ఆయన బయటికి వెళ్తే.. గణేశ్ పాఠాలు వినే పరిస్థితి లేదు. దాంతోపశువులు మేపేందుకు వెళ్తున్నాడు. పాఠాలు సరిగా వినట్లేదని.. ఈ ఫొటోలోని బాలుడి పేరు వినయ్ కుమార్. సూర్యాపేట జిల్లాలోని కుంటపల్లికి చెందిన ఈ బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు అర్థంకావడం లేదంటూ పాఠాలు వినడం లేదు. ఇంట్లోంచి బయటికెళ్లి ఆటలాడుతున్నాడని, ఏదైనా ప్రమాదానికి గురవుతాడోనని ఆందోళన చెందిన తండ్రి మల్లయ్య.. వినయ్‌ను వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నాడు. స్మార్ట్‌ఫోన్ కోసం.. ఈ ఫొటోలో వరినారు తీస్తున్న విద్యార్థి పేరు శేఖర్. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సాకు చెందిన శేఖర్.. ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. స్మార్ట్‌ఫోన్ లేక ఆన్లైన్ పాఠాలు వినడం లేదు. ఫోన్ కొనుక్కునేందుకు డబ్బుల కోసం కూలిపనులకు వెళ్తున్నట్టు తెలిపాడు. వారానికి రెండు క్లాసులైనా.. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు వారానికి రెండు క్లాసులైనా తీసుకుంటే మంచిది. దూరదూరంగా కూర్చోబెట్టి బోధన చేయొచ్చు. మిగతా రోజుల్లో వర్క్షీట్ల ద్వారా పాఠాలపై అవగాహన కల్పించవచ్చు. ఆన్లైన్ ద్వారా ఏకబిగిన పాఠాలు బోధించడం వల్ల కంఠశోష తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. - జి.నాగభూషణం, ప్రధానోపాధ్యాయుడు, మన్నెంపల్లి, కరీంనగర్ జిల్లా -
మాఫీ.. వారంతా హ్యాపీ
సాక్షి, చేవెళ్ల( రంగారెడ్డి): రుణమాఫీ రెండో విడతకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి రూ.50వేల రుణాలు ఉన్నవారికి మాఫీ వర్తింపచేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రల కేబినెట్ సమాశంలో రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో అర్హత సాధించిన రైతుల్లో 30–40 శాతానికిపైగా రెండో విడతలో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ఊరిస్తున్న రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ► ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 నాటికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు కుటుంబానికి రూ.లక్ష వడ్డీతో కలుపుకొని నాలుగు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. ► దీని ప్రకారం గత ఏడాది తొలివిడత రూ.25వేల లోపు రుణం ఉన్న రైతులకు వర్తింపచేశారు. ► ఇది జిల్లాలోని 10 శాతం మంది రైతులకు మాత్రమే వర్తించింది. కొంతమంది అర్హులైన వారికి పలు కారణాలతో వర్తించ లేదు. ► రుణాలు పొందిన రైతులు మాఫీ వస్తుందని బ్యాంకులకు బాకీలు కట్టడం మానేశారు. ► ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడిస్తోందో తెలియక బ్యాంకర్లు బాకీలు కట్టాలని రైతులపై ఒత్తిడి చేయడం పరిపాటిగా మారింది. ► రెండో విడత రుణమాఫీపై ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది ప్రభుత్వం. ► ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుండటంతో వెంటనే రెండో విడత రుణమాఫీ విడుదలపై నిర్ణయం తీసుకుంది. ► ఈ నెల 16నుంచి రైతుల ఖాతాల్లోకి పంట రుణమాఫీ డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత.. ► జిల్లాలో మొత్తం 1,46,417 మంది రైతులు రుణమాఫీ పొందేందుకు అర్హులని అధికారులు గుర్తించారు. ► ఇందులో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న పది శాతం మందికి మాత్రమే వర్తించింది. ► ఇప్పుడు రెండో విడతలో రూ.50వేల లోపు రుణాలున్న రైతులకు మాఫీ చేసేందుకు నిర్ణయించడంతో 30 నుంచి 40 శాతం మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ► రూ.50 వేల లోపు ఉన్న రైతులకు సంబంధించి రెండో విడతలో అమలు చేసేందుకు బ్యాంకర్ల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ► ఒకటి, రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా పక్కా సమాచారం అందుతుందని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. ► జిల్లాలో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న వారిని 17,943 మందిగా గుర్తించగా ఇందులో 10,928 మందికిగాను రూ.16.73కోట్లు విడుదల చేసింది. ► మిగతావారికి వివిధ కారణాలతో రుణమాఫీ వర్తించలేదు. వారికి ఇప్పుడు రెండో విడతలో వడ్డీతో కలుపుకొని రూ.50వేలలోపు రుణమాఫీ కానుందని అధికారులు చెబుతున్నారు. -
‘కాళేశ్వర ఫలం’: 2.70 లక్షల ఎకరాలకు తొలి తడి
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తొలిసారి కొత్త ఆయకట్టుకు నీరందనుంది. ఇప్పటివరకు ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగానే ఎత్తిపోతలు కొనసాగగా.. మొదటిసారి 2.70 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు గోదావరి పారనుంది. అన్నీ కుదిరితే వచ్చే నెల చివరి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేలా సాగునీటి శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇందులో ఈ ఏడాది నుంచి పాక్షికంగా అందుబాటులోకి రానున్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద సైతం 55వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందనుంది. అన్ని రిజర్వాయర్ల కింద ఆయకట్టుకు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 18.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 18.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మొదలైన కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. ముఖ్యంగా ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2 పరిధిలో ఉన్న 13 లక్షల ఎకరాలకు గానూ లోయర్ మానేరు దిగువున ఉన్న ఆయకట్టు సుమారు 8 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారానే నీరందిస్తున్నారు. మిడ్‌మానేరు దిగువున కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్న రిజర్వాయర్లన్నింటినీ నింపినా వాటి చెరువులు నింపేందుకు మాత్రమే నీటిని వదిలారు. అయితే ఈ ఏడాది వానాకాలంలో మాత్రం తొలిసారి కాళేశ్వరంలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు.. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఇటీవలే నిర్ణయించగా, దీనితో పాటు అనంతగిరి రిజర్వాయర్ కింద 20 వేల ఎకరాలు, రంగనాయక్ సాగర్ కింద 55 వేల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 55 వేల ఎకరాలు, కొండపోచమ్మ సాగర్ కింద 70 వేల ఎకరాలకు కొత్తగా నీరివ్వాలని నిర్ణయించారు. ఇందులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ పనులు చివరి దశలో ఉన్నాయి. 95 శాతం మేర పనులు ఇప్పటికే పూర్తవగా, జూలై 20 నాటికి మిగతా పనులు పూర్తి చేయనున్నారు. ఇందులో 50 టీఎంసీలకు గానూ మొదట 10 టీఎంసీలు నింపి, తర్వాత ప్రతి మూడు నెలలకు మరో 10 టీఎంసీలు నింపుతూ వెళ్లనున్నారు. తొలిసారిగా నింపే నీటి నుంచే సుమారు 55 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా కాల్వల పనులు పూర్తి చేస్తున్నారు. ఇక 15 టీఎంసీల సామర్ధ్యం గల కొండపోచమ్మ కింద తొలి ఏడాదిలో 7.8 టీఎంసీలు మాత్రమే నింపగా, ఈ ఏడాది పూర్తి స్థాయిలో నింపనున్నారు. దీనికింద సంగారెడ్డి, గజ్వేల్, రామాయంపేట, కిష్టాపూర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి, ఎం.తుర్కపల్లి, రావెల్ కోల్ వంటి కాల్వలు ఉండగా, 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో జగదేవ్‌పూర్, గజ్వేల్, రామాయంపేట, తుర్కపల్లి కాల్వల పనులు పూర్తయ్యాయి. వీటికింద కనీసంగా 70 వేల ఎకరాలకు సాగు నీరందించేలా పనులు జరిగాయి. ఇక కాళేశ్వరంలోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన పైప్‌లైన్‌న్ వ్యవస్థ నిర్మాణాలు పాక్షికంగా పూర్తవడంతో ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లివ్వనున్నారు. ఆయకట్టుకు నీటిని ఇవ్వడంతో ఈ రిజర్వాయర్ల కింద కనీసంగా 300 వరకు చెరువులు నింపే ప్రణాళిక సైతం సిద్ధమైంది. వానాకాలం, యాసంగిలో నీటి లభ్యత పెంచేలా చెరువులను పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలు ద్వారా రెండేళ్లుగా కేవలం స్థిరీకరణ అవసరాల నిమిత్తమే నీటి వినియోగం జరిగింది. అయితే తొలిసారిగా ఈ సీజన్లో ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్ల కింద కొత్త ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తి చేశారు. మిడ్‌మానేరు కింద 50 వేల ఎకరాలు, అనంతగిరి 20 వేల ఎకరాలు రంగనాయక్ సాగర్- 55 వేల ఎకరాలు మల్లన్న సాగర్ - 55 వేల ఎకరాలు కొండపోచమ్మ సాగర్- 70 వేల ఎకరాలు కాళేశ్వరం ప్యాకేజీ-21 కింద - 20 వేల ఎకరాలు కలిపి మొత్తం 2.70 లక్షల ఎకరాలకు సాగు నీళ్లివ్వనున్నారు. -
తెలంగాణ ప్రభుత్వం పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్
-
Telangana: కాంట్రాక్ట్ అధ్యాపకులకు తీపికబురు
సాక్షి, నల్లగొండ: కాంట్రాక్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెగ్యులర్ ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా వారి వేతనాలు కూడా పెంచింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 320 మందికి వేతనాలు పెరగనున్నాయి. దీంతో వారంతా ఆనందంలో మునిగారు. టీఆర్ఎస్ పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ చేస్తూ జీఓ 16ను విడుదల చేసింది. ఆ సమస్య కోర్టులో పడడంతో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మూల వేతనాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులకు అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వడంతో అప్పటివరకు రూ.18 వేలకు పనిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనం రూ.37,100కు పెరిగింది. దీంతో రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన వేతనం పొందుతూ వచ్చారు. గురువారం ప్రభుత్వం 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచుతూ జీఓ105 ద్వారా వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో ఉద్యోగికి ప్రస్తుతం వేతనం రూ.54,220కు పెరిగింది. చదవండి: తెలంగాణలోనూ నాడు-నేడు -
Corona Vaccine: సూపర్ స్ప్రెడర్స్‌కు టీకా ఇలా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి రోడ్ మ్యాప్ ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉంటారని అంచనా వేసిన ప్రభుత్వం తొలి దశలో 7.75 లక్షల మందికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఆరు లక్షల మంది ఉంటారని అంచనా వేసింది. సూపర్ స్ప్రెడర్స్‌ను గుర్తించి, వ్యాక్సిన్ వేసే బాధ్యతను ఎంపిక చేసిన విభాగాలకు అప్పగించింది. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు వీరందరికీ సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచనున్నారు. శుక్రవారం నుంచి ఈ వ్యాక్సిన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో 6 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉంటే, అందులో 3 లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. వీరందరికీ రాబోయే నెలరోజుల్లో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. వీరు కాకుండా మిగిలిన మరో 3 లక్షల మందిలో రైతు బజార్లలో పనిచేసే సిబ్బంది, కూరగాయాలు అమ్మే వారు, మద్యం దుకాణాల్లోని సిబ్బంది, కిరాణా షాపులు, స్ట్రీట్ వెండర్స్, సెలూన్ షాపుల్లో పనిచేసే వారు ఉన్నారు. ఈ కేటగిరీలోని 3 లక్షల మందికి 15 రోజుల్లో వ్యాక్సిన్ వేయించే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యాక్సిన్ లభ్యత ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 6.18 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. మరో 3.35 లక్షల డోసులకు సంబంధించి నిధులు ముందే చెల్లింపులు జరిగాయని, జూన్ మొదటి వారంలో నగరానికి చేరుకుంటాయని అధికార వర్గాలు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోవాగ్జిన్ ఉత్పత్తి చేసే భారత్ బయోటెక్ సంస్థకు 10 లక్షల డోసుల కోసం ఆర్డర్ ఇవ్వగా.. అందులో రెండున్నర లక్షల కోవాగ్జిన్ టీకాలు గురువారం నాటికి అందుబాటులోకి వస్తాయని, వీటిని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇవ్వనున్నట్లు తెలిపింది. మరో రెండున్నర లక్షల టీకాలు జూన్ మొదటి వారంలో వస్తాయని ఆశిస్తున్నారు. మిగిలిన ఐదు లక్షల టీకాలు రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు వివరించాయి. జర్నలిస్టులకు వ్యాక్సిన్‌పై టీయూడబ్ల్యూజే హర్షం సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు ఈనెల 28, 29, 30 తేదీల్లో వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లం నారాయణ, ఆస్కాని మారుతి సాగర్ హర్షం వ్యక్తంచేశారు. అక్రెడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఎంప్యానల్లో ఉన్న పత్రికలు, చానళ్లలో పనిచేసే ప్రతీ జర్నలిస్టుకు కూడా వ్యాక్సినేషన్ అందించాలని కోరారు. -
ఇక తెలంగాణలో ప్రవేశానికి ఇవి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్–19 వైద్య సేవల కోసం తెలంగాణకు వస్తున్నవారిని అనుమతించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు రావాలంటే సదరు ఆస్పత్రి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేసింది. చికిత్స చేసేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా ఆస్పత్రితో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్ రూమ్‌కు వివరాలు సమర్పించి రసీదు తీసుకోవాలని సూచించింది. 040–24651119 లేదా 94944 38251 వాట్సాప్ లేదా ఐడీఎస్పీఎట్తెలంగాణ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌కు వివరాలను పంపాలని తెలిపింది. రోగి పేరు, వయసు, రాష్ట్రం, అటెండెంట్ పేరు, మొబైల్ నంబర్, రిజర్వ్ చేసిన బెడ్ టైప్ తదితర సమాచారాన్ని ఆస్పత్రి యాజమాన్యం కంట్రోల్ రూమ్‌కు పంపిస్తే.. వారికి అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని వివరించింది. ఈ పత్రం ఆధారంగా రాష్ట్రంలో ప్రయాణించి ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ( చదవండి: వైరల్: కరోనా బాధితులతో డాన్స్ చేయించిన నర్సులు ) -
Telangana Police: వర్రీలో వారియర్స్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ఆస్పత్రి, వాక్సినేషన్ సెంటర్, కరోనా మృతుల మార్చురీ, కర్ఫ్యూ చెక్‌పోస్టు, మాస్కుల ధారణపై చెకింగ్స్.. ఇలా ఎక్కడ చూసినా కనిపించే ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులు. అయితే వీరికి అవసరమైన ‘భద్రత’ కల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. ఫస్ట్ వేవ్‌లో పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది అశువులు బాశారు. సెకండ్ వేవ్‌లోనూ పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. దీంతో ఈ వారియర్స్‌తో పాటు వారి కుటుంబాల నుంచీ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోలీసు విభాగంలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటగా.. దాదాపు 15 మంది వరకు ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. ► మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడండి అంటూ గడిచిన కొన్ని రోజులుగా వాట్సాప్, ట్విట్టర్ తదితర సోషల్మీడియాల వేదికగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తున్నారు. తమ సిబ్బంది విషయంలో మాత్రం ఆ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ► సెకండ్ వేవ్ పంజా విసరడం మొదలెట్టి నెల రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ పోలీసుస్టేషన్లలోని అధికారుల మాట అటుంచితే బందోబస్తు, రిసెప్షన్ సిబ్బందికి మాస్‌్కలు, శానిటైజర్ల సరఫరా జరగలేదు. ఇక పీపీఈ కిట్స్ అనే ఆలోచనే వాస్తవదూరంగా అయిపోయింది. ► సెకండ్ వేవ్ నేపథ్యంలో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ సంస్థలు అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వంటివి అమలు చేస్తున్నాయి.పోలీసు విభాగానికి మాత్రం ఇలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. ► పోలీసు అధికారులు నేరుగా ప్రజలతో సంబంధాలు కలిగి ఉండి పనిచేయాల్సి ఉంటోంది. ఉన్నతాధికారులైన డీసీపీలు, ఏసీపీలకు తక్కువైనా ఇన్స్పెక్టర్, ఎస్సైలు, రిసెప్షన్స్‌లో సిబ్బందికి తాకిడి ఎక్కువ. ► కోవిడ్ బారినపడిన పోలీసుల కోసం పేట్ల బురుజులో రెండు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతంలో గోషామహల్ స్టేడియంలో ఏర్పాటైన కరోనా పరీక్ష కేంద్రం, ఆపై హెచ్‌సీక్యూ మందుల పంపిణీ మాదిరిగా వీటి పని తీరు ఉండకూడదని సిబ్బంది కోరుతున్నారు. ( చదవండి: వాట్సప్ చేస్తే ఉచిత భోజనం.. వారికి మాత్రమే! ) -
డ్రోన్ల ద్వారా పంపిణీకి కేంద్రం అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాత్మకంగా ఆకాశ మార్గంలో మానవ రహిత విమానాలు(డ్రోన్ల) ద్వారా కోవిడ్–19 వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ల పంపిణీ కోసం డ్రోన్లు వినియోగించడానికి వీలుగా.. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్) నిబంధనలు–2021కు సడలింపులు ఇవ్వాలని మార్చి 9న రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పట్ల తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ సానుకూలంగా స్పందించింది. కంటి చూపు మేర(విజువల్ లైన్ ఆఫ్ సైట్/వీఎల్ఓఎస్)లో ఎగిరే డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల పంపిణీకి షరతులతో కూడిన సడలింపులు ఇస్తూ ఆ శాఖ జాయింట్ సెక్రటరీ అంబర్ దూబె గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలం లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగంలో పాటించాల్సిన ప్రామాణిక పద్ధతి(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్/ఎస్ఓపీ)ను సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఏప్రిల్ 26న ఆమోదించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటి చూపు పరిధి రేఖకు దాటి(బియాండ్ ది విజువల్ లైన్ ఆఫ్ సైట్/బీవీఎల్ఓఎస్) డ్రోన్లను ఎగురవేయడానికి సడలింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లను చేర్చడానికి డ్రోన్లను వినియోగంలోకి తెస్తే సమయంతో పాటు రవాణా ఖర్చులు సైతం ఆదా కానున్నాయి. తొలుత వికారాబాద్‌లో ట్రయల్స్... ఔషధాలు, ఇతర వైద్యారోగ్య సంబంధిత వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సురక్షితంగా చేర్చడంలో డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్ల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఐటీ శాఖ ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించగా, 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో 8 మందిని ఐటీ శాఖ షార్ట్‌లిస్ట్ చేసింది. తొలుత వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను మారుమూల గ్రామాల పీహెచ్‌సీలకు తరలించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. వ్యాక్సిన్లతో డ్రోన్లు వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో టేకాఫ్ చేసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), ఉపకేంద్రాల్లో ల్యాండింగ్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. జిల్లా యంత్రాంగం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలను చేపట్టింది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని సైతం నియమించింది. తొలుత ప్రతి డ్రోన్ ద్వారా డమ్మీ వైల్స్‌తో పాటు అసలు టీకాలను కలిపి పంపించి వీటి పనితీరును పరీక్షించి చూడనున్నారు. ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాల ఆధారంగా పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీ కోసం విధివిధానాలను రూపొందించనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన 8 సంస్థలను 4 బ్యాచ్‌లుగా విభజించి ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్‌లో రెండు సంస్థలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచ్ 6 రోజుల పాటు డ్రోన్లను ఎగిరించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోనున్నాయి. 24 రోజుల పాటు డ్రోన్లతో వ్యాక్సిన్ పంపిణీకి ట్రయల్స్ నిర్వహించడానికి ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందించింది. వికారాబాద్ గగన తలంలో డ్రోన్ల వినియోగంపై ఏయిర్ ఫోర్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సైతం అనుమతి ఇచ్చింది. డ్రోన్లపై ముందు చూపు... రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ 2019లో రాష్ట్ర డ్రోన్ల విధానాన్ని ప్రకటించింది. దీని అమలులో భాగంగా ‘వింగ్స్ 2020’ పేరుతో హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది. ఆకాశ మార్గంలో మందుల సరఫరా (మెడిసిన్ ఫ్రమ్ ది స్కై/ఎంఎఫ్టీఎస్) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్ల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కోవిడ్ –19 వ్యాక్సినేషన్‌కు ఉపయోగపడబోతున్నాయి. వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. ( చదవండి: DCGI Approval: కోవిడ్‌కు సరికొత్త చికిత్స! ) -
కేంద్ర ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఒరగబెట్టిందేమీ లేదు. వ్యాక్సిన్లు, రెమిడెసివిర్, ఆక్సిజన్ వారి నియంత్రణలోనే పెట్టుకున్నారు. ఏం చేయాలో రాష్ట్రాలకు నిర్దేశిస్తున్నారు. రాష్ట్రాల చేతుల్లో దాదాపుగా అధికారాల్లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని నిందించ డం ఆ పార్టీకి, అధికారంలో ఉన్న పెద్దలకు తగదు. ఇతరులను విమర్శించే ముందు మీరేం చేస్తున్నారో, మీ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అవలోకనం చేసుకోండి’అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మీరు అంత గొప్పోళ్లయితే ఢిల్లీలో ఇవాళ ఇంత వేదన ఎందుకు ఉంది? మీరు పాలిస్తున్న గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఆక్సిజన్ లేక, ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. శవాలను ఫుట్‌పాత్‌లపై పెట్టి కాల్చుతున్నారు’అని అన్నారు. గురువారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో కేంద్రంలోని పెద్దలు, ఆ పార్టీ నాయకులు తామేదో ఇస్తున్నాం.. రాష్ట్రాలు వాటిని వాడుకోవ డం లేదు.. రాష్ట్రాలు పట్టించుకోవట్లేదని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘కరోనా సెకండ్ వేవ్ తీవ్రత గురించి కేంద్రం రాష్ట్రాలకు తెలపలేదు. కేంద్రానికి తెలిసి ఉంటే ఎన్నికలు ఎలా పెట్టారు? కుంభమేళాకు అనుమతి ఎలా ఇచ్చారు?’అని మంత్రి కేంద్రాన్ని ప్రశ్నించారు. 19 జిల్లా కేంద్రాల్లో ఉచిత రక్త పరీక్షలు హోం ఐసోలేషన్, ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న వ్యక్తులు ప్రతి మూడు రోజులకోసారి రక్తపరీ క్షలు నిర్వహించుకోవాలని మంత్రి ఈటల సూచిం చారు. వైద్యుల సలహాలు, సూచనలు లేక హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగుల్లో కొందరి ఆరోగ్యం విషమిస్తోందని, నేరుగా వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తోందన్నారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లోని తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లలో కరోనా రోగులకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహిస్తారన్నారు. రిమ్స్ ఆదిలాబాద్, నల్లగొండ, ఆసిఫాబాద్, జగిత్యాల, జనగామ, జోగులాంబ, కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, ములుగు ఏరియా, సిరిసిల్లా, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ ఆస్పత్రుల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈ సదుపాయం కల్పించామన్నారు. ఇప్పటికైతే లాక్డౌన్ ఆలోచన లేదని చెప్పారు. ఆక్సిజన్ లేక చనిపోవడం అవమానకరం ఆక్సిజన్ లేక జనం చనిపోతున్నారన్న వార్తలు దేశానికి అవమానకరమని మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. రాష్ట్రాలకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఆక్సిజన్ కోసం కేంద్రం వద్ద డబ్బలు లేకుంటే రాష్ట్రాలను అడిగి తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించిందని, వచ్చే నెల్లో 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరామని చెప్పారు. రాష్ట్రంలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులు, ఆక్సిజన్, రెమిడెవిసిర్ బ్లాక్ మార్కెట్ చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 18–44 ఏళ్ల జనాభా 1.75 కోట్లని, రెండు డోసులకు గాను మూడున్నర కోట్ల వ్యాక్సిన్లు అవసరం కానున్నాయన్నారు. ఏఎన్ఎంలు, ఆశావర్కర్ల ఆధ్వర్యంలో గ్రామాల్లో వ్యాక్సినేషన్ చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంద్నారు. రోజూ రోగుల బంధువులకు సమాచారం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల ఆరోగ్యస్థితిగతుల గురించి వారి బంధువులకు సమాచారం అందించే వ్యవస్థను రూపొందించాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. ప్రతి రోజూ రోగుల ఆరోగ్య పరిస్థితిని వారి బంధువులకు ఫోన్ ద్వారా అందించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లాల వైద్యాధికారులు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కనీసం 24 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉండేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో ఉన్న రోగుల ఆరోగ్యపరిస్థితిని ఉదయం, సాయంత్రం పరీక్షించి మెరుగ్గా ఉన్న రోగులను ఇళ్లకు పంపించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, వాడిన ప్రతి ఖాళీ సీసాను తిరిగి స్టోర్‌లో అప్పగించాలని చెప్పారు. ఆక్సిజన్ నిల్వల సమాచారం అందించేందుకు ప్రతి ఆసుపత్రిలో ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలతో పాటు వైద్యం ప్రారంభించాలని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. -
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీసీ గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించాలంటూ 2010లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. బీసీ సమగ్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులపై బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను నిర్ణయించామంటూ గతంలో అదనపు ఏజీ పేర్కొన్న నేపథ్యంలో, బీసీ కమిషన్ నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే గతంలో తాను పొరపాటున అలా చెప్పానని, జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నిర్ణయించామని అదనపు ఏజీ నివేదించారు. బీసీ గణన కోసం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని, ఈ నేపథ్యంలో ఎటువంటి నివేదిక ప్రభుత్వం వద్ద లేదని పేర్కొన్నారు. కాగా, ఏజీ పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు చట్టబద్ధమైన బీసీ కమిషన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మేష్ డీకే జైశ్వాల్ నివేదించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 201ను ఎందుకు చట్టవిరుద్ధంగా ప్రకటించరాదో స్పష్టం చేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ( చదవండి: హైదరాబాద్ ఐఎస్బీ.. దేశంలోనే టాప్! ) -
పౌరులతో దురుసుగా ప్రవర్తించకూడదు: డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూఅమలుపై పోలీస్ ఐజీలు, కమీషనర్లు, ఎస్పీలతో తెలంగాణ డీజీపీ ఎమ్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవోలో పేర్కొన్న విధంగా పటిష్టంగా కర్ప్యూను అమలుచేయాలని తెలిపారు. అంతేకాకుండా అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసివేయాలని పేర్కొన్నారు. ఏ గూడ్స్ వాహనాలను ఆపకూడదన్నారు. కాగా, నైట్ కర్ఫ్యూలో మినహాయింపు ఉన్నవారు సెల్స్ ఐడెంటిటీ కార్డును కచ్చితంగా వెంట ఉంచుకోవాలని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని పోలీసులకు విజ్ఙప్తి చేశారు. అంతేకాకుండా కర్ఫ్యూ నిబంధనలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలను పాటించాలని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్,జితేందర్, ఐ. జీ. లు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, రాజేష్ కుమార్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: అంతా తూచ్.. అది నకిలీ పోలీస్ నోటిఫికేషన్ -
కేంద్ర సాయం ‘లెక్కేంటి’?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల విషయంలో సరైన సహకారం అందడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, జాతీయ ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలకు విరివిగా నిధులిచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం... కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచే వివక్ష చూపుతోందని ‘కాగ్’గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వివిధ పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కేంద్రం నుంచి ఇప్పటివరకు రాష్ట్రం ఆశించిన దాంట్లో సగం మేరకు మాత్రమే నిధులు రావడం గమనార్హం. గత ఏడేళ్లలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 1.20 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఇస్తుందని రాష్ట్రం అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనల్లో పెడితే అందులో ఏటా కోతలు విధించి ఇప్పటివరకు సుమారు రూ. 60 వేల కోట్లు మాత్రమే ఇవ్వడం గమనార్హం. కేంద్ర పన్నుల్లో వాటాలోనూ ఇదే తరహా కోతలు కనిపిస్తుండగా అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 38 వేల కోట్లకుపైగా వస్తుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. (2021–22 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద రూ. 38,669.46 కోట్లు, పన్నుల్లో వాటా కింద రూ. 13,990.13 కోట్లు వస్తాయని రాష్ట్రం ఆశలు పెట్టుకొని బడ్జెట్ అంచనాల్లో పొందుపరచడం గమనార్హం) ఏటేటా... అంతంతే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయానికి వస్తే రాష్ట్రానికి ఏ యేడాదిలోనూ ఈ పద్దు కింద రూ. 15 వేల కోట్లు దాటలేదు. రాష్ట్రం ఏర్పాటైన తొలి ఏడాదిలో ఈ పద్దు కింద రూ. 21 వేల కోట్లకుపైగా వస్తాయని రాష్ట్రం అంచనా వేస్తే అందులో నాలుగో వంతుకన్నా కొంచెం ఎక్కువగా అంటే... కేవలం రూ. 6 వేల కోట్లకుపైగా మాత్రమే ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. ఆ తర్వాతి ఏడాది రూ. 7,500 కోట్లు, ఆ తర్వాత రూ. 9 వేల కోట్లు, అనంతరం వరుసగా రెండేళ్లు రూ. 8 వేల కోట్ల చొప్పున నామమాత్రపు సాయం చేసింది. అయితే ప్రతి ఏడాదిలోనూ కేంద్రం మీద రూ. 20 వేల కోట్లకుపైగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రానికి ఓ రకంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో మొండిచేయి ఎదురైందనే చెప్పాలి. ఇక గత రెండేళ్లుగా వైఖరి మార్చిన కేంద్రం... గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను కొంత పెంచింది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి (2019–20)లో రూ. 11 వేల కోట్లకుపైగా 2020–21లో రూ. 12 వేల కోట్లకుపైగా నిధులిచ్చింది. అయితే అంతా కలిపినా రాష్ట్రం ఆశించిన దాంట్లో కేవలం సగం మాత్రమే కావడం గమనార్హం. వాటా నిధుల్లోనూ మార్పు లేదు... పన్నుల్లో వాటాకు సంబంధించి 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,514 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా ఆ ఏడాది అంతకుమించి రూ. 13,613.09 కోట్లను కేంద్రం ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది రూ. 14,348.90 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావించగా అందులో కోత పెట్టి కేవలం రూ. 11,450.85 కోట్లనే కేంద్రం ఇచ్చింది. గతేడాది (2020–21) కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ. 10,906.51 కోట్లు వస్తాయని బడ్జెట్లో ప్రతిపాదించగా ఫిబ్రవరి నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ. 6,483.08 కోట్లేనని ‘కాగ్’లెక్కలు చెబుతున్నాయి. అంటే గత మూడేళ్లలో రూ. 37,729 కోట్లకుపైగా నిధులను పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి కేంద్రం ఇస్తుందని అంచనా వేయగా రూ. 6 వేల కోట్ల వరకు తక్కువగా రూ. 31,547 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా శాతం తగ్గడంతో రానున్న నాలుగేళ్లపాటు ఈ మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు తగ్గనున్నాయి. -
అక్రమ కట్టడాలను పూర్తిగా ఎందుకు కూల్చడం లేదు?
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలను పూర్తిగా ఎందుకు కూల్చట్లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కూల్చివేతకు అయ్యే ఖర్చును కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి నుంచే వసూలు చేయాలని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న తీరు పై దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం మరో సారి విచారించింది. నగరవ్యాప్తంగా 145 అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. అయితే కూల్చివేత అంటే భవనాలకు రంధ్రాలు పెట్టడం కాదని, పూర్తిగా కూల్చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘జీహెచ్ఎంసీలో ఉన్న సర్కిళ్లలో ఎన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించారు? ఎన్ని భవనాలపై కేసులు నమోదు చేశారు? ఎంత మందికి నోటీసులు జారీ చేశారు.. తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టారా.. ఎన్ని కేసుల్లో కింది కోర్టులు కూల్చివేతలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశాయి? కూల్చివేతలపై స్టే ఎత్తివేతకు ఏం చర్యలు తీసుకున్నారు? నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు’ తదితర వివరాలను సర్కిళ్ల వారీగా సమర్పించాలని ధర్మాసనం జీహెచ్ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది. ( చదవండి: ఢిల్లీ బస్సు వచ్చింది.. వంద కోట్లు మింగింది! ) -
Solar Power: హైదరాబాద్ నగరంలో పవర్ హౌస్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగం విషయంలో గ్రేటర్ వైఖరి మారుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ పంపిణీ సంస్థలపై ఆధారపడ్డ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, టౌన్‌షిప్‌లు.. సొంత ఉత్పత్తిపై దృష్టి సారించాయి. భవనాలపై సోలార్ రూఫ్ టాప్ ఫలకాలను ఏర్పాటు చేసుకుని అవసరాలకు సరిపడా సొంతంగా విద్యుత్ తయారుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు సరఫరా చేసి.. నెలవారీ బిల్లులను సగానికిపైగా తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9,515 సోలార్ నెట్ మీటరింగ్ కనెక్షన్ల నుంచి 212 మెగావాట్లకుపైగా విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా.. గ్రేటర్ పరిధిలోని 8,309 సోలార్ మీటరింగ్‌లో అత్యధికంగా 143.3 మెగావాట్ల విద్యుత్ గ్రేటర్‌లోనే ఉత్పత్తి అవుతోంది. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుండటం, ఒకసారి ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే.. 25 ఏళ్ల పాటు కరెంట్‌కు ఢోకా లేకపోవడంతో ఇళ్ల యజమానులు దీనిపై దృష్టి సారించారు. ప్రత్యక్షంగా నెలవారీ బిల్లులను తగ్గించుకోవడమే కాకుండా.. సంస్థపై విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని కూడా తగ్గిస్తున్నారు. సోలార్ ప్యానెళ్లకు తయారీ కంపెనీ పదేళ్ల గ్యారంటీ ఇస్తోంది. ఆ తర్వాత వార్షిక నిర్వహణ ఒప్పందానికి అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు తతెత్తితే.. టీఎస్రెడ్కోలో కానీ, ఇంటిగ్రేటెడ్ సెంటర్లో కానీ ఫిర్యాదు చేస్తే.. నిపుణులు వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. మచ్చుకు కొన్ని ►బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఓ బహుళ అంతస్తుల నివాస సముదాయంలో 518 కుటుం బాలు నివసిస్తున్నాయి. వ్యక్తిగత, ఉమ్మడి అవసరాలకు నెలకు రూ.12 నుంచి 14 లక్షల విలువ చేసే కరెంట్ వినియోగించేవారు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు యజమానులంతా కలిసి రూ.2.60 కోట్లతో 750 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ రూఫ్‌టాప్ పలకలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం నెలకు 85 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా నెలవారీ విద్యుత్ బిల్లు రూ.4 నుంచి 6 లక్షలకు తగ్గింది. ►నగరంలోని 34 బల్దియా కార్యాలయాలపై రూ.4.5 కోట్ల వ్యయంతో 941 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సౌర ఫలకం సగటున ఏడాది 1,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ యూనిట్‌కు రూ.9 చెల్లిస్తుంది. తాజా సౌర విద్యుత్ ఉత్పత్తితో తన విద్యుత్ ఖర్చును ఏడాదికి రూ.1.50 కోట్లకు తగ్గించుకుంది. ►రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలోని పరిపాలనా భవనాలు సహా విద్యార్థి వసతి గృహాల వార్షిక కరెంట్ బిల్లు రూ.కోటికిపైగా వచ్చేది. సౌర ఫలకాల ఏర్పాటు తర్వాత ఈ బిల్లు రూ.40 లక్షలకు తగ్గింది. ►శామీర్‌పేట జినోమ్ వ్యాలీలో 952, జవహర్‌నగర్‌లో 947, కోకాపేట్ ఓపెన్ స్పేస్‌లో 100, కిమ్స్ రెసిడెన్సీలో 275, హిమాయత్‌సాగర్ ఓనర్స్ అసోసియేషన్ 710 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకున్నారు. నిథమ్ క్యాంపస్‌లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల ఫలకాలను బిగించడంతో నెలకు రూ. 2.5 లక్షల బిల్లు ఆదా అవుతోంది. ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది ఒకసారి ఇంటిపై ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్లపాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. సాధారణ విద్యుత్ కనెక్షన్‌తో పోలిస్తే.. సోలార్ ఫలకాలు కొంత ఖర్చుతో కూడింది. ఒకసారి పెట్టుబడి పెడితే ఎక్కువ కాలం లబ్ధి చేకూరే అవకాశం ఉండటంతో వినియోగదారులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఔత్సాహికులకు ఒకటి నుంచి 3 కిలోవాట్లకు 40 శాతం, 3 నుంచి 500 కిలోవాట్ల వరకు 20 శాతం సబ్సిడీ ఇస్తోంది. – రఘుమారెడ్డి, సీఎండీ, టీఎస్ఎస్పీడీసీఎల్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గింది మా గేటెడ్కమ్యూనిటీలో 10 బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వీటికి గతంలో నెలకు రూ.14 లక్షల వరకు కరెంట్ బిల్లు వచ్చేది. 2019 జూలైలో రూ.2.6 కోట్లతో సోలార్ రూప్‌టాప్ ఫలకాలు ఏర్పాటు చేశాం. దీంతో నెలవారీ కరెంట్ బిల్లు రూ.6 లక్షలకు పడిపోయింది. వేసవికాలంలో ఉత్పత్తి ఎక్కువగా వస్తోంది. తమ అవసరాలు తీరగా.. మిగిలిన విద్యుత్‌ను పంపిణీ సంస్థకు విక్రయిస్తున్నాం. – కె.యాదగిరిరెడ్డి, అధ్యక్షుడు, గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ (చదవండి: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ? ) -
బాయిల్డ్ రైస్ సేకరణకు ఎఫ్‌సీఐ మంగళం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్లో అధికంగా ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) క్రమంగా మంగళం పాడనుంది. ఒక్కసారిగా కాకుండా క్రమంగా బాయిల్డ్ రైస్ తీసుకునే విధానానికి స్వస్తి పలికేలా ఎత్తులు వేస్తోంది. గతేడాది వరకు రాష్ట్రం నుంచి భారీగా బాయిల్డ్ రైస్ సేకరించి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసిన ఎఫ్‌సీఐ.. ఈ ఏడాది యాసంగికి సంబంధించి 50 శాతానికి మించి బాయిల్డ్ రైస్ తీసుకోలేమని రాష్ట్రానికి స్పష్టం చేసింది. అయితే ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో భారీగా సాగైన దొడ్డు రకాల ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లడంతో పాటు, ఎఫ్‌సీఐని ఒప్పించడంతో ఈ సీజన్లో 80 శాతం బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు అంగీకరించింది. సాధారణంగా యాసంగిలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వీటికి అధికంగా డిమాండ్ ఉండటంతో ఈ బియ్యాన్ని రాష్ట్రం నుంచి సేకరించి ఆయా రాష్ట్రాలకు సరఫరా చేసేది. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోనే పంటల దిగుబడి పెరిగి బాయిల్డ్ రైస్ ఉత్పత్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తమకున్న డిమాండ్ మేరకు రా రైస్ (ముడి బియ్యం) మాత్రమే కావాలని, బాయిల్డ్ రైస్ తీసుకోవద్దని నిర్ణయించింది. అయితే తర్వాత ఎఫ్‌సీఐ 50 శాతం మేర మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ సీజన్లో మాత్రం 80 శాతం బాయిల్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవడానికి అంగీకరించింది. కాగా, బాయిల్డ్ రైస్ సేకరణ నుంచి ఎఫ్‌సీఐ క్రమంగా తప్పుకొంటున్న నేపథ్యంలో దొడ్డు బియ్యం సాగు నుంచి రైతులు బయటకు రావాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్న రకం ధాన్యాల సాగుకు ముందుకు రావాలని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గురువారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. సన్న వడ్లతో పాటు వేరు శనగ, ఆయిల్ సీడ్ పంటల సాగుకు మళ్లాలని పేర్కొన్నారు. 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు.. రాష్ట్రంలో ఈ ఏడాది 6,575 కేంద్రాల ద్వారా 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ చేయనున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 179 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు కావల్సిన రూ.20 వేల కోట్లను పౌరసరఫరాల సంస్థకు ముఖ్యమంత్రి సమకూర్చారని, 24 గంటల్లోనే రైతులకు తమ ఖాతాల్లో డబ్బులు పడేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా తేమశాతం 17 లోపు ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాసంగిలో 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లను కలిపి 2020–21 ఏడాదిలో 1.28 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ఉంటుందన్నారు. చదవండి: భారీగా పెరిగిన డీఏపీ ధరలు.. -
కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలకు చెందిన ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వందశాతం వ్యాక్సినేషన్ చేయించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మతో ఫోన్లో మాట్లాడారు. వారి శాఖల్లో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వారం రోజుల్లో నూటికి నూరుశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వాక్సినేషన్ పురోగతిని ప్రతీరోజు ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎంవోకు నివేదించాలని కోరారు. పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్టీసీ , రెవెన్యూ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం కోసం కలెక్టర్లు, ఇతర జిల్లాస్థాయి అధికారులతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలు కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు అన్ని జిల్లాల్లోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గద్వాల, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, భువనగిరి, జనగామ, వికారాబాద్ కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. మాస్క్ లేకపోతే ఉపేక్షించొద్దు దేశంలో కరోనా తిరిగి వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను కోరారు. జనసాంద్రత అధికంగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సూచించారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చినపుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు పరచాలన్నారు. ప్రజలు మాస్కు ధరించకపోతే వేయి రూపాయల జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. 45 ఏళ్లకు పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ప్రజారోగ్య సంచాలకుడు డా. శ్రీనివాస్ రావు, డీఎంఈ రమేష్ రెడ్డి, వైద్యశాఖ సలహాదారు డా. టి గంగాధర్ పాల్గొన్నారు. చదవండి: 2 నెలల్లోనే తారస్థాయికి -
‘టి ఫైబర్’తో రైతు వేదికలకు ఇంటర్నెట్..
సాక్షి, హైదరాబాద్: టి ఫైబర్‌పై ఐటీ మంత్రి కేటీఆర్ పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘టి ఫైబర్’ప్రాజెక్టు ద్వారా రైతు వేదికలను ఇంటర్నెట్తో అనుసంధానించి ప్రతి రైతుకూ మేలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని ఐదు రైతు వేదికలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ (టి ఫైబర్) బోర్డు సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిధిని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు విస్తరించాలని, ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి అన్ని గ్రామపంచాయతీలను ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా అనుసంధానించాలని సూచించారు. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతి మంత్రి ఆరా తీశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ఈ ఏడాది జూన్ నుంచి ప్రాధాన్యతాక్రమంలో కనెక్షన్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రాస్, మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి, టీ ఫైబర్ ఎండీ సుజయ్ కారంపూరి పాల్గొన్నారు. చదవండి: 2 నెలల్లోనే తారస్థాయికి -
వేలానికి వేళాయె.. త్వరలో అసైన్డ్ భూముల వేలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పన్నేతర ఆదాయం కింద భారీగా 30 వేల కోట్ల రూపాయలను ప్రతిపాదించిన ప్రభుత్వం... ఆ నిధుల సమీకరణకు ఉద్యుక్తమవుతోంది. అందులో భాగంగా రాజధాని శివార్లలోని అసైన్డ్ భూముల అమ్మకం వ్యవహారంపై దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, గండిపేట మండలాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అమ్మకానికి అనువుగా ఉన్నాయని గుర్తించిన 1,636 ఎకరాల భూమిని ప్రభుత్వం త్వరలోనే వేలానికి పెట్టనున్నట్లు సమాచారం. ఈ భూముల అమ్మకాల ద్వారా రూ.4 వేల కోట్ల దాకా వస్తాయని తొలుత అంచనా వేశారు. కానీ ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల ప్రకారం రూ.5 వేల కోట్ల వరకు రావొచ్చని రెవెన్యూ అధికారులు లెక్కలు గడుతున్నారు. వీటికి తోడు గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో ఖాళీగా ఉన్న మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయిస్తే రూ.3,500 కోట్ల వరకు సమకూరే అవకాశాలున్నాయి. ఈ లెక్కన అసైన్డ్ భూముల అమ్మకాల ద్వారా తొలివిడతలో రూ.8,500 కోట్ల వరకు రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లబ్ధిదారులకు నష్టం లేకుండా వాస్తవానికి నగర శివార్లలో ప్రభుత్వం వేలాది ఎకరాలను పలు దశల్లో పేదలకు అసైన్ చేసింది. ఎలాంటి ఆసరాలేని సదరు పేదలు ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుని ఉపాధి పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ భూములు కొన్ని వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవడం, పేదలు తమ అవసరాలకు భూములను ఇతరులకు విక్రయించడంతో... ఇప్పుడు ఎక్కువ భూములు అటు ప్రభుత్వం దగ్గర, ఇటు అసైన్డ్‌దారుల దగ్గర కాకుండా థర్డ్‌పార్టీ చేతిలో ఉన్నాయి. ఇలాంటి భూములెన్ని ఉన్నాయన్న లెక్క భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇదివరకే ఓ కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరఖుర్దు, మాదాపూర్, రావిర్యాల, తుమ్మలూరు, రాయన్నగూడ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయించింది. ఈ గ్రామాల్లో అసైన్ చేసిన భూముల్లో అన్యాక్రాంతమైనవి, నిరుపయోగంగా ఉన్నవి కలిపి మొత్తం 1,636 ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చింది. గత ఏడాది కేవలం సర్వేకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వేలం వేయడం లేదా బహుళ జాతి సంస్థలకు విక్రయించే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను మరోమారు తెప్పించుకున్న ఉన్నతాధికారులు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని రెవెన్యూవర్గాలు చెపుతున్నాయి. అయితే అసైన్డ్ చేసిన పేదలకు నష్టం కలగకుండా ఈ భూములను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అసైనీల చేతిలో ఉన్నప్పటికీ వారు వ్యవసాయం చేయకుండా ఉన్న భూములు, అసైనీలు ఇతరులకు అమ్ముకున్న భూములను తీసుకోవాలని, ఈ క్రమంలో అసైనీలకు లేదంటే థర్డ్‌పార్టీకి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని యోచిస్తోంది. ఇందుకు గాను రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని కూడా రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పద్దు పూడాలంటే... అమ్మాల్సిందే! రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నేతర ఆదాయం పద్దు కింద రూ.30,557 కోట్లను చూపెట్టింది. కానీ గత మూడేళ్ల లెక్కలను పరిశీలిస్తే ఎప్పుడూ పన్నేతర ఆదాయం రూ.10 వేల కోట్లను దాటలేదు. 2018–19లో రూ. 10,007 కోట్లు, 2019–20లో రూ.7,360 కోట్లు, 2020–21లో అయితే రూ.5వేల కోట్లు దాటలేదు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా పన్నేతర ఆదాయం కింద రూ. 30,600 కోట్లు పద్దు చూపెట్టినా అందులో ఆరో వంతు మాత్రమే వచ్చింది. గత ఏడాదిలోనూ ప్రభుత్వ భూముల అమ్మకం ప్రతిపాదనలున్నప్పటికీ అమల్లోకి రాకపోవడంతో పన్నేతర ఆదాయం పెరగలేదు. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో కూడా రూ. 30,557 కోట్లను పన్నేతర పద్దు కింద ప్రభుత్వం చూపెట్టడంతో ఈసారి భూముల అమ్మకాలు అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఈ పరిస్థితుల్లోనే నగర శివార్లలోని అసైన్డ్ భూముల అమ్మకాల ప్రతిపాదన ఫైలును మరోమారు ప్రభుత్వం తెరుస్తోంది. భూములు అమ్మకాల తొలిదశలో భాగంగా ఈ అసైన్డ్ భూములతో పాటు మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడం లేదంటే బహుళ జాతి సంస్థలకు నిర్దేశిత ధరకు విక్రయించడం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చిన అసైన్డ్ భూముల లెక్క ఇది గ్రామం ఎకరాలు ఆదాయం అంచనా (రూ.కోట్లలో) మాదాపూర్ 243.35 243 రావిర్యాల 281.19 843 తుమ్మలూరు 418.01 1254 రాయన్నగూడ 69.09 48.30 కొంగరఖుర్దు 435.18 1,196 (ఇవి గాక గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో 188 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని అమ్మితే రూ.3,500 కోట్లు వస్తాయని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.) చదవండి: సీరియస్‌గా ఉంటేనే అడ్మిషన్ -
మాకొద్దీ పెంపు, 61 ఏళ్ల వరకు పనిచేయలేం!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యం సహకరించట్లేదు. అందువల్ల డ్యూటీలు చేయలేకపోతున్నాం. మాకు ఇతర విధులుంటే అప్పగించండి. లేదా నిర్బంధ పదవీ విరమణకు అవకాశం కల్పించండి. ఇవీ దాదాపు 2 వేల మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు పెట్టుకున్న వినతులు. ఇలాంటి అభిప్రాయంతో మరికొన్ని వేల మంది కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కార్పొరేషన్లకూ వర్తింపజేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆర్టీసీలో మాత్రం సంబరాలు లేవు. సిబ్బందిలో ఎక్కువ మంది తమకు పాత పద్ధతే కావాలని కోరుతున్నారు. రిటైర్మెంట్కు చేరువయ్యేకొద్దీ ఒంట్లో శక్తి సన్నగిల్లి, కష్టతరమైన డ్రైవర్, శ్రామిక్, కండక్టర్ డ్యూటీలు చేయలేక కూలబడుతున్న ఉద్యోగులు ఆర్టీసీలో ఎందరో. ఈ మూడు కేటగిరీల్లో పనిచేసే వారిలో మరణాల రేటూ ఎక్కువగానే ఉంటోంది. ఏటా ఆర్టీసీలో ఇలా రిటైర్మెంట్‌లోపే దాదాపు 175–200 మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో 61 ఏళ్ల వరకు ఉద్యోగం చేయాల్సి రావడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పాత పద్ధతిలో 58 ఏళ్లకే రిటైరయ్యేలా ఆప్షన్‌ను అందుబాటులోకి తేవాలని అధికారులు ప్రభుత్వం ముం దు ప్రతిపాదించేందుకు సిద్ధమయ్యారు. రెండేళ్లుగా పదవీ విరమణల్లేవు.. ఆర్టీసీలో ప్రస్తుతం 48,600 మంది ఉద్యోగులున్నారు. సంస్థలో ఏటా సగటున 2,200 మంది రిటైరవుతుంటారు. కానీ గత రెండేళ్లుగా సంస్థలో పదవీ విరమణల్లేవు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీలోనూ గతంలో రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగానే ఉండేది. కానీ 2019లో సిబ్బంది చేపట్టిన సమ్మె అనంతరం ప్రభుత్వం ఆర్టీసీలో రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచింది. దీంతో గత రెండేళ్లుగా సంస్థలో రిటైర్మెంట్లు లేవు. డిసెంబర్ నుంచి మళ్లీ రిటైర్మెంట్లు ప్రారంభం కానున్నాయి. దీన్నే చాలా మంది కార్మికులు జీర్ణించుకోలేకపోయారు. ఈ పెంపును ఆరోగ్య సమస్యలు లేనివారు స్వాగతించినప్పటికీ ఎక్కువ మంది మలి దశలో కష్టతరమైన విధులు నిర్వర్తించలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తమకు డ్రైవింగ్‌కు బదులు వేరే బాధ్యతలు అప్పగించాలని డ్రైవర్లు, నిలబడి డ్యూటీ చేయలేనందున కౌంటర్లో కూర్చునే డ్యూటీ ఇవ్వాలని కండక్టర్లు, గ్యారేజీలో బరువు పనులు చేయలేకపోతున్నందున సెక్యూరిటీ లాంటి ఇతర విధులు ఇవ్వాలని శ్రామిక్‌లు కోరుతూ వస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పించాలనే ఒత్తిడి అప్పట్లోనే తెచ్చారు. సమ్మె సమయంలో అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం ముందుంచారు. ఏ వయసుకు ఎందరు వీఆర్ఎస్ తీసుకుంటే ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందో లెక్కలతో సహా సమర్పించారు. అయితే ఆర్టీసీ పరిస్థితి తీసుకట్టుగా ఉండటంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది.ఈ నేపథ్యంలో ఇప్పుడు రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెరగడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పాత పద్ధతిలోనే రిటైర్మెంట్కు అవకాశం కల్పించి సెటిల్మెంట్ చేస్తే విశ్రాంతి తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ముందు కొత్త ప్రతిపాదన ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘61’కి మేం వ్యతిరేకం ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుకు, ఆర్టీసీ కార్మికుల పని ఒత్తిడికి చాలా తేడా ఉంటుంది. రిటైర్మెంట్ వయసు దగ్గర పడేసరికి డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు పనిచేయలేరు. బలవంతంగా పనిచేస్తే రిటైరయ్యేలోపు చనిపోతున్నవారెందరో. ఇప్పుడు ఆర్టీసీలో పని ఒత్తిడి ఇంకా పెరిగి చనిపోతున్న వారి సంఖ్య పెరిగింది. ఈ సమయంలో వారికి త్వరగా విశ్రాంతి అవసరం. రిటైర్మెంట్ వయసు 61కి పెంచితే వారికి కష్టమే. అందుకే కొత్త విధానాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. కనీసం స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించాలి – కమల్‌రెడ్డి, నేషనల్ మజ్దూర్ యూనియన్ -
ఇంకా మేల్కోకపోతే ఎలా?
సాక్షి, హైదరాబాద్: కరోనా రెండో దశ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణకు ఉత్తమ పరీక్షగా వైద్యులు పేర్కొంటున్న ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలన్న తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా ఉందో లేదో కూడా సరిగ్గా నిర్ధారిం చలేని ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల (ఆర్ఏకే)ను భారీగా చేస్తుండటంపై మండిపడింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది రక్షణకు తగిన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, కరోనా పరీక్షల ధరలు తగ్గించా లంటూ దాఖలైన లేఖలను ధర్మాసనం గతంలో సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యాలుగా విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళ వారం మరోసారి విచారించింది. ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, కరోనా రెండో దశ వేగంగా వ్యాపిస్తూ ప్రజల ప్రాణాలను కబళిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మేల్కొనపోతే ఎలా అని ప్రశ్నిం చింది. భవన నిర్మాణ ప్రదేశాల్లో కార్మికులకు, అత్యంత రద్దీ ప్రదేశాల్లో ప్రజలకు మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రత్యేకంగా పరీక్షలు చేయించాలని తాము ఆదేశించినా నివేదికలో ఆ వివరాలను ఎందుకు పొందుపర్చలేదని ధర్మాసనం నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం అరకొర వివరాలతో అసమగ్రంగా నివేదిక సమర్పించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బార్లు, పబ్బులు, మద్యం దుకాణాల నియంత్రణ దిశగా రెండు రోజుల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే తామే ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎన్ని పరీక్షలు చేశారు? కరోనా నిర్ధారణకు సంబంధించి ఎన్ని పరీక్షలు చేశారని ధర్మాసనం ఏజీ బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించగా 9,11,611 పరీక్షలు చేశామని, అందులో 7,63,136 ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు చేశామని, 1,48,475 ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేశామని ఏజీ నివేదించారు. మొత్తం పరీక్షల్లో 10 శాతం ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు కూడా చేయట్లేదని, గత విచారణ సందర్భంగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలన్న తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రతి 10 లక్షల జనాభాకు చేస్తున్న పరీక్షల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను క్రమంగా పెంచుతున్నామని ఏజీ నివేదించగా మార్చి రెండో వారం నుంచి రెండో దశ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మేల్కొనపోతే ఎలా? అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 24 గంటలూ ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతున్నారా? అని ప్రశ్నించగా ఆ వివరాలు తెలుసుకొని చెబుతానన్న ఏజీ సమాధానంపైనా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 24 గంటలూ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఎక్కడికక్కడ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పాజిటివ్ కేసులు ఎన్ని? ‘‘కరోనా పరీక్షల్లో ఎన్ని పాజిటివ్ కేసులు వస్తున్నాయి? కేసుల శాతం ఎంత? మరణాల సంఖ్య ఎంత? కేసుల సంఖ్య ఆధారంగా కంటైన్మెంట్ జోన్లు ఎన్ని ఏర్పాటు చేశారు? సీరో సర్వెలైన్స్ చేశారా? అంతర్రాష్ట్ర ప్రయాణికులకు ఎన్ని పరీక్షలు చేశారు? విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఎందరు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించారు? పెళ్లిళ్లు, విందులు, వినోదాల్లో ఎంత మంది పాల్గొనవచ్చో స్పష్టం చేశారా? హైరిస్క్ జోన్లు మార్కెట్లు, రైతు బజార్లు, సినిమా థియేటర్లు, మాల్స్, బార్లు, పబ్బులను పరిమిత సంఖ్యలో అనుమతించేలా ఎందుకు ఆంక్షలు విధించలేదు?’’ అంటూ ధర్మాసనం శరపరంపరగా ఏజీకి ప్రశ్నలు సంధించింది. జీహెచ్ఎంసీ, కరీంనగర్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. 48 గంటల్లో నివేదిక ఇవ్వండి.. ‘‘రాష్ట్రవ్యాప్తంగా కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రుల వివరాలపై విస్తృత ప్రచారం నిర్వహించండి. అనాథ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించండి. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి? అందులో వెంటిలేటర్ బెడ్స్ ఎన్ని, ఆక్సిజన్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పటికి ఎందరు రోగులు ఆసుపత్రుల్లో చేరారు? ఎన్ని కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు? కరోనా నిబంధనలు పాటించని వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంత మందికి జరిమానా విధించారు? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారా? స్వేరో సర్వైలెన్స్ చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిందో పూర్తి వివరాలతో 48 గంటల్లో నివేదిక సమర్పించండి’’ అని సర్కారును ఆదేశిస్తూ విచారణను 8వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: ధరణి... వెతల కహానీ -
హల్దీలోకి గోదారమ్మ
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌కు ఎత్తిపోసిన గోదావరి నీళ్లను.. హల్దీవాగు, మంజీరా నది ద్వారా నిజాంసాగర్‌కు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులోనిపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చే నీటిని సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దివాగుకు పైన ఉన్న బంధం చెరువులోకి విడుదల చేశారు. ఈ నీళ్లు పెద్దచెరువు, శాకారం ధర్మాయి చెరువు, కానీ చెరువులను నింపుతూ.. హల్దీవాగులోకి, అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్‌కు చేరనున్నాయి. గజ్వేల్‌కు నీళ్లిచ్చే ప్రాజెక్టుకూ.. అవుసులోనిపల్లి నుంచి బయలుదేరిన సీఎం.. మర్కూక్ మండలం పాములపర్తి సమీపంలో కాల్వ ద్వారా గజ్వేల్ ప్రాంతానికి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రైతులు, మహిళలు గోదావరి జలాల్లో పసుపు, కుంకుమ, పూలు, నాణేలు వేసి గోదారమ్మకు స్వాగతం పలికారు. ఇక్కడ విడుదల చేసిన నీటితో పాములపర్తి చెరువు, పాతూరు, చేబర్తి, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా మొదలైన 20 చెరువులు నిండుతాయి. అవుసులోనిపల్లిలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్‌రావు గ్రామాల్లో పండుగ వాతావరణం గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో పండుగ వాతా వరణం నెలకొంది. ఉదయం నుంచే వర్గల్, గజ్వేల్, మర్కుక్ మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్దఎత్తున అవుసులోనిపల్లికి, పాములపర్తికి చేరుకున్నారు. తమ వెంట పసుపు, కుంకుమలు, పూలు, నాణేలు తీసుకొచ్చారు. సీఎం నీటిని విడుదల చేయగానే.. పెద్ద ఎత్తున జైతెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. గోదావరి నీళ్లలో పసుపుకుంకుమలు, పూలు చల్లారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, ఫారూక్ హుస్సేన్, రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గణేశ్‌గుప్తా, హన్మంత్ షిండే, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి జలాలను విడుదల చేస్తున్న కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్, ఈఎన్సీ హరిరామ్ వీలైనంతగా నీళ్లివ్వాలనే లక్ష్యంతో.. ‘నేను కాపోన్ని నాకు రైతుల కష్టాలు తెలుసు’అని తరచూ చెప్పే సీఎం కేసీఆర్.. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ సాగర్ వరకే పరిమితం చేయకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు అందేలా చూడాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దానికితోడు యాసంగి పంటలు వేసిన రైతులు హల్దివాగులోకి నీరు విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే అటు హల్దివాగుకు, ఇటు గజ్వేల్ నియోజకవర్గానికి గోదావరి జలాలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. అధికారులు కూడా వెంటనే పనుల వేగం పెంచి నీటి విడుదలకు కాల్వలు, ఇతర ఏర్పాట్లు సిద్ధం చేశారు. సీఎం మంగళవారం ఈ రెండు చోట్లా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హల్దివాగులోకి ఎన్నిరోజులకు నీరు చేరుతాయి. ఎన్ని చెక్‌డ్యామ్‌లు, ఎన్ని చెరువులు నిండుతాయి, భూగర్భ జలాల పరిస్థితి ఏమిటని మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదలశాఖ ఈఎన్సీ హరేరామ్లను అడిగి తెలుసుకున్నారు. -
ధరణి... వెతల కహానీ
సాక్షి, హైదరాబాద్: సుకేతన్, మాన్సింగ్, సుదర్శన్‌రెడ్డిలే కాదు.. రాష్ట్రంలోని అనేక మంది రైతులు ధరణి పోర్టల్ వల్ల పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ధరణి సమస్యల నిలయంగా మారింది. తమ వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్లు చేయిం చుకునే క్రమంలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పోర్టల్ ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు సాంకేతిక సమ స్యలు పరిష్కారం కాకపోవడం, ఒక సమస్య పరిష్కారానికి వెళితే ఇంకో సమస్య తలెత్తుతుం డటంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. స్లాట్ బుకింగ్ చేసుకునే సమయంలో కూడా సమస్యలు వస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం, ఒకవేళ స్లాట్ బుక్ చేసుకొని సమయానికి వెళ్లలేక రద్దు చేసుకోవాలన్నా... వీలు లేకపోవడం ధరణి పోర్టల్ నిర్వహణలో నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఇక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల క్రమంలో జరగాల్సిన మ్యుటేషన్లు కూడా పూర్తి కావడం లేదు. జీపీఏలు, కంపెనీలు, ఫర్మ్‌ల పేరిట పాస్‌పుస్తకాలు, ఎన్నారై భూముల పాస్ పుస్తకాలు, ఈసీలు, పౌతీ లాంటి సమస్యలూ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లితే వాటిని సవరిం చుకునే అవకాశం కూడా లేకపోవడం గమనార్హం. సవరణ కోసం మీసేవ కేంద్రాలకు వెళితే ఆప్షన్ రాలేదని చెప్పడం, తహసీల్దార్లను ఆశ్రయిస్తే తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేయడం, కలెక్టర్లను కలిస్తే ఏమీ మాట్లాడకపోవడంతో.. అసలు ఏం చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ‘తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి’అనే రీతిలో ఆప్షన్లు ఇచ్చినట్టే ఇచ్చి పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరించకపోవడంతో రెవెన్యూ వర్గాలకు కూడా తలనొప్పులు ఎదురవుతున్నాయి. చెప్పుకుంటే చాంతాడంత... ఆదిలాబాద్ అర్బన్ మండలంలోని 1,700 ఎకరాల వ్యవసాయ భూములు ధరణి పోర్టల్‌లో అటవీ భూములుగా నమోదయ్యాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పట్టా భూములున్నాయి. గతంలో వక్ఫ్ బోర్డు భూములుగా నమోదయిన ఈ భూముల సమస్య పరిష్కారమవుతుందని భావిస్తే మళ్లీ అటవీ భూములుగా నమోదు కావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యను ధరణి సెంట్రల్ సర్వర్ ద్వారానే పరిష్కరించాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా సీసీఎల్ఏకు నివేదించారు. కానీ, సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చిరుమర్తి రెవెన్యూ శివారు పోరెడ్డిగూడెం గ్రామ పరిధిలో మూసీ కాల్వల నిర్మాణానికి 40 ఏళ్ల కిందట భూసేకరణ చేశారు. వాస్తవానికి అవార్డు కాపీ ప్రకారం ఒక సర్వే నెంబరులో ఎంత భూమి ఉన్నా... భూసేకరణ జరిపినంత మేరకే నిషేధిత భూముల జాబితాలో చేర్చాలి. కానీ, ఇక్కడ సంబంధిత సర్వే నెంబర్లను పూర్తిగా నిషేధిత జాబితాలో చేర్చారు. అంతేకాదు పక్క సర్వే నెంబర్లు కూడా పొరపాటున 22(ఏ)లో చేరాయి. దీంతో అక్కడి రైతులకు క్రయవిక్రయాలకు ఆస్కారం లేకుండా పోయింది. మీసేవకు వెళితే ఎడిట్ ఆప్షన్ లేదంటున్నారు. ఎమ్మార్వోను కలిస్తే తన చేతిలో ఏమీ లేదంటున్నారు. కలెక్టర్ దగ్గరకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడక్కడి రైతులకు దిక్కుతోచడం లేదు. ఈ గ్రామంలోని దాదాపు 80 సర్వే నెంబర్లలో ఉన్న 500 ఎకరాల పరిస్థితి ఇదే. ఇక ఏజెన్సీ పరిధిలోని భూములకు సంబంధించి వారసత్వ రిజిస్ట్రేషన్లు, మార్టిగేజ్ కావడం లేదు. డిజిటల్ సంతకాలు పూర్తయినా డిజిటల్ పాస్ పుస్తకం రాని భూముల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. గతంలో వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ చేసుకోకుండా ఇళ్లు నిర్మించుకున్న వారు ఇప్పుడు కన్వర్షన్‌కు వెళితే ధరణిలో ఆప్షన్ లేకుండా పోయింది. ఏయే సమస్యలు వస్తున్నాయంటే... పాత మ్యుటేషన్లు: ధరణి అమల్లోకి రాకముందు రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవసాయ భూముల మ్యుటేషన్లు అవుతున్నాయి. కానీ, పోర్టల్‌లో కనిపించిన సర్వే నెంబర్ల భూములకు మాత్రమే అవుతున్నాయి. ఒక సర్వే నెంబర్లో కొంత పార్ట్–బీ భూమి ఉన్నా, బై సర్వే నెంబర్లలో తేడాలున్నా సదరు సర్వే నెంబర్ మొత్తమే ధరణిలో కనిపించడం లేదు. జీపీఏలు: పట్టాదారు వచ్చే అవసరం లేకుండానే తన భూమిని విక్రయించి, రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని మరో వ్యక్తికి ఇచ్చే ప్రక్రియను జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) అంటారు. కానీ, ధరణిలో విచిత్రం ఏమిటంటే జీపీఏ తీసుకుని వెళితే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయలేరు. పట్టాదారు వస్తేనే లావాదేవీ జరిగే విధంగా ఆప్షన్ ఇచ్చారు. ఈసీలు: భూమికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ఈసీలు ధరణి పోర్టల్‌లో రెవెన్యూ అధికారులకు ఇబ్బందిగా మారాయి. ఈసీలు సిటిజన్ లాగిన్‌లో వస్తున్నాయి కానీ అధికారుల లాగిన్‌లో రావడం లేదు. ఈసీలే కాదు పహాణీలు, పాసు పుస్తకాలు ఏవీ తహశీల్దార్ లాగిన్‌లో కనిపించవు. దీంతో సిటిజన్ లాగిన్లోకి వెళ్లి తహశీల్దార్లు ఆ వివరాలు పరిశీలిస్తున్నారు. కంపెనీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్: కంపెనీలు, ఫర్మ్‌ల పేరిట ఉన్న భూముల రిజిస్ట్రేషన్ జరుగుతోంది... పాస్ పుస్తకాలు వస్తున్నాయి. కానీ ఆ తర్వాతి లావాదేవీలకు మాత్రం ధరణిలో అవకాశం లేదు. నాలా కన్వర్షన్ చేసుకోవాలన్నా, విక్రయించాలన్నా ఇన్వాలీడ్ పాస్‌బుక్ అని చూపిస్తోంది. పౌతి: భూ యజమాని చనిపోయిన పక్షంలో వారి వారసుల పేరిట భూమిని బదలాయించే పౌతీ ప్రక్రియలోనూ సమస్యలు వస్తున్నాయి. ధరణి అమల్లోకి రాకముందు చనిపోయిన యజమానుల వారసులకు పౌతీ జరగడం లేదు. ధరణి వచ్చిన తర్వాత కొత్త పాస్ పుస్తకం వచ్చిన వాటికి మాత్రమే జరుగుతోంది. మరో విశేషమేమిటంటే... అసైన్డ్ భూముల పౌతీ అసలే జరగడం లేదు. పేరు, తప్పుల సవరణ: పాస్‌బుక్‌లో పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు వస్తే సరిచేసుకునే ఆప్షన్ ఇచ్చారు. కానీ, సదరు వివరాలు నమోదు చేస్తే ఆ వివరాలు ఎక్కడకు పోతున్నాయో, ఏమవుతున్నాయో తహశీల్దార్లకు కూడా అర్థం కావడం లేదు. ఇక, విస్తీర్ణం, సర్వే నెంబర్లలో పొరపాట్ల సవరణకు ఇంతవరకు ఆప్షన్ ఇవ్వలేదు. ఆధార్ అనుసంధానం ఆప్షన్ ఇచ్చారు కానీ, ధరణిలో కనిపించిన సర్వే నెంబర్లకు మాత్రమే జరుగుతోంది. స్లాట్ రద్దు: ధరణిలో ఒకసారి స్లాట్ బుక్ అయితే రద్దు కావడం లేదు. రద్దు చేస్తామని, ఫీజు కూడా తిరిగి చెల్లిస్తామని జీవో ఇచ్చారు కానీ, ఇంతవరకు అలాంటిది జరగలేదు. ఇక, ఎన్నారై పాస్‌పుస్తకాల జారీకి, కోర్టు ఉత్తర్వుల అమలుకు ఆప్షన్ ఇవ్వలేదు. సాదాబైనామాల విషయంలో 13బీ, 13సీ ఇచ్చిన భూములకు కూడా ఆప్షన్ రాలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తే సదరు భూముల మార్టిగేజ్ రద్దు జరుగుతోంది. కానీ, రీకన్వెయెన్స్ అయిన తర్వాత మరో లావాదేవీకి అవకాశం లేకుండా పోతోంది. ఈ సమస్యలన్నింటిపై సీసీఎల్ఏ వర్గాలు దృష్టి పెట్టి సమస్యలను వెంటనే పరిష్కరించడం ద్వారా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అటు రైతు సంఘాలు, ఇటు రెవెన్యూ వర్గాలు కోరుతున్నాయి. మరి ఇప్పుడైనా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. -
జీహెచ్ఎంసీకి పీఆర్సీ కష్టాలు, ప్రభుత్వం ఆదుకోవాల్సిందే!
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ వేదికగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్ జీహెచ్ఎంసీ ఉద్యోగులకు వరంలా కనిపించగా, ఖజానాకు మాత్రం కాస్త భారంగా మారింది. రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపుపై సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి మోదం..ఖేదం అంటూ రెండు రకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. 30 శాతం ఫిట్మెంట్ వల్ల జీహెచ్ఎంసీలోని దాదాపు ఆరువేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు, మరో ఏడువేల మంది పెన్షనర్లకు వేతనాలు పెరగనున్నాయి. వీరితోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులకు సైతం వేతనాలు పెంచుతామని సీఎం హామీ ఇవ్వడంతో వారివీ పెరగ్గలవని భావిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఖజానాపై భారం పడనుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం అందరికీ వెరసి నెలకు దాదాపు రూ.120 కోట్లు వేతనాల కింద చెల్లిస్తున్నారు. ఇలా సంవత్సరానికి దాదాపు రూ.1440 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. సీఎం ప్రకటించిన ఫిట్‌మెంట్‌ను వర్తింపచేస్తే నెలకు దాదాపు రూ.36 కోట్ల వంతున సంవత్సరానికి రూ.432 కోట్లు అదనపు భారం పడుతుంది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కూడా పెరిగే వేతనాలు వర్తింపచేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ఖజానా నుంచే వాటిని చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ వివిధ ప్రాజెక్టులను నెత్తికెత్తుకోవడంతో ఇప్పటికే ప్రతినెలా వేతనాల చెల్లింపులకు తిప్పలు పడుతోంది. గతంలో మొదటివారంలోనే వీటిని చెల్లించేవారు. ప్రస్తుతం నెలాఖరు వరకు జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు రూ.38 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి మరో రూ.38 కోట్లు ప్రతినెలా అందుతున్నందున వేతనాలు చెల్లించగలుగుతున్నారు. వేతనాలు పెరగనున్నందున అందుకనుగుణంగా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం పెరగనిదే కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ వర్తింపు.. జీహెచ్ఎంసీ స్థానికసంస్థ అయినా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ పీఆర్సీ వర్తింపు ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఫిట్మెంట్ కనుగుణంగా పెరిగే జీతాలు చెల్లించేందుకు స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సమాచారమివ్వడం సంప్రదాయం మాత్రమేనని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో , ఈనెలాఖరున రిటైర్ కావాల్సిన వారు జీహెచ్ఎంసీలో 17 మంది ఉన్నారు. ఈసంవత్సరాంతానికి రిటైర్ కావాల్సిన వారు 236 మంది ఉన్నారు. రిటైర్మెంట్ వయసు పెంపు వల్ల రానున్న మూడేళ్లలో రిటైర్ కానున్న 858 మందికి లబ్ధి కలిగిందని జీహెచ్ఎంసీ పేర్కొంది. రిటైర్మెంట్ వయసు పెంపుపై జీహెచ్ఎంసీలో కొందరు హర్షం వ్యక్తం చేయగా,కొందరు ఎక్కువకాలం పనిచేయాలని తమకు లేదని పెదవి విరిచారు. వేతనాలు, రిటైర్మెంట్ వయసుపెంపుపై మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వోద్యోగులతోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచి సీఎం తన పెద్ద మనసు చాటుకున్నారని కొనియాడారు. మేయర్, తదితరులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చదవండి: హెచ్ఆర్ఏ తగ్గిస్తే..తగ్గనున్న వేతనాలు -
మందుబాబులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో కొత్త బార్లు రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 72 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 159 బార్లకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 55, పట్టణ ప్రాంతాల్లో 104 బార్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సోమవారం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అదేరోజు జిల్లా ఎక్సైజ్ అధికారులు ఈ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు వచ్చే నెల 8వ తేదీ వరకు తీసుకుంటారు. లాటరీ పద్ధతి ఫిబ్రవరి 10న ఆయా జిల్లాల కలెక్టర్లు లాటరీ పద్ధతిన బార్లు కేటాయిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్సైజ్ కమిషనర్ 11న డ్రా తీస్తారు. బార్లు పొందిన వారి జాబితాను అదే నెల 12న ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు.. ఎక్సైజ్ కమిషనర్‌కు పంపనుండగా, 13న జీహెచ్ఎంసీ జాబితాను పంపుతారు. అదే నెల 17న లాటరీ వచ్చిన వారికి జిల్లా అధికారులు బార్లు కేటాయించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనైతే కమిషనర్ కార్యాలయంతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి డీసీ కార్యాలయాల్లో, రాష్ట్రంలోని మిగిలిన పట్టణ ప్రాంతాల్లో మాత్రం జిల్లా ఎక్సైజ్ కార్యాలయంతో పాటు డిప్యూటీ కమిషనర్, కమిషనర్ కార్యాలయాల్లో కొత్త బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు లభ్యమవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు కింద రూ.లక్ష వసూలు చేయనున్నారు. గతంలో ఉన్న 1,030 బార్లకు అదనంగా కొత్త మున్సిపాలిటీల్లో మరో 159 ఏర్పాటు కానున్నాయి. దరఖాస్తు సులభం ఈసారి బార్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని సులభం చేసింది. ఒక్క పేజీలోనే ఎక్సైజ్ శాఖ దరఖాస్తును తయారుచేసింది. మూడు కలర్ పాస్‌పోర్టు ఫొటోలు, స్వీయ ధ్రువీకరణతో కూడిన పాన్‌కార్డు లేదా ఆధార్‌కార్డు మాత్రమే దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. బార్ల లాటరీ పూర్తయ్యాక మాత్రం 90 రోజుల్లోగా ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన అన్ని నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మరో 60 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. కానీ ఈ కాలానికి మొదటి వాయిదా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనలు అన్నీ పూర్తి చేసిన తర్వాతే బార్ లైసెన్స్ ఇస్తామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. -
సుప్రీంలో తెలంగాణ సర్కార్‌కు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కరోనా నిర్ధారణ పరీక్షల అంశంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కారణ ఆదేశాలపై న్యాయస్థానం బుధవారం స్టే విధించింది. రోజుకు 50వేలు, వారానికోసారి లక్ష కరోనా పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదని తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కరోనా నియంత్రణకు అవసరం అయిన మేరకు ప్రభుత్వం పరీక్షలు చేస్తోందని, రోజూ 50వేల పరీక్షల నిర్వహణ కష్టమని సుప్రీంకోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వెళ్లింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత ధర్మాసనం స్టే ఇచ్చింది. -
గుడ్ న్యూస్ : నేటి నుంచి 50 శాతం బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి పుంజుకుంటోంది.మరోవైపు జంటనగరవాసులకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 శాతం బస్సులు రోడెక్కాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సుల సర్వీసుల సంఖ్య పెంచామని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలో 25శాతం బస్సులు మాత్రమే నడిచిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం బస్సులు తిప్పుతున్నట్లు తెలిపిన గ్రేటర్ ఆర్టీసీ వెల్లడించింది. అలాగేబస్ పాస్ కౌంటర్లను కూడా 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 నుండి రాత్రి 8.15 వరకు బస్ పాస్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా కరోనా వైరస్ లాక్డౌన్ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణాలో వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా 25 శాతం బస్సులకు మాత్రమే అనుమతినిచ్చింది. కేసుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిందంటూ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్టీసీ ఆదాయం భారీగా పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు గత ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన సినిమా రంగానికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. -
‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ సంతానం ఉన్నా పోటీ చేసేలా ఇటీవల చట్ట సవరణ చేశారని, అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పోటీ చేయాలంటే మాత్రం ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధన ఎందుకని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉన్న వారు అనర్హులంటూ ఉన్న సెక్షన్ 218ని సవాల్ చేస్తూ శ్రీధర్‌బాబు రవి, మహ్మద్ తాహెర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉన్నవారు కూడా మున్సిపాలిటీల్లో పోటీ చేసేలా ప్రభుత్వం ఇటీవల మున్సిపల్ చట్టానికి సవరణ చేసిందని, అయితే జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం పోటీ చేయడానికి వీల్లేదన్న నిబంధన అలాగే ఉందని, ఇందుకు సరైన కారణాలను కూడా పేర్కొనలేదని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ అభ్యర్థించారు. అయితే ఈ రెండు వారాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయితే ఈ పిటిషన్ వేసి ప్రయోజనం ఉండదని రవిచందర్ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై ఈనెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ( చదవండి: డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు? ) -
2021లో సాధారణ సెలవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సంవత్సరం (2021)లో 28 సాధారణ సెలవు దినాలు, 25 ఐచ్ఛిక సెలవు దినాలు ఉండనున్నాయి. ఈ మేరకు సాధారణ, ఐచ్ఛిక సెలవు దినాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఆదివారాలతో పాటు అన్ని రెండో శనివారాలు (ఫిబ్రవరి 13 మినహా) మూసి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా 25 ఐచ్ఛిక సెలవుల్లో అయిదుకు మించకుండా వాడుకోవచ్చు. రాష్ట్రంలోని పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు, విద్యా సంస్థలు, పబ్లిక్ వర్క్స్ శాఖల ఉద్యోగులకు ఈ సాధారణ సెలవులు వర్తించవు. ఆయా పండుగలు/సందర్భాల్లో ఈ సంస్థలకు వర్తించనున్న సెలవులను ప్రకటిస్తూ సంబంధిత శాఖలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. ఇక నెల వంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ వంటి పర్వదినాల్లో ఏవైనా మార్పులు చేసుకుంటే ప్రభుత్వం ఆ మేరకు సెలవు దినాలను సైతం మార్చనుంది. ( ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి లింక్‌రోడ్లు ) -
ఏపీలో తెలంగాణ మద్యానికి 'చెక్'..!
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధరలను సవరించింది. అంతకు ముందు మూడు బాటిళ్ల రవాణాపైనా నిషేధం విధించి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లకు అనుమతి లేకుండా చేసింది. గతంలో ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను పెంచడంతో ఇతర రాష్ట్రాల నుంచి భారీగా స్మగ్లింగ్ జరిగింది. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదయ్యాయి. మరోవైపు పొరుగు రాష్ట్రాల మద్యం అమ్మకాలూ పెద్దఎత్తున పెరగడం గమనార్హం. ఇందుకు కారణం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం స్మగ్లింగ్ జరగడమే. మద్యం ధరలు ఇతర రాష్ట్రాల్లో తక్కువగా ఉండటంతో అక్కడ్నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో పోలిస్తే రూ.426 కోట్లు పెరిగిన అమ్మకాలు ► గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు తెలంగాణలో మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ఈ ఏడాది ఐదు నెలల వ్యవధిలో రూ.426 కోట్లు పెరిగాయి. ► అదే మద్యం వినియోగాన్ని ఏపీతో పోలిస్తే భారీ వ్యత్యాసం కనపడుతోంది. తెలంగాణలో ఈ ఐదు నెలల వ్యవధిలో మద్యం వినియోగం 142.72 లక్షల కేసులు కాగా, ఏపీలో 49 లక్షల కేసులు మాత్రమే. ► తెలంగాణలో గతేడాది ఐదు నెలలతో (ఏప్రిల్–ఆగస్ట్)తో ఈ ఏడాది పోల్చి చూస్తే ఆదాయంలో 2.93%, అమ్మకాల విలువలో 4.66% వృద్ధి నమోదైంది. ఏపీలో భారీగా 65% వినియోగం తగ్గింది. ► మద్యం కేసుల వినియోగం కర్ణాటకలో 198.88 లక్షలు కాగా, తమిళనాడులో 172.64 లక్షల కేసులు. ► ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నెల రోజుల వ్యవధిలో అక్రమ మద్యం రవాణా కేసులు 1,211 నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ నుంచే 630 కేసులు కాగా, కర్ణాటక– 546, ఒడిశా– 24, తమిళనాడు– 11 కేసులు నమోదయ్యాయి. ఐదు నెలల్లో రూ.2,170 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిన ఏపీ 1 గతేడాది ఏప్రిల్–ఆగస్ట్ కాలంలో మద్యం ద్వారా ఏపీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.7,638.24 కోట్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో రూ.5,468.17 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గతేడాది కంటే రూ.2,170.07 కోట్ల ఆదాయం కోల్పోయింది. అంటే 28.411% ఆదాయం తగ్గింది. 2 మద్యం, బీరు అమ్మకాల విలువను పరిశీలిస్తే ఈ ఐదు నెలల వ్యవధిలో గతేడాది రూ.8,884.69 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.5,998.87 కోట్లు. అమ్మకాల విలువ గతం కంటే రూ.2,885.82 కోట్లు తక్కువగా నమోదైంది. -
తెలంగాణ చరిత్రలోనే ఇదో దుర్దినం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయాన్ని ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ చరిత్రలోనే ఇదో దుర్దినమని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మూఢనమ్మకం కోసం 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను ఫణంగా పెడతారా అని ప్రశ్నించారు. ఒక్క కుటుంబం అవసరాల కోసం ఏదైనా చేస్తారా అని నిలదీశారు. కేసీఆర్ తన కుటుంబం కోసం రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, టి.జగ్గారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్, పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్లతో కలిసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు చెల్లించేందుకు నిధులు లేవని వారి వేతనాల్లో కోతలు పెట్టిన కేసీఆర్ ఇప్పుడు వందల కోట్ల రూపాయలతో కొత్త సచివాలయాన్ని ఎలా కడతారని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వాలు తప్పులు చేస్తుంటే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేదని, ఇప్పుడు కోర్టులపై ఉన్న నమ్మకం కూడా పోయిందన్నారు. సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగి తీర్పు రాకముందే ఉన్న సచివాలయాన్ని కూల్చివేయాలన్నదే కేసీఆర్ దురుద్దేశమని వ్యాఖ్యానించారు. పాత సచివాలయాన్ని కూల్చివేయకుండా కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలన్న రాజకీయ పార్టీల డిమాండ్‌ను కనీసం పట్టించుకోకుండా పటిష్టంగా ఉన్న భవనాలను నిలువునా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన ఎలా జరుగుతోంది: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్ క్వారంటైన్లో ఉంటే రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ వాస్తు పిచ్చితో పాలన చేస్తున్నారన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని బాగుచేయడం చేతకాని ప్రభుత్వం ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని కట్టాలనుకోవడం సరైంది కాదన్నారు. సీఎం తనకు కావాలనుకుంటే ఓఆర్ఆర్ పక్కన కొత్త సెక్రటేరియట్ కట్టుకోవచ్చని, కానీ ఉన్న దాన్ని కూల్చడం ఎందుకని ప్రశ్నించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గవర్నర్ తన విచక్షణాధికారాలతో సెక్షన్–8ని అమలు చేయాలని కోరారు. దొంగతనంగా అర్ధరాత్రి సెక్రటేరియట్ ఎందుకు కూల్చాల్సి వచ్చిందని షబ్బీర్ ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలోనే కొత్త సచివాలయం నిర్మాణం జరగాలని అధికారులకు ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో అంత త్వరగా ఎందుకు నిర్ణయాలు తీసుకోరని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. అర్ధరాత్రి సచివాలయాన్ని ఎందుకు కూల్చాల్సి వచ్చిందో బాధ్యత గల ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. సీఎం ఎక్కడ? కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తుంటే సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చూపించే లెక్కలకు క్షేత్రస్థాయిలో కరోనా కేసులకు చాలా తేడా ఉందని, కేసీఆర్ చీకటి కుట్రలో పాలు పంచుకునే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 20 మందిని తొక్కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అయిన సోమేశ్‌కుమార్ కేసీఆర్‌కు తొత్తుగా మారారని, ఆయన ఆ పదవికి అనర్హుడని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. గవర్నర్ పిలిస్తే పోకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని అవమానపర్చారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి కరోనా విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నారని ఉత్తమ్ కితాబిచ్చారు. ఏపీలో 10 లక్షల టెస్టులు జరిగితే, తెలంగాణలో లక్ష టెస్టులు జరిగాయని, తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపడుతుందని ఉత్తమ్ చెప్పారు. -
సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..: హరీశ్‌రావు
సాక్షి, సిద్ధిపేట: రైతు సంస్కరణలలో సిద్ధిపేట ఆదర్శం కావాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నియంత్రిత పంటల సాగుపై శుక్రవారం జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, బొడకుంట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. (వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు) పంట మార్పిడితో రైతులకు మేలు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటల మార్పిడి ద్వారా దిగుబడి పెరిగి రైతుకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా రైతుల సంక్షేమానికి పరితపిస్తున్నారని చెప్పారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్, అంతర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్ ఆధారంగా సాగు చేయాలని ఆయన సూచించారు. (పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల) ప్రభుత్వం ఉద్దేశ్యం అది కాదు.. రైతు బంధు పథకం ఆపాలని ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టామని చెప్పారు. వానాకాలం లో మొక్కజొన్న దిగుబడి బాగా తగ్గుతుందని.. అందుకే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని ఆయన వివరించారు. యాసంగిలో వరికి రాళ్ళ వానతో నష్టం జరుగుతుందని.. అదే మొక్కజొన్న అయితే ఎలాంటి నష్టం ఉండదన్నారు. మొదటి పంటలో రైతుకు లాభం జరగడమే లక్ష్యంగా సర్కార్ పని చేస్తోందన్నారు. ఇది రైతులపై బలవంతంగా రుద్దడం కాదని స్పష్టం చేశారు. కొత్త వంగడాలు వచ్చాయి.. కందిలో కొత్త వంగడాలు వచ్చాయని.. ఆరు నెలలకే పంట కాలం పూర్తయి దిగుబడి పెరుగుతుందన్నారు. ఆ తరువాత రెండో పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చన్నారు. సిద్దిపేట రిజర్వాయర్ల ఖిల్లా అని.. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఏడాది కాలం జలకళను సంతరించుకుంటాయన్నారు. తెలంగాణలో ఎరువులు, విత్తనాలు, నీళ్లకు కొరత లేదన్నారు. గోదావరి జలాలపై ఆధారపడి పంటల సాగు చేస్తామన్నారు. పత్తికి డిమాండ్ పెరిగింది.. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ ల తయారీకి భారీ డిమాండ్ పెరిగిందని, పత్తికి డిమాండు ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 6.3 ఎంఎం పొడవు ఉన్న ధాన్యానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. సిద్ధిపేట జిల్లాలో 9,500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో ఫామ్ ఆయిల్ సాగు ఎక్కువగా చేస్తారన్నారు. వారి మాటలు రైతులు విశ్వసిస్తారా..? జిల్లాలో సాగుకు భూసార పరీక్షలు, సర్వే చేయించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరామని తెలిపారు. కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని విపక్షాల మాటలు రైతులు విశ్వసిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లేనని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. -
పోతిరెడ్డిపాడులో చుక్కనీటిని వదిలేది లేదు
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు అంశంలో కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం గుంట కాడి నక్కల్లా వ్యవహరిస్తున్నారని శాసనమండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన ఒక్క నీటిచుక్క వదిలేది లేదని, ఉద్యమం సమయం నుంచి పోతిరెడ్డిపాడు అంశంపై టీఆర్ఎస్ ఒకే వైఖరికి కట్టుబడి ఉందన్నారు. హంద్రీ నీవాకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు తరలింపునకు అప్పటి మంత్రులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు హారతులు ఇచ్చారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ సంకీర్ణంలో ఉన్న తమ పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులు రాజీనామా చేసి బయటకు వచ్చారని గుర్తుచేశారు. తెలం గాణ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ నీరటిలా ఉన్నారని, కాంగ్రెస్ నేతలు తమ పాలనలో తెలంగాణ ప్రాజెక్టులను పెండిం గ్‌లుగా మార్చారని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు అంశంపై తాము చేసే పోరాటంలో కలసిరావడం ద్వారా కాంగ్రెస్ నేతలు పాపపరిహారం చేసుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలది భిన్నవైఖరి.. పోతిరెడ్డిపాడు అంశంపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం జోక్యం చేసుకునేలా చూడాలని కర్నె సూచించారు. దీనిపై తెలంగాణ, ఏపీ బీజేపీ నేతలు భిన్న వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల జల వివాదాలు ఉండొద్దని కేసీఆర్ పెద్ద మనసుతో వ్యవహరించారని, తెలంగాణకు అన్యాయం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా గతంలో ఎన్నోమార్లు స్పష్టం చేశారని, ఏపీ నీటి పారుదల శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 29న లేఖ రాసిందన్నారు. ప్రస్తుతమున్న 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు నీటి సామర్థ్యం పెంపు ప్రయత్నాలు మానుకోవాలని లేఖలో ప్రస్తావించినట్టు తెలిపారు. దీనిపై ఏపీ నుంచి స్పందన లేకపోగా, అక్కడి ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన ఉత్తర్వులపై కేసీఆర్ సమీక్ష జరిపి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసిన విషయాన్ని కర్నె గుర్తు చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12న మరో లేఖ రాసిందని వివరించారు. -
నగరంలో పకడ్బందీగా లాక్డౌన్
-
వేతనాల్లో కోత..
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ రాష్ట్ర ఆదాయాన్ని కాటేసింది. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వేతనాలు, పెన్షన్ల చెల్లింపులపై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్‌లో చెల్లించనున్న వేతనాలు, పెన్షన్లపై భారీ కోత పడనుంది. పలు ఉద్యోగ వర్గాల వేతనాల కోతలు ఇలా ఉండనున్నాయి. -
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు...
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీకి చట్ట ప్రకారం చెల్లించాల్సిన రూ.4 వేల కోట్ల బకాయిల్లో కనీసం రూ.47 కోట్లయినా ప్రభుత్వం ఇచ్చే స్థితిలో ఉందో లేదో వెంటనే తెలపాలి. సమస్యను యూనియన్, ఇతర అంశాల కోణంలో చూడొద్దు. సామాన్య ప్రజల రవాణా ఇబ్బందుల కోణంలోనే చూడాలి. నెల రోజులు కావొస్తున్నా ఇప్పటికీ 40 శాతమే బస్సులు నడుస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ఓ గిరిజన వ్యక్తి తన బిడ్డకు జబ్బు చేస్తే చేతుల్లో పెట్టుకుని వరంగల్ ఆస్పత్రికి తీసుకెళ్లగలడా. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు డెంగీతో బాధపడే రోగిని అంబులెన్స్, ప్రైవేటు వాహనాల్లో తీసుకురాలేని వాళ్లు తన బిడ్డల ప్రాణాలపై ఆశలు వదులుకోవాలా? అలాంటి వాళ్లను చచ్చిపోనిస్తుందా ప్రభుత్వం? ప్రభుత్వం తక్షణమే రూ.47 కోట్లు ఇస్తే.. బిడ్డల ప్రాణాలు నిలుస్తాయి కదా.. ప్రభుత్వం ఆర్థికంగా ఆర్టీసీని ఎలా ఆదుకుని నాలుగు డిమాండ్ల పరిష్కారానికి ఏ నిర్ణయం తీసుకుంటుందో మంగళవారం చెప్పాలి’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని, అలాగే కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్ధి గల ఉన్నతాధికారి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్, ఇతరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాల్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం 2 గంటల పాటు విచారించింది. అన్ని డిమాండ్లపై చర్చించాలి కదా.. తొలుత ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదిస్తూ.. ఈ నెల 26న యూనియన్ ప్రతినిధులతో చర్చలకు ఆహ్వానించామని, అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆంశంపై చర్చిస్తేనే ఇతర అంశాల్లోకి వెళ్తామని యూనియన్ ప్రతినిధులు షరతు విధించారని చెప్పారు. యూనియన్ల తరఫు సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. విలీనం డిమాండ్ వదులుకున్నామని తాను చెప్పినట్లు ప్రభుత్వ న్యాయవాదే చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. 21 డిమాండ్లనే చర్చించాలని హైకోర్టు చెప్పినట్లు అధికారులు తప్పుగా పేర్కొన్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. 21 డిమాండ్లు ఆర్థికంగా పెద్దగా సంబంధం లేనివని మాత్రమే చెప్పామని, అన్ని డిమాండ్లపైనా చర్చ జరపాలనే 18న ఉత్తర్వులు ఇచ్చామని స్పష్టం చేసింది. ఎక్కడో ఓ చోట నుంచి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నాల్లో భాగంగా 21 డిమాండ్లపై చర్చలు జరిపి ఉంటే విశ్వాసం పెరిగేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు తగ్గిందనే భావన వచ్చేదని అభిప్రాయపడింది. అలాంటప్పుడు చర్చలెందుకు..? చర్చలకు ముందే ఫలితాలు ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి ఈడీ కమిటీ నివేదిక రూపొందించినట్లు ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క్లోజ్డ్ మైండ్ ఫలితం కూడా అలాగే ఉంటుంది. అలాంటప్పుడు చర్చలు జరపడం ఎందుకు? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 4 డిమాండ్లు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయని తేల్చిన కమిటీ.. మిగిలిన డిమాండ్లను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. కోర్టు అంటే ఆషామాషీగా తీసుకున్నట్లుగా ఉందని, ప్రధానంగా ఉన్నతాధికారుల వైఖరి దారుణంగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీవ్ర ఆర్థిక భారమయ్యే డిమాండ్లు రెండే ఉన్నాయని, మిగిలిన డిమాండ్లపై అధికారులు ఎందుకు కసరత్తు చేయలేదని ప్రశ్నించింది. గతంలో కార్మికులకు 44 శాతం వేతనం పెంచామని ఏఏజీ చెప్పగానే, అప్పుడు అంత విశాల హృదయంతో ఉదారంగా ఇవ్వడమెందుకో, ఇప్పుడు ఏమీ ఇవ్వలేమనడం ఎందుకో, అప్పుడు 22 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కాదు కదా అని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటివరకు ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించారో చెప్పాలని ధర్మాసనం కోరగా, ఆర్టీసీ ఉద్యోగుల్లో మార్పు వస్తుందనే ఆశతో ఉన్నామని ఏఏజీ బదులిచ్చారు. కార్మికులు కారణం కాదు ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన రాయితీల వల్ల ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు రూ.4 వేల కోట్లకుపైగా ఉన్నాయని, వీటిని ప్రభుత్వం చెల్లించకపోగా అప్పులు చేసి ఆర్టీసీ కార్పొరేషన్‌ను ఆర్థికంగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని చెప్పారు. సిటీ బస్సులకు జీహెచ్ఎంసీ 1,492 కోట్లు, ప్రభుత్వ రాయితీల నిమిత్తం రూ.1,099 కోట్లు, ఉద్యోగుల పీఎఫ్ రూ.454 కోట్లు, ఉద్యోగుల సహకార సంఘం నిధులు రూ.400 కోట్ల వరకు మొత్తం రూ.4 వేలు కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని పేర్కొన్నారు. డిపోలను 95 నుంచి 97కు పెంచారని, ఉద్యోగులు 65,740 నుంచి 49,733కు తగ్గినా సగటు ఉత్పాదక పెరిగిందని, నష్టాలకు ప్రభుత్వ/ఆర్టీసీ సంస్థ యాజమాన్య నిర్వాకమే కారణమని చెప్పారు. తలసరి ఉత్పాదకత 55 కి.మీ. నుంచి 61 కి.మీ.లకు పెరిగిందని, సగటు 326 కి.మీ. నుంచి 342 కి.మీ. నడపుతున్నారని, 91.48 లక్షల నుంచి 97.55 లక్షలకు రోజుకు గమ్యస్థానాలకు చేరవేసే ప్రయాణికుల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఆక్యుపెన్సీ 69 శాతం నుంచి 74.5 శాతానికి పెరిగేందుకు ఆర్టీసీ కార్మికులు శ్రమించారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన రాయితీల బకాయిల్లో రూ.47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్–226 కింద ప్రతీది న్యాయ సమీక్ష చేసేందుకు హైకోర్టుకు తావులేదని ఏఏజీ అనడాన్ని కోర్టు తప్పపట్టింది. ‘10 వేల బస్సుల్లో 4 వేలు మాత్రమే నెల రోజులుగా నడుస్తున్నాయి. ప్రజా రవాణా కుంటుపడింది. రోగుల ఇక్కట్లు వర్ణనాతీతం. సామాన్య ప్రజల కష్టాలే తమ ముందు ప్రధాన అంశం. పౌరహక్కులు, మానవహక్కుల అంశంతో ముడిపడిన వ్యవహారమిది. మాకు ఆకాశమే హద్దు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం న్యాయ సమీక్ష చేస్తాం’అని ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఏజీ హాజరుకు ఆదేశం.. చాలా కార్యక్రమాలకు, పథకాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రజా రవాణా సమస్య పరిష్కారానికి రూ.47 కోట్లు ఇవ్వగలదో లేదో, ఆ విధమైన ఆర్థిక స్థోమత ఉందో లేదో చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఆర్టీసీ సొంతగా ఆర్థికాభివృద్ధి సాధించాలని, ఎంతకాలం ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని ఏఏజీ బదులిస్తూ.. ప్రస్తుతం రూ.10 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ తాము ప్రభుత్వం నుంచి సమాచారాన్ని తెలుసుకోవాలని నిర్ణయించామని, హైకోర్టు ప్రభుత్వ ప్రతినిధిగా ఏజీని విచారణకు పిలిపించాలని ఆదేశించింది. ఏజీ వచ్చిన వెంటనే ‘ఈడీ కమిటీ నివేదికలో 4 డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు అవసరం అవుతాయని తేల్చింది. ఆ మొత్తాన్ని వెంటనే ప్రభుత్వం ఇవ్వగలదో లేదో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని సంప్రదించి మంగళవారం చెప్పండి. మిగిలిన డిమాండ్లకు ఆర్థికంగా ఎంత భారం పడుతుందో తెలుసుకోండి. వీటి విషయంలో కసరత్తు చేసినట్లుగా ఈడీల నివేదికలో లేదు’అని ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని ఏజీ కోరితే మంగళవారం ఉదయం బదులు మధ్యాహ్నం విచారిస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె
సాక్షి, నల్లగొండ : ఆర్టీసీలో మరో గుండె ఆగింది. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా మరో కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన జమీల్‌కు గురువారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యాడు. గత 20 రోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న ఆయన నల్లగొండలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరి వల్లే మానసిక ఒత్తిడికి లోనై ఆయన చనిపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గురువారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. 11 గంటలకు ఆల్ పార్టీ నేతలతో ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఈ రోజు భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. హైదరాబాద్ : సమ్మె చేసున్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 21 డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై రెండు నివేదికలు సిద్ధం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మినహా ఇతర డిమాండ్లపై నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. అన్ని విషయాలపై సమగ్ర వివరాలను రూపొందించి ఒక నివేదికను కోర్టుకు అందించనున్నారు. ప్రతి అంశానికి సంబంధించి రెండు రకాల సమాధానాలను అధికారులు సిద్ధం చేశారు. ఆర్టీసీకి అద్దె బస్సుల అవసరంపై కూడా అధికారులు ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను సీఎం కేసీఆర్‌ను కలిసి ఈడీల కమిటీ అందజేయనుంది. -
ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పలేదు..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదని రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన శనివారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసి భవిష్యత్తుపై జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని, సంస్థను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. ఆర్టీసీపై ఉన్న ప్రేమతోనే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు 44శాతం ఫిట్మెంట్ సహా..అనేక సానుకూల నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రతీ అంశంపైనా విపక్ష పార్టీలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాయని.. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కొందరు అత్యుత్సాహంతో సమ్మెకు దిగారని తలసాని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో ఆర్టీసీని బీజేపీ ప్రైవేటు పరం చేస్తే... చత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ఏకంగా ఆర్టీసీని రద్దు చేసిందన్నారు. రైల్వేతో పాటు ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీజేపీ, కాంగ్రెస్‌కు తలసాని సవాలు విసిరారు. ప్రజా రవాణా వ్యవస్తను ప్రభుత్వం మెరుగు పరుస్తుందని, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు. -
హద్దులు దాటితే ఆపేస్తాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రు ల్లో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్‌పై వారంలో గా సమగ్ర తనిఖీలు చేపట్టాలని, అక్కడి రికార్డులను పరిశీలించాలని సర్కారు ఆదేశించింది. ఉల్లంఘన జరిగినట్లు తేలితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ నిలిపివేస్తామని తెలి పింది. క్లినికల్ ట్రయల్స్‌ల్లో రోగుల భద్రతే అత్యంత కీలకమని తెలిపింది. ఆస్పత్రికి వచ్చే సాధారణ రోగులు, అనారోగ్యంతో చేరే వారిపై క్లినికల్ ట్రయల్స్ జరపకూడదని పేర్కొంది. నిలోఫర్‌లో ఉల్లంఘన జరిగినట్లు తేలితే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మార్గదర్శకాలతో కూడిన ఓ ప్రకటన జారీ చేశారు. స్వచ్ఛందంగా క్లినికల్ ట్రయల్స్‌ల్లో పాల్గొనడానికి ముందుకు వచ్చే వారిని మాత్రమే అంగీకరించాలని స్పష్టం చేశారు. వారి సమ్మతిని తెలియజేసే పత్రాలు, ఆడియో విజువల్ రికార్డింగ్ వంటి అన్ని రకాల చట్టపరమైన విధానాలను అనుసరించడం ప్రయోగాలు చేసే వారి బాధ్యతన్నారు. అధికారులు రూపొందించిన కఠిన నిబంధనలను అనుసరించిన తర్వాతే పారదర్శకంగా ట్రయల్స్ నిర్వహించాలని తెలిపారు. నిలోఫర్‌పై ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ సోమవారం అన్ని రకాల పత్రాలను, రోగుల నుంచి తీసుకున్న సమ్మతి వివరాలను సేకరిస్తుందని చెప్పారు. ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మార్గదర్శకాలిలా.. ►క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో ఎథికల్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. దాని ఆధారంగానే ఔషధ ప్రయోగాలు జరగాలి. ►ఎథిక్స్ కమిటీ ప్రయోజనాలు, నష్టాలను అంచనా వేయాలి. ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశాలున్నాయా పరిశీలించాలి. అటువంటి ప్రమాదాలను తగ్గించే ప్రణాళికలను రూపొందించాకే ట్రయల్స్ చేయాలి. ►ప్రభుత్వ ఆస్పత్రుల్లో చట్టబద్ధంగా అనుమతించే క్లినికల్ ట్రయల్స్ మాత్రమే జరపాలి. ►క్లినికల్ ట్రయల్స్‌పై వివాదాలు తలెత్తినప్పుడు విచారణ జరపడం తప్పనిసరి. నిలోఫర్ ఆస్పత్రిలో కూడా అటువంటి విచారణే జరుగుతుంది. క్లినికల్ ట్రయల్స్‌ల్లో పాల్గొనే వాలంటీర్ల భద్రత కోసం ఇలా చేస్తున్నాం. ►ఔషధ ప్రయోగాల్లో పాల్గొనేవారి నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. క్లినికల్ ట్రయల్స్ దేనిపై చేస్తున్నారో సమాచారాన్ని ఇవ్వాలి. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే వారు నిరక్షరాస్యులైతే, వారికి అవగాహన కల్పించి సాక్షి సమక్షంలో సమ్మతి తీసుకోవాలి. ►క్లినికల్ ట్రయల్స్ జరపాలని కోరుకునే పరిశోధకుడు మొదట ఎథిక్స్ కమిటీకి, తర్వాత మెడికల్ సూపరింటెండెంట్ పైస్థాయికి పంపించాలి. ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియాకు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి మాత్రమే అనుమతి వస్తుంది. ►ట్రయల్స్‌ను ఆమోదించే ముందు పరిశోధన యోగ్యత, ప్రయోజనాన్ని నిర్ణయించాలి. ►దేశంలో నిబంధనలను ఐసీఎంఆర్ నిర్దేశిస్తుంది. ఒక క్లినికల్ ట్రయల్‌ను సమగ్రమైన వివరాలతోనే నిర్వహిస్తారు. ►ఎథిక్స్ కమిటీలు క్లినికల్ ట్రయల్స్‌కు ముందు ప్రాథమిక సమీక్ష చేయాలి. ట్రయల్స్ జరుగుతున్నప్పుడు పర్యవేక్షించాలి. మానవులపై ట్రయల్స్ విషయంలో కఠినమై న నియంత్రణ చర్యలున్నాయి. ►ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ఎథిక్స్ కమిటీ నిలోఫర్‌లో చేసే క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతిచ్చినట్లు తేలింది. భద్రతాచర్యల ను అనుసరిస్తున్నాయో లేదో తేల్చడానికి ముగ్గురు సభ్యుల కమిటీ వేశాం. అది నివేదిక అందజేస్తుంది. ►క్లినికల్ ట్రయల్స్‌ను పర్యవేక్షించా లని అన్ని ఎథిక్స్ కమిటీలకు సూచించాలని నిర్ణయించాం -
టీఆర్ఎస్ ఐడియా...సోషల్ మీడియా!
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలు, ప్రభుత్వంపై వస్తున్న అసత్య వార్తలను తిప్పికొట్టడంతో పాటు.. ప్రభుత్వం, పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ ప్రత్యేక పంథా అవలంబించాలని నిర్ణయించింది. సమాచారం చేరవేతలో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. కార్యకర్తలు, నేతలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేలా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. యువజన, విద్యార్థి విభాగాలతో పాటు క్రియాశీలక నేతలను గుర్తించి, వారికి సామాజిక మాధ్యమాలపై అవగాహన కల్పించనున్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు వంటి కీలక నేతలతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ, పలు అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు, పార్టీ అభిమానులు కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా టీఆర్ఎస్ కార్యక్రమాలను ప్రచారం చేయడంతో పాటు, వివిధ వర్గాల నుంచి వచ్చే అనుకూల, వ్యతిరేక పోస్ట్‌లపై స్పందిస్తున్నారు. వ్యతిరేక ప్రచారంపై ‘సోషల్’ అస్త్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో టీఆర్ఎస్ వ్యతిరేక వార్తలను బీజేపీకి అనుకూలంగా ఉన్నవారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారనే భావన టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న అసత్య, అర్ధ సత్య వార్తలతో నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేందుకు ప్రయోగాత్మకంగా మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన సుమారు 200 మంది పార్టీ కార్యకర్తలకు 2 రోజుల కింద పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో జరిగిన ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించారు. సామాజిక ఖాతాల నిర్వహణలో సాంకేతిక అంశాలతో పాటు, న్యాయపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని స్పందించాలని వారికి సూచించారు. ఇతర నియోజకవర్గాల్లోనూ.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం 200 మంది చురుకైన యువజన, విద్యార్థి విభాగాలకు చెందిన కార్యకర్తలతో పాటు క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేసి, శిక్షణ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో కొనసాగుతున్న సోషల్ మీడియా కమిటీలను కూడా వ్యవస్థీకరించి.. మరింత మందికి చోటు కల్పించాలనే యోచనలో పార్టీ నేతలు ఉన్నారు. సోషల్ మీడియాపై శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి.. నియోజకవర్గ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా షెడ్యూలు రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. ‘తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలనలోనూ తనదైన ముద్ర వేస్తోంది. కొన్ని టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు పనిగట్టుకుని ప్రభుత్వ పనితీరుపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. పార్టీ, ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించాం’అని బాల్క సుమన్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
మున్సి‘పోల్స్’కు కసరత్తు
కరీంనగర్‌కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జూలై 2తో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగుస్తుండడంతో ఆ లోపే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే నిర్ణయానికొచ్చింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించడం తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడ్డ కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అన్ని మున్సిపాలిటీల్లో పుర ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. ఓటరు జాబితాతోపాటు బీసీ రిజర్వేషన్లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు పురపాలక శాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఈ నెల 21 నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల రిజర్వేషన్లను పోలింగ్ కేంద్రాల వారీగా పూర్తిచేయాలని సీడీఎంఏ(చైర్మన్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసి ఏ ఇంటి నెంబర్ ఏ డివిజన్లో వస్తుందో ఆ ఇంటి నెంబర్‌ను టీపోల్ సాప్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఓటర్ల జాబితా ముసాయిదా ప్రదర్శన, జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, అభ్యంతరాలను పరిష్కరించడం, అనంతరం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సీడీఎంఏ కార్యాలయంలో గురువారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులు ఎన్నికలపై సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. డివిజన్ల పునర్విభజనపై సందిగ్ధం కరీంనగర్ నగరపాలక సంస్థలో సమీపంలోని పద్మనగర్, సీతారాంపూర్, రేకుర్తి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లి, అల్గునూరు గ్రామాలు విలీనం జరిగాయి. ఈ గ్రామాలను ఏ విధంగా డివిజన్లుగా మారుస్తారనేది సందిగ్ధంగా మారింది. డివిజన్ల పెంపు జరుగుతుందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఉన్న డివిజన్లలోనే విలీన గ్రామాలను కలిపి ఎన్నికలు నిర్వహించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయా గ్రామాలకు ఆనుకొని ఉన్న డివిజన్లలో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలా జరిగితే శివారు డివిజన్ల ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలా కాకుండా విలీన గ్రామాల ఓటర్లను కలుపుకొని పునర్విభజన చేస్తే డివిజన్ల స్వరూపం మారనుంది. పునర్విభజన జరగకపోతే శివారు డివిజన్ల రాజకీయ నేతలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పునర్విభజన జరిగితే మొత్తం నగర డివిజన్లపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పునర్విభజన జరపాలంటే కచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. జూలైలోనే ఎన్నికలు జరపాల్సి వస్తే ఎలాంటి మార్పులు లేకుండా విలీన గ్రామాలకు ఆనుకొని ఉన్న డివిజన్లలోనే కలిపి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయోమయంగా రిజర్వేషన్ల ప్రక్రియ... నగరపాలక సంస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. విలీన గ్రామాలకు సంబం«ధించిన ఓటర్ల జాబితా, నగర ఓటర్ల జాబితా పూర్తిచేయాల్సి ఉంది. మున్సిపాలిటీలకు కొత్త చట్టం తెస్తే రిజర్వేషన్లు పూర్తిగా మారుతాయని తెలుస్తోంది. పాత పద్ధతినే ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారమే యధాతథంగా రిజర్వేషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం జరుపుతారా... లేదా పాత పద్ధతినే చేపడతారా అనేది అయోమయంగా మారింది. తెరపైకి కొత్త పురపాలక చట్టం..? తెలంగాణ ప్రభుత్వం పురపాలికల్లో సమూల మార్పులు చేసేందుకు కొత్త పురపాలక చట్టాలన్ని అమలులోకి తేనుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పురపాలక చట్టానికి ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి. లేని పక్షంలో ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని తెస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కొత్త చట్టంలో పుర ఎన్నికల్లో మేయర్, చైర్మన్ ఎన్నికలు ప్రత్యక్షంగా జరుగుతాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలా జరిగితే కార్పొరేటర్ల బేరసారాలు, అధికా రాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడం వంటివి ఘటనలకు చెక్‌పడనుంది. ఒక్క డిప్యూటీ మేయర్ ఎన్నికకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కొత్త చట్టంలో ఎన్నికల కంటే పౌరసేవలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. ఆశావహుల సందడి... మున్సిపాలిటీల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహుల్లో సందడి నెలకొం ది. ఇప్పటికే వివిధ డివిజన్ల నుంచి కార్పొరేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతోపాటు వివిధ పార్టీల నుంచి పోటీకి దిగేందుకు సమాయత్తం అవుతున్న నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. అన్ని పార్టీలు మరోమారు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఆయా డివిజన్లలో ఇప్పటికే ఇల్లిల్లు తిరుగుతూ తమ అనుచరులను కలుస్తూ ఎన్నికలు వస్తున్నాయని, తమకు మద్దతు తెలుపాలని కోరు తూ అంతర్గత ప్రచారం మొదలుపెట్టారు. ఈసారి ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారుతాయని, గ్రామీణ ప్రాంత స్థానిక ఎన్నికలకు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పుర ఎన్నికల ప్రకటనతో నగరంలో రాజకీయ సందడి నెలకొంది. మున్సిపాలిటీల్లో సందడి... రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం, వెంటవెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన చేపట్టడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో సందడి మొదలైంది. కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడ్డ కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల హడావుడి కనిపించింది. గురువారం సీడీఎంఏ కార్యాలయంలో జరిగే ఎన్నికల సమీక్ష సమావేశానికి మున్సిపాలిటీల్లో అధికారులు సమాచారాన్ని సిద్ధం చేయడం కనిపించింది. ఆశావహులు మున్సిపాలిటీలకు చేరుకొని ఎన్నికల ప్రక్రియపై ఆరా తీశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉండబోతుందనే అంశంపై పలు వురు చర్చించుకున్నారు. మేయర్, చైర్మన్ రిజర్వేషన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఏ డివి జన్, ఏ వార్డుకు ఎలా ఉంటాయనే నేతలు అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. -
పంచాయతీకి ‘పవర్’
నల్లగొండ : పల్లె పాలన ఇక పట్టాలెక్కనుంది. ప్రభుత్వం సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇస్తూ శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసింది. సోమవారం నుంచి చెక్ జాయింట్ చెక్‌పవర్ విధానం అమల్లోకి రానుంది. చెక్ పవర్ ఇవ్వడంతో పంచాయతీ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సర్పంచ్, కార్యదర్శులకు ఉమ్మడి చెక్ పవర్ ఉండగా, ఈ సారి సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్‌ను ఇచ్చారు. కాగా సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్‌పై సర్పంచ్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 844 పంచాయతీలు.. జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉండగా 831 గ్రామ పంచాయతీలకు జనవరిలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అత్యధిక సర్పంచ్‌లు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎన్నికైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వం చెక్ పవర్‌ను సర్పంచ్, కార్యదర్శికి ఇవ్వాలా..? సర్పంచ్ ఉపసర్పంచ్‌లకు ఇవ్వాలా అనే అంశాలపై సమాలోచన చేసింది. మొన్నటి వరకు వరుసగా ఎన్నికలు రావడంతో.. కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో చెక్‌పవర్‌పై నిర్ణయం వెలువరించింది. ఖాతాల్లోనే 14వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఎన్నికల ముందు గ్రామంలకు 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. పాత సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోతున్నందున వారు నిధులు ఇష్టానుసారంగా డ్రా చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాటిపై ప్రీజింగ్ పెట్టింది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో సర్పంచ్‌లకు గ్రామాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే పంచాయతీ ఖాతాల్లో నిధులు ఉన్నా నాలుగున్నర నెలలుగా ఏ సర్పంచ్ కూడా ఖర్చు చేయలేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. అప్పులు చేసి పనులు చేపట్టిన సర్పంచ్‌లు.. ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వని కారణంగా ప్రస్తుత సర్పంచ్‌లు అప్పులు చేసి మరి గ్రామాల్లో పనులు చేపట్టారు. కొత్తగా ఎన్నిక కావడంతో.. పనులు చేయకపోతే చెడ్డ పేరు వస్తుందనే భయంతో గ్రామాల్లో పనులు చేప్టటేందుకు సొంతంగా నిధులు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడలేదు. వేసవి కావడంతో గ్రామాల్లో పెద్దయెత్తున నీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి అత్యవసర పనులకు అప్పులు చేయాల్సి వచ్చిందని.. పలువురు పేర్కొన్నారు. అసంతృప్తిలో సర్పంచ్‌లు.. సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడంపై సర్పంచ్‌లు అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీలో సర్పంచ్, ఉపసర్పంచ్ వేర్వేరు పార్టీలకు చెందినవారు ఉంటే.. పనులపై నిర్ణయం తీసుకోవడంలో, నిధులు విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కొందరు మాత్రం జాయింట్ చెక్ పవర్ ఉంటేనే.. పంచాయతీ పాలకవర్గమంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గ్రామంలో ఏది అత్యవసరమైన పనో వాటిని చేపట్టేందుకు అవకాశం ఉండడంతో పాటు పనుల్లో కూడా అవతకవకలకు అవకాశం ఉండదని కొందరు పేర్కొంటున్నారు. కార్యదర్శుల పర్యవేక్షణ.. ప్రభుత్వం నిధుల ఖర్చుపై ఎప్పటికప్పుడు ఆడిట్ చేయాలని, చేయకపోతే కార్యదర్శిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అదే విధంగా సమావేశాల తీర్మాణాలను కూడా నోటీస్ బో ర్డుపై ఉంచాల్సి ఉంటుంది. లేఅవుట్లు, భవన ని ర్మాణాల అనుమతులకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. తద్వారా పనులు గడువులోపు పూర్తికావడంతో పాటు గ్రామ పంచాయతీకి కూడా ఆదాయం వచ్చేఅవకాశం ఉంది. -
బదిలీలకు వేళాయె..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇక బదిలీల పర్వం ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయడం రివాజుగా వస్తోంది. అయితే రాష్ట్రంలో వరుస ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో బదిలీల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే సమయంలో ఒకేచోట ఎక్కువ కాలం నుంచి పని చేస్తున్న అధికారులను ఎన్నికల నియమావళి ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత కోడ్ ముగియగానే సదరు అధికారులను యథావిధిగా జిల్లాలకు బదిలీ చేయడం జరుగుతోంది. అయితే వరుస ఎన్నికలు రావడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన పోలీస్, రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్ అధికారులు తాత్కాలికంగా బదిలీ అయిన స్థానాల్లోనే నిరవధికంగా ఉండాల్సి వచ్చింది. అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికలు పూర్తి కావడంతో ప్రభుత్వం ఉద్యోగులు, అధికారుల బదిలీలపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాకు ఎన్నికల సమయంలో వచ్చిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ జిల్లాలకు వెళ్లేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన జిల్లాకు కేటాయించిన తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఆయా అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో బదిలీల ప్రక్రియ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ మార్గాల ద్వారా ప్రయత్నాలు.. ఇక సుదీర్ఘకాలంగా జిల్లాలో విధులు నిర్వహించిన రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ ఉద్యోగులు సైతం ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. వీరిలో అనేక మంది సొంత జిల్లాకు రావడానికి తమకున్న రాజకీయ మార్గాల ద్వారా విపరీత ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయిన పోలీస్ అధికారులు కూడా తిరిగి జిల్లాలో ఫలానా ప్రాంతానికి వస్తారని, ఫలానా పోస్టింగ్ పొందుతారని ఇప్పటికే ప్రచారం జరుగుతుండడం విశేషం. తహసీల్దార్ స్థాయి అధికారులకు సంబంధించి సైతం ఇదే తరహా ప్రచారం కొనసాగుతోంది. ఇక ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన తహసీల్దార్లలో అనేక మంది పాలనా వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నం కాకపోవడం, కేవలం ఎన్నికల విధుల పట్లనే దృష్టి సారించి భూ సంబంధ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పలు మండలాల్లో రెవెన్యూపరమైన పాలన మందకొడిగా కొనసాగుతోందనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు అర్హతకు సంబంధించి రెవెన్యూ పరంగా జరగాల్సిన ప్రక్రియకు సంబంధించి రైతులు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా.. భూ పరమైన అర్జీలను పరిష్కరించాలని కోరినా.. అంటీముట్టనట్లుగా వ్యవహరించారనే విమర్శలు పలు మండలాల్లో వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల వ్యవహారం పూర్తిగా ముగియడంతో ప్రభుత్వం పాలనాపరమైన వ్యవహారాలపై దృష్టి సారించి అధికారులు, ఉద్యోగులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2016లో జిల్లా విభజన సమయంలో అధికారుల బదిలీలు చేపట్టారు. అనేక మంది జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆర్డర్ టూ సర్వ్ ప్రకారం బదిలీ చేశారు. కొద్దినెలలు అక్కడ పని చేసిన అనంతరం మళ్లీ ఖమ్మం వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. అయితే మూడేళ్లు గడుస్తున్నా బదిలీలు జరగలేదు. అనంతరం ఎన్నికల సమయంలో కొన్ని బదిలీలు చేశారు. సాధారణ బదిలీలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అనేక మంది తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీపీ బదిలీ? ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సీపీ బదిలీ అవుతారనే ప్రచారం జరగ్గా.. ఎందుకనో నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ ముగియడంతో సీపీ బదిలీ అవుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఆయన బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు దాటడంతో బదిలీ అనివార్యమని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. అలాగే ఖమ్మం నూతన సీపీగా గతంలో భద్రాచలం అడిషనల్ ఎస్పీగా పనిచేసి.. ప్రస్తుతం రాచకొండలో డీసీపీగా పనిచేస్తున్న ప్రకాష్‌రెడ్డి, కొత్తగూడెం ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న అంబర్ కిషోర్‌ఝా, అదేవిధంగా ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. భారీగా పోలీస్ అధికారుల బదిలీలు? జిల్లాలో భారీ ఎత్తున పోలీస్ అధికారుల బదిలీలు అతిత్వరలోనే జరుగుతాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలికంగా పలు పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న అధికారులు వరుసగా ఎన్నికలు రావడం, కోడ్ అమలులో ఉండడంతో వారి బదిలీలు నిలిచిపోయాయి. కోడ్ ముగియడంతో భారీ ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నగరంలో ఒకరిద్దరు సీఐలు, రూరల్‌లో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలు, అదే విధంగా వైరా సబ్ డివిజన్లో పలువురు ఎస్సైలు, సీఐలకు స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు లూప్లైన్లో ఉన్న అధికారులు సైతం మంచి పోస్టింగ్‌ల కోసం రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు సైతం ఉత్తర తెలంగాణలో వేరే జిల్లాలకు బదిలీ చేయించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి వచ్చిన సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమతమ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. అక్కడ పనిచేస్తూ ఎన్నికల ముందు ఇక్కడకు వచ్చిన కొందరు మాత్రం జిల్లాలోనే ఉండిపోవడానికి రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కావడంతో త్వరలోనే బదిలీలు జరుగుతాయని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. -
తెలుగుకు పట్టం కట్టండి
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తెలుగు భాషకు పట్టం కట్టాలని, అందులో భాగంగా నేటి నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్న దృష్ట్యా ప్రతి స్కూల్లో పిల్లలు తెలుగు భాషను తప్పనిసరి నేర్చుకునేవిధంగా ప్రోత్సహించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకూ తెలుగును తప్పనిసరిగా చదవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఎస్సీఈఆర్టీతో కలసి తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త కార్యాచరణ చేపట్టింది. గతేడాది నుంచి అన్ని స్కూళ్లలో తెలుగు అమలు దిశగా రెండు సంస్థలు దృష్టి సారించాయి. తెలంగాణ ప్రజల భాష, సాహిత్యం, చారిత్రక, సాంస్కృతిక జీవితం ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలనే లక్ష్యంతో తెలుగును తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఆ లక్ష్యం అన్ని పాఠశాలలకు చేరుకునేవిధంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు పిల్లలకు తెలుగు నేర్పించే ఉపాధ్యాయుల కోసం ఎస్సీఈఆర్టీతో కలిసి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను, వర్క్‌షాపులను నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘తెలుగు తప్పనిసరి’కి అడుగులు ఇలా ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని భావించింది. కానీ ఇంటర్మీడియెట్ స్థాయిలో అమలుపై భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. తమిళనాడులో పదో తరగతి వరకే తమిళం తప్పనిసరి భాషగా అమలు కావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కూడా ఒకటి నుంచి పదోతరగతి వరకు పరిమితం చేశారు. తెలుగు భాషేతరుల కోసం ఎస్ఈఆర్టీ గతేడాది ఒకటి, ఆరోతరగతి పాఠ్యపుస్తకాలను ముద్రించి అందజేయగా, ఈ ఏడాది రెండు, ఏడో తరగతులకు కూడా అందజేశారు. ‘‘తెలుగు అమలు తీరును పర్యవేక్షించేందుకు గతేడాది నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాం, కొన్ని స్కూళ్లు మినహా చాలా వరకు తెలుగును తప్పనిసరి చేశాయి. కేంద్రీయ విద్యాలయ వంటి విద్యాసంస్థల్లో మాత్రంపై అధికారుల ఆదేశాలకు అనుగుణంగా అమలు చేయనున్నట్లు చెప్పారు’’అని సిధారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాల్లో ఏముంది? హిందీ, కన్నడం, తమిళం, మరాఠీ వంటి ఇతర మాతృభాషల విద్యార్థులు కూడా తెలుగు నేర్చుకొనేందుకు వీలుగా వర్ణమాల, గుణింతాలు, ఒత్తులు, చిన్న చిన్న పదాలతో పుస్తకాలను ముద్రించారు. ఏడో తరగతి స్థాయిలో చిన్న చిన్న గేయాలను పరిచయం చేశారు. తెలంగాణ సంస్కృతి, పండుగలు, ఆచార సాంప్రదాయాలు, తెలంగాణ కళలను కూడా పరిచయం చేయనున్నట్లు సిధారెడ్డి తెలిపారు. 2023 నాటికి ఒకటి నుంచి పదో తరగతి వరకు పూర్తిస్థాయిలో తెలుగు అమలులోకి వస్తుందన్నారు. ‘‘తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పించడాన్ని ఒక బాధ్యతగా భావించాలి. ఏ ప్రాంతం వారైనా సరే ఇక్కడి వారైనప్పుడు ఈ ప్రాంత ప్రజల భాషలోనే మమేకం కావడం వల్ల మానవసంబంధాలు బలపడు తాయి. అందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీ స్కూళ్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేసేందుకు సిద్ధంగా ఉంది’’అని చెప్పారు. -
ఇక స్థానికం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): లోక్‌సభ ఎన్నికలు ఈనెల 11న ముగిశాయి. ఇక ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికల వంతు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఈనెల 22న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు శనివారం డ్రాఫ్ట్ షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యుల స్థానాల పునర్విభజన ప్రక్రియతోపాటు రిజర్వేషన్లను సైతం ఖరారు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీలు 71, ఎంపీటీసీ స్థానాలు 805 ఉన్నాయి. వీటి పదవీ కాలం జూలై 4వ తేదీతో ముగియనుంది. అంతలోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేలా కార్యాచరణకు సంసిద్ధులయ్యారు. ఈనెల 20న పోలింగ్ స్టేషన్లు ఫైనల్ కానున్నాయి. ఈ వెంటనే ఎన్నికల నోటిపికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడతలో 22వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. వచ్చే నెల 6న పోలింగ్ ఉంటుంది. 26న రెండో విడత నోటిఫికేషన్ వెలువడనుండగా మే 10న పోలింగ్ జరుగుతుంది. ఈనెల 30న మూడో విడత నోటిఫికేషన్ జారీ చేయనుండగా మే 14న పోలింగ్ ఉంటుంది. ఈ మూడు విడతల ఫలితాలను 18న ప్రకటించనున్నారు. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాపంగా 20,96,269 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,50,160 పురుషులు, 10,46,078 మహిళలు, ఇతరులు 31 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 805 ఎంపీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలు 805 ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 441 పం చా యతీలకుగాను 184 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డా యి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 453 పంచాయతీలు ఉంటే 212 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. వనపర్తి జిల్లాలో 255 గ్రామ పంచాయతీలకు గాను 128 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 పంచాయతీలకుగాను 141 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి. నారాయణపేట జిల్లాలో 280 గ్రామపంచాయతీలకుగాను 140 స్థానాలు ఉన్నాయి. జిల్లా పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లాలో 982 స్థానాలు ఉండేవి. ప్రస్తుతం 805 స్థానాలకు తగ్గాయి. 71 జెడ్పీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 71 జెడ్పీటీసీలు స్థానాలు ఏర్పాడ్డాయి. గతంలో 64 జెడ్పీటీసీలు ఉండగా జి ల్లాల పునర్విభజన సమయంలోనే 20 కొత్త మం డలాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీం తో ప్రతి మండల ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక జెడ్పీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో... ముసాపేట రాజాపూర్, గండీడ్ (రంగారెడ్డి నుంచి పాలమూరు జిల్లాలో క లిసింది); జోగుళాం గద్వాల జిల్లాలో ఉండవెల్లి, రాజోళి, కేటీదొడ్డి; నాగర్‌కర్నూల్ జిల్లాలో పెంట్లవెల్లి, ఊరకొండ, చారకొండ, పదర; నారాయణ పేట జిల్లాలో కృష్ణ, మరికల్; రంగారెడ్డి జిల్లాలో క డ్తాల్, నందిగామ, చౌదర్‌గూడ; వనపర్తిలో రేవల్లి, శ్రీరంగాపూర్, చిన్నంబావి, మదనాపూర్, అ మరచింత మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటికి అధికారులు జెడ్పీటీసీ స్థానాలుగా గుర్తించారు. 3 జిల్లాల్లో రెండు విడతల్లో ఎన్నికలు మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడుతలో నవాబ్‌పేట, జడ్చర్ల, భూత్పూర్, గండీడ్, మిడ్జిల్, బాల్నగర్, రాజాపూర్ మండలాలు ఉన్నాయి. రెండవ విడతలో మహబూబ్‌నగర్, అడ్డాకుల, దేవరకద్ర, కోయిల్‌కొండ, చిన్నచింతకుంట, ముసాపేట, హన్వాడ మండలాలు ఉన్నాయి. నారాయణపేట జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు మండలాలు ఉన్నాయి. రెండో విడతలో మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, ఊట్కూర్ మండలాలు ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో ధరూరు, కేటీదొడ్డి, గట్టు, మల్దకల్, గద్వాల; రెండో విడతలో అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి, రాజోళి, అయిజ మండలాలు ఉన్నాయి రెండు జిల్లాలో మూడు విడతల్లో.. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి జిల్లాకు సంబంధించి మొదటి విడతలో వనపర్తి, గోపాల్పేట, రేవల్లి, ఖిల్లాఘనపూర్; రెండో విడతలో పెద్దమందడి, కొత్తకోట, మాదనపూర్, ఆత్మకూర్, అమరచింత; మూడో విడతలో శ్రీరంగాపూర్, పెబ్బేరు, చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్ మండలాలు ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో లింగాల, అమ్రాబాద్, బల్మూర్, పదర, అచ్చంపేట, ఉప్పునుంతల, వంగూరు, చారగొండ; రెండో విడతలో వెల్దండ, కల్వకుర్తి, ఊర్కొండ, తాడూరు, తెల్కపల్లి; మూడో విడతలో తిమ్మాజీపేట, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, కోడేరు, పెంట్లవెల్లి, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాలు ఉన్నాయి. ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో భాగంగా ఈనెల 14న జెడ్పీ హాల్లో ఆర్ఓ, ఏఆర్ఓలకు ఎన్నికల శిక్షణ ఇచ్చారు. అలాగే 15న మండల కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 19న కలెక్టర్, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఎన్నికలను బాధ్యతాయుతంగా నిర్వహించాలి జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఎన్నికల నోడల్అధికారి సుచరిత ఆదేశించారు. ఆదివారం స్తానిక జెడ్పీ హాల్లో ఆర్ఓ, ఏఆర్ఓలకు ఎన్నికల శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేదాక అన్ని జాగ్రత్తగా నిర్వహించాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల ఫలితాలను వెల్లడించే వరకు ఆర్ఓ, ఏఆర్ఓలు కీలంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. జెడ్పీటీసీ నామినేషన్లు ఆయా మండలాల్లో స్వీకరించనున్నట్లు, ఎంపీసీటీ నామినేషన్లు క్లస్టర్లలో స్వీకరించనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ నామినేషన్లు ఆర్ఓలు, ఎంపీటీసీ నామినేషన్లను ఏఆర్ఓలు స్వీకరించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుందని, ఏమైనా అనుమానాలు వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ పద్మజా, ఎంపీడీఓలు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, సిబ్బంది పాల్గొన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా సిద్ధమే ఉమ్మడి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఓటర్ జాబితా, రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేశాం. ఈనెల 20న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల చేస్తాం. – వసంతకుమారి, జెడ్పీ సీఈఓ, మహబూబ్‌నగర్ -
భగీరథ.. దాహం తీర్చే
సాక్షి, కల్వకుర్తి: వేసవి వస్తే చాలు పల్లెలు, పట్టణాలని వ్యత్యాసం లేకుండా తాగునీటికి కష్టాలు ఉండేవి. మహిళలు బిందెలు పట్టుకొని వ్యవసాయ పొలాలలోని బోర్ల వద్దకు పరుగులు తీసేవారు. ప్రభుత్వం లీజ్బోర్లు, ట్యాంకర్లతో సరఫరా చేస్తూ రూ.కోట్లు వ్యయం చేసేది. ఎన్ని సమీక్షలు పెట్టినా నిధులు నీళ్ల వ్యయం చేసినా నీటి కష్టాలు మాత్రం తీరేవి కావు. ప్రజలు నీటి బిందెలు పట్టుకొని ధర్నాలు సైతం చేసేవారు. ప్రతి గ్రామ సర్పంచ్‌కి అధికారులకు ఈ సమస్య పెద్దతలనొప్పిగా మారేది. ప్రస్తుతం అంతా మారిపోయింది. సీఎం కేసీఆర్ బృహత్తరమైన ఆలోచన తాగునీటి ఎద్దడికి శాశ్వతమైన పరిష్కారం చూపింది. మిషన్ భగీరథతో అ న్ని చోట్ల తాగునీటి కటకటకు పుల్‌స్టాప్ పడింది. వేసవిలో సైతం దాహం తీరి నీటి కష్టాలు తొలిగాయి. 35 గ్రామాలకు సరఫరా మండలంలోని 35 గ్రామాలకు భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అన్ని చోట్ల అవసరాన్ని గుర్తించి కొత్తగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు మం జూరు చేశారు. కొన్ని చోట్ల ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. మిగతా చోట్ల నిర్మాణంలో ఉన్నా యి. నిర్మాణం పూర్తయిన గ్రామాలు సుద్దకల్, గుండూరు, తాండ్ర, పంజుగుల్, సత్యసాయికాలనీలో కొత్త ట్యాంకులకు నీరు ఎక్కించి గ్రామాల్లో సరఫరా చేస్తున్నారు. మిగతా గ్రామాల్లో పాత ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి ఇళ్లలోకి సరఫరా చేస్తున్నారు. దాదాపు పెద్దగ్రామాలకు రోజు ల క్ష లీటర్ల చొప్పున సరఫరా చేస్తుంటే చిన్న గ్రామాలకు 50వేల లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. వేసవిలో సైతం ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో.. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భజలాలు ఏటా గణనీయంగా పడిపోయి మున్సిపల్ బోర్లే కాదు, ఇళ్లలో ఉండే బోర్లు సైతం ఎండిపోయాయి. దీంతో కల్వకుర్తి పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. అంతే కాకుండా దాదాపు 40వేల జనాభా ఉండడంతో నీటి సమస్య జఠిలంగా ఉండేది. దీంతో మున్సిపల్లో కొన్నేళ్ల నుంచి నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారానే చేస్తున్నారు. నీటి సరఫరాకు రోజు రూ.లక్ష ట్యాంకర్లకే ఖర్చు పెట్టేవారు. సమస్య తీరేది కాదు. ప్రజలు ఎవరింటికి వారు ట్యాంకర్ల ద్వారా పోయించుకునే వారు. నాలుగేళ్లలో ట్యాంకర్ల కోసం రూ.మూడు కోట్లపైనే వ్యయం చేశారని అంచనా. ఇక భగీరథ వచ్చిన తర్వాత పట్టణానికి నిత్యం 40లీక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాత ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. వేసవి వస్తే రోడ్లపై, కాలనీలో ట్యాంకర్ల చప్పుడే ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. ఒక్కరోజు తప్పించి మరోరోజు నీటి సరఫరా అవుతుండడంతో పట్టణంలో వేసవిలో సైతం నీటి సమస్య లేకుండా ఉండడంతో ప్రజలు చాలా సంతోష పడుతున్నారు. వేసవి కాలం అంతా.. సరఫరా మరో రెండు నెలల పాటు వేసవి ఉంటుం ది. భగీరథ నీరు వేసవిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయనున్నామని మిషన్ భగీరథ ఈఈ పు ల్లారెడ్డి తెలిపారు. దీంతో ఇక వేసవిలో నీటి సమస్య రాదు. గ్రా మాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్లే. వేసవిలో సరఫరా చేస్తే ఇక వర్షాకాలం నల్లేరుమీద నడకలాంటిందే. -
‘పరిషత్’ ఎన్నికలకు సన్నద్ధం
ఆదిలాబాద్‌అర్బన్: ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త మండలాల వారీగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ), మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ)ల సంఖ్య ఖరారు కావడంతో ‘జిల్లా పరిషత్’ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణ వంటివి వెనువెంటనే చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొన్నటి వరకు కొత్త జిల్లాలు, కొత్త మండలాల వారీగా జిల్లా, మండల పరిషత్‌లు ఏర్పాటు చేసిన అధికారులు తాజాగా ఎంపీటీసీల పునర్విభజనను సైతం పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో గతంలో 636 ఎంపీటీసీ స్థానాలుండగా ప్రస్తుతం 567కు తగ్గింది. మున్సిపాలిటీల్లో సమీప పంచాయతీలను విలీనం చేయడంతో 69 ఎంపీటీసీ స్థానాల తగ్గింపునకు ఆస్కారం ఏర్పడింది. కొత్త మండలాల ప్రకారం ఎంపీటీసీ స్థానాలపై అభ్యంతరాలను అధికారులు ఈ నెల 22 వరకు స్వీకరించి 25న తుది జాబితా విడుదల చేశారు. ఆ జాబితాను జిల్లా యంత్రాంగం మంగళవారం ఉదయం ప్రభుత్వానికి పంపించింది. అయితే నాలుగు జిల్లాల పరిధిలో ప్రస్తుతం 567 ఎంపీటీసీ స్థానాలు, 67 ఎంపీపీలు, 67 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటికి మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. మార్చిలో ఓటరు జాబితా తయారీ.. నూతన పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారవుతున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలో 66 గ్రామీణ మండలాలను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలుగా (అర్బన్ మండలాలు మినహా) పరిగణిస్తున్నారు. ఆ మేరకు నాలుగు జిల్లా పరిషత్‌లు, 66 మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడుతున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన సభ్యుల పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది జూలై 4తో ముగియనుంది. ఆలోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలను సిద్ధంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్చి చివరిలోగా బూత్‌లు, వార్డులు, గ్రామాల వారీగా ఓటరు జాబితా సిద్ధం కానుంది. ఇది వరకే అసెంబ్లీ, సర్పంచ్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ‘పరిషత్’ ఓటర్ల జాబితా తయారీకి మార్గం సులువైందని చెప్పవచ్చు. అయితే మరోమారు ఓటరు జాబితాలో సవరణలు చేసి తుది జాబితాను రూపొందించి మార్చి నెలాఖరులోగా ఓటరు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. మార్చిలో రిజర్వేషన్లు..మేలో ఎన్నికలు? నిర్దేశించుకున్న గడువులోగా జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరపాలంటే ఆయా స్థానాలకు కేటాయించే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కీలకం. ప్రభుత్వ అనుమతి, ప్రస్తుతం జరుగుతున్న హడావుడిని చూస్తే మార్చిలో ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలోని 1,725 గ్రామీణ ప్రాంతాల్లోని హ్యాబిటేషన్లలో 19,80,980 మంది జనాభా ఉంది. ఇందులో పురుషులు 9,85,303 మంది ఉండగా, మహిళలు 9,95,677 మంది ఉన్నారు. కొత్త పీఆర్ చట్టానికి అనుగుణంగా, 2011 జనాభా లెక్కల ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. మొన్న జరిగిన ఎంపీటీసీల పునర్విభజనలో 3,500 నుంచి 4 వేలలోపు జనాభా కలిగి ఉంటే ఒక ఎంపీటీసీ స్థానంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక పీఆర్ మండలాల ప్రకారం ఎంపీపీ, జెడ్పీటీసీలు ఉంటారు. ఈ సారి ఖరారయ్యే రిజర్వేషన్ పదేళ్ల పాటు కొనసాగనుంది. ఈ ప్రక్రియనంతటినీ లోక్‌సభ ఎన్నికల్లోగా పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దాన్ని బట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సమయానుకూలంగా మే నెల రెండో వారంలో లోక్‌సభ ఎన్నికలు ముగిస్తే.. మే నెలాఖరులో లేదా జూన్ మొదటి, రెండో వారంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. -
నేటి నుంచి సభాపర్వం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త శాసనసభ గురువారం కొలువుదీరనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారిగా భేటీ అవుతున్న ఈ సభలో మన జిల్లా నుంచి ఎనిమిది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014లో 14 మంది శాసనసభ్యులుండగా.. జిల్లాల పునర్విభజనతో ఈ సంఖ్య కుచించుకుపోయింది. ఇందులో కల్వకుర్తి ఎమ్మెల్యే అటు నాగర్‌కర్నూలు, ఇటు రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదిలాఉండగా, కేవలం సభాపతి, ఉప సభాపతి ఎంపిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలకే పరిమితం చేసిన ఈ సమావేశాల్లో.. ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం లేదు. కాగా, జిల్లా నుంచి గెలుపొందిన శాసనసభ్యులంతా పాత కాపులే కావడం గమనార్హం. గత ఎన్నికల్లో ఓడిపోయిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ ఈసారి విజయం సాధించగా.. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి కూడా తాజా ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. దీంతో జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు పాత ముఖాలేనని చెప్పుకోవచ్చు. అయితే, శాసనసమండలి సమావేశాల్లో మాత్రం మన జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇరువురు సభ్యులు దూరమయ్యారు. స్థానిక సంస్థల కోటాలో గెలుపొందిన నరేందర్‌రెడ్డి.. కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అలాగే, ఎన్నికల వేళ పార్టీ ఫిరాయించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ రెండు పోస్టులకు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. -
మహమూద్ అలీ అనే నేను..
సాక్షి,సిటీబ్యూరో: మహమూద్ అలీ.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రిగా సేవలందించారు. అంతకుమించి సీఎం కేసీఆర్‌కు ఆత్మీయుడు. కష్టాలు, నష్టాల్లోనూ నమ్మిన నేత వెంటే అలీ పయనించారు. కేసీఆర్ అంటే ఆయనకు అమితమైన అభివానం, గౌరవం. కేసీఆర్‌కు సైతం మహమూద్ అలీ అంటే ఎంతో ఇష్టం. అందుకే గురువారం తనతో పాటు మంత్రిగా మహమూద్ అలీని ఎంచుకున్నారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే పార్టీలో చేరిన అలీ.. పార్టీ సిటీ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర మైనారిటీ సెల్ చైర్మన్‌గా సేవలందించారు. ఆపై 2002లో ఆజంపురా కార్పొరేటర్‌గా, 2009లో సికింద్రాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై కేసీఆర్ కేబినెట్లో రెవెన్యూశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలీ సారథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ వంటివి దిగ్విజయంగా చేపట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పాల వ్యాపారంలో ఉన్న మహమూద్ అలీ, ఆజంపురాలోని తన నివాసంలో 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కోసమే ఒక ప్రత్యేక కుర్చీని వేయించారు. అక్కడ ఎన్ని పార్టీ సమావేశాలు జరిగినా.. ఎంతటి ప్రముఖులు వచ్చినా ఆ కుర్చీలో ఇప్పటి దాకా కేసీఆర్ తప్ప మరెవరినీ ఆసీనులు కాకుండా చూడటం విశేషం. తన అభిమాన నేత అక్కడే ఉన్నట్టుగా అలీ భావించడం ప్రత్యేకమైన అంశం. నమ్మకాన్ని వమ్ము చేయను: అలీ అత్యంత విశ్వాసంతో సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని రాష్ట్ర నూతన మంత్రిగా ప్రమాణం చేసిన మహమూద్ అలీ స్పష్టం చేశారు. గురువారం తనను అభినందించేందుకు భారీగా వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాలను మరింత విస్తృతం చేసే ప్రక్రియలో తనకు భాగస్వామ్యం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. -
ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు విభజన ఇక ఎంతమాత్రం జాప్యం కావడానికి వీలులేదని తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, విభజన జరగాల్సిందేనని కేంద్ర న్యాయశాఖ తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌లు వాదించారు. ఏపీలో హైకోర్టు భవన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా..ఇంకా నిర్మాణాలు పూర్తి కాలేదని కేంద్రం తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు రెండు ప్రతిపాదనలు పెట్టింది. ప్రస్తుత హైకోర్టు భవనంలో ఖాళీగా ఉన్న 24 హాళ్లలో ఏపీకి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునని,..లేదంటే రెండో ప్రత్యామ్నాయంగా ప్రస్తుత హైకోర్టు భవనాన్ని తాము ఖాళీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు విభజన ఆలస్యం కావడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, న్యాయమూర్తుల్లో 40 శాతం ఉండాల్సిన తెలంగాణ వాటా కూడా లేదని కోర్టుకు తెలిపింది. కేసు వాదనల సమయంలో ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది గైర్హాజయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. -
గడువులోపు పంచాయతీ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : నిర్ణీత గడువులోగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 25లోపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంత్రి జూపల్లి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, పూర్తి పారదర్శకంగా, నిర్ణీత గడువులోపు ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ బీసీ ఓటర్ల గణన పూర్తి కావచ్చిందని, గత ఎన్నికల తరహాలోనే ఈసారీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వివరించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 1,170 పంచాయతీలను, షెడ్యూల్ ఏరియాలోని 1,300 గ్రామ పంచాయతీలను ఎస్టీలకే రిజర్వు చేసినట్లు తెలిపారు. ప్రతి కేటగిరీలోనూ 50 శాతం పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయన్నారు. గ్రామం యూనిట్‌గా వార్డ్ మెంబర్‌కు, మండలం యూనిట్‌గా సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజాప్రతినిధులకు మూడు నెలలపాటు కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు ట్యాబ్‌లు.. గ్రామ స్థాయిలో మహిళా సంఘాల కార్యకలాపాలు పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు వీలుగా ట్యాబ్లెట్ పీసీలను అందజేస్తున్నామని జూపల్లి తెలిపారు. స్త్రీనిధి బ్యాంకు ఆధ్వర్యంలో గ్రామ మహిళా సంఘాలకు మంత్రి గురువారం ట్యాబ్లెట్ పీసీలను అందజేశారు. మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేస్తున్నామని, ట్యాబ్లెట్ పీసీలతో రుణాల కోసం గ్రామం నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. ఆధార్, ఐరిస్ ధ్రువీకరణ సౌకర్యం సైతం ట్యాబ్లెట్ సీపీల్లో పొందుపరచవచ్చన్నారు. ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీ చెల్లింపులు సైతం విలేజ్ ఆర్గనైజేషన్ల(వీవో) ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవో పౌసమిబసు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నర్సరీలపై సదస్సులు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దీని కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు జూపల్లి తెలిపారు. నర్సరీల ఏర్పాటు, మొక్కలు నాటడం, సంరక్షణ లాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు జూన్ 25 నుంచి జూలై 10 వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాథమిక గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని జనాభా, విస్తీర్ణం ప్రాతిపదికన కనీసం 20 వేల నుంచి లక్ష మొక్కల సామర్థ్యంతో నర్సరీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు. -
రాష్ట్రానికి కొత్త ‘చూపు’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కంటిచూపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారిని గుర్తించి, తగిన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ కంటి వెలుగు’ పేరిట బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కంటిచూపు సమస్యలు లేని రాష్ట్రమే లక్ష్యంగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ పరీక్షలతో దృష్టి లోపాలను, అందుకు కారణాలను గుర్తించడంతోపాటు.. ఉచితంగా కళ్లద్దాలను, వైద్యసేవలను, మందులను అందించేం దుకు ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన వారికి శస్త్రచికిత్సలను చేయించేలా చర్యలు చేపడుతోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ‘రైతు బంధు’ చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తికాగానే.. ఈ నెలాఖరులోనే ‘తెలంగాణ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని మొదలుపెట్టనుంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లన్నీ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను ఆదేశించింది. కార్యక్రమం అమలు కోసం రూ.106 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు కార్యక్రమం మార్గదర్శకాలను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాలు, వార్డుల్లో క్యాంపులు.. ‘తెలంగాణ కంటి వెలుగు’పేరుతో సమగ్ర సర్వే తరహాలో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో.. నగర, పట్టణ ప్రాంతాల్లోని వార్డులలో వైద్య పరీక్షల కోసం క్యాంపులు నిర్వహిస్తారు. ప్రతి క్యాంపులో నిర్వహించిన వైద్య పరీక్షల సమగ్ర సమాచారాన్ని పూర్తిగా కంప్యూటరీకరణ చేస్తారు. తదుపరి స్థాయి వైద్యపరీక్షల కోసం, చికిత్స అందించేందుకు తోడ్పడేలా ఈ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. కళ్లద్దాలు.. శస్త్రచికిత్సలు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని రకాల దృష్టి లోపాలను గుర్తించేలా చర్యలు చేపడతారు. క్యాటరాక్ట్, గ్లకోమా, కార్నియా సమస్యలు, డయాబెటిక్ రెటినోపతి, విటమిన్ ‘ఏ’లోపం, ఇతర సాధారణ ఇన్ఫెక్షన్లు వంటి వాటిని నిర్ధారిస్తారు. చూపుపరమైన సమస్యలున్న అందరికీ వైద్యసేవలు అందేలా చర్యలు చేపడతారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేస్తారు. క్యాటరాక్ట్, గ్లకోమా, రెటినోపతి, కార్నియా లోపాలు తదితర సమస్యలున్న వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. పది మందితో బృందాలు.. మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలో పది మందితో కూడిన బృందం కంటి పరీక్షల క్యాంపును నిర్వహిస్తుంది. ఇందులో ఒక మెడికల్ ఆఫీసర్‌తోపాటు ముగ్గురు మల్టీపర్పర్ హెల్త్ సూపర్వైజర్లు (మహిళా/పురుషులు), కంటి వైద్య సహాయకుడు, ఫార్మాసిస్టు, ముగ్గరు ఆశ వర్కర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. ప్రతి వైద్య బృందానికి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను, యంత్రాలను, మందులను వైద్యారోగ్య శాఖ సమకూరుస్తుంది. రూ.106.83 కోట్లు మంజూరు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమం అమలవుతుంది. ఈ శాఖ ప్రతిపాదనల ప్రకారం కార్యక్రమానికి అవసరమైన రూ.106.83 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో రూ.84.01 కోట్లను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి, రూ.42 కోట్లను జాతీయ ఆరోగ్య మిషన్ నిధుల నుంచి కేటాయించింది. మొత్తం మంజూరైన నిధుల్లో తొలి విడతగా రూ.42 కోట్లను విడుదల చేసింది. ‘కంటి వెలుగు’పథకం అంచనాలివీ.. కంటి పరీక్షలు నిర్వహించే జనాభా: 3.5 కోట్లు అవసరమయ్యే కళ్లద్దాలు: 41,05,808 ప్రాథమిక వైద్యసేవలు అవసరమయ్యేవారు: 77,768 రెండో దశ వైద్యసేవలు అవసరమయ్యేవారు: 3,31,178 ఆస్పత్రిలో వైద్యసేవలు అవసరమయ్యేవారు: 14,283 -
కాళేశ్వరం సందర్శనకు పర్యాటక ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించేందుకు భారీగా జనం తరలివెళ్తున్న నేపథ్యంలో టూరిజం శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటక ప్రాంతాల ప్యాకేజీలో భాగంగా కాళేశ్వరం ప్యాకేజీని డిజైన్ చేసింది. హైదరాబాద్ నుంచి నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించే పర్యాటకులకు వీలుగా ఒకరోజు ప్యాకేజీని రూపొందించింది. ఈ మేరకు కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఎండీ మనోహర్ లేఖ రాశారు. టూర్ ప్యాకేజీలో భాగంగా సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్‌హౌజ్, ప్యాకేజీ–6లోని టన్నెళ్లను సందర్శించేందుకు అనుమతి కోరారు. తమ వినతిపై వీలైనంత త్వరగా తమకు అనుమతులు ఇవ్వాలని విన్నవించారు. రెండు లక్షల మంది సందర్శకులు..: ప్రాజెక్టును ఇప్పటివరకు రెండు లక్షల మంది సందర్శించినట్లు నీటి పారుదల వర్గాల అంచనా. కేంద్ర జల సంఘం ఇంజనీర్లు, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్, టీఎస్పీఎస్సీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఎన్ఆర్ఐ బృందాలు ప్రాజెక్టును చూసొచ్చాయి. ఇక కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో కార్పొరేటర్లు, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, గొంగిడి సునీత, గణేశ్ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి నేతృత్వంలో వందల సంఖ్యలో రైతులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వచ్చి ప్రాజెక్టును సందర్శించారు. సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో ప్రత్యేక ప్యాకేజీ టూర్‌ను నిర్వహించేందుకు పర్యాటక శాఖ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. -
పూసలతల్లికి స్థిరజీవితమొద్దా?
సమాజాన్ని సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దుతున్న జీవితాలు మాత్రం విషాదంగా ఉన్నాయి. తరతరాలుగా అలంకృత వస్తువులను విక్రయిస్తున్న పూసల తల్లుల బతుకు చిత్రం మారటమే నూతన రాష్ట్రంలో జరగాల్సింది. గంపలో పెట్టుకున్న వస్తువులు వారి వ్యాపారం. ‘గంప’ తరతరాలుగా వాళ్లకు తిండిబెట్టే జీవనాధారం. ‘గంప’ నెత్తిన పెట్టుకుని ఊరూరా తిరుగుతూ సరుకులను అమ్ముకుంటూ వచ్చిన నాలుగురాళ్లతో తరతరాలుగా కుటుంబాలను గడుపుతున్న వాళ్లు పూసల కులస్తులు. ఆడవాళ్ల అలంకార సాధనమైన చేతులకు గాజులు వేస్తూ ఆ తల్లులు ఇప్పటికీ గంపను నెత్తిన మోస్తూ సంచారం చేస్తూ కుటుం బాలను సాకుతున్నారు. మాతృస్వామిక వ్యవస్థను కొనసాగిస్తూ కుటుంబాలను పోషిస్తూ ఇప్పటికీ మిగిలి వున్న ఏకైక కులం పూసలకులం. సంచారంచేస్తూ ఊరూరా తిరుగుతున్న ఆ తల్లులు ఇంటిని దిద్దే ఇల్లాళ్లే కాదు, ఇంటిని నడిపించే ఆర్థిక రథసారథులు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో ఈ పూసల తల్లులు సామూహికంగా వందల సంఖ్యలో గంపలను నెత్తిన పెట్టుకుని ర్యాలీలు చేశారు. తెలంగాణలో ఈ కుల స్తులు 70 వేలకు పైచిలుకు ఉంటారు. ఈ కులస్తుల ఆకాంక్షలకు అనుగుణంగానే తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూసల కులస్తుల బాధలు తీర్చేందుకు ఆలోచనలు సారించారు. ఎంబీసీలు, సంచారజాతుల వారితో అనేకసార్లు సమావేశమై పూసల కులస్తులను సొంతకాళ్లపై నిలబెట్టే కసరత్తు మొదలు పెట్టారు. పూసల తల్లులు ఆడవారి అలంకృత సామానులు విక్రయిస్తారు. ఒక రకంగా వందల ఏళ్లుగా సంచారం చేస్తూ ఆడవారికి మరింత అందానిచ్చే నడుస్తున్న బ్యూటీపార్లర్లు పూసలవాళ్లు. గాజుల అమ్మకమే వీరి ప్రధానవృత్తి. గంపలో గాజులతో పాటు తాళాలు, అలంకృత సామాన్లు కూడా విక్రయిస్తారు. సమాజాన్ని సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దుతున్న ఈ పూసల కులస్తుల జీవితాలు మాత్రం విషాదంగా ఉన్నాయి. చేతి నిండా గాజులు వేసి ఇంటిల్లిపాదిని ఆనందంలో ముంచే ఆ పూసల తల్లి మాత్రం సంచారంచేస్తూ చిట్లిన గాజులుగా జీవిస్తున్నారు. తరతరాలుగా అలం కృత వస్తువులను విక్రయిస్తున్న పూసల తల్లుల బతుకు చిత్రం మారటమే జరగాల్సింది. ఊరూరా తిరిగి గాజులు అమ్మకానికి పెట్టుబడి కోసం వీళ్లు వడ్డీవ్యాపారస్తులను ఆశ్రయిస్తారు. వీళ్ల సంపాదన మొత్తం తిరిగి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కేసీఆర్ ఈ విషయానికి విరుగుళ్లు కనిపెట్టారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం చేసే విధంగా ప«థక రచన చేశారు. ఒక లక్షరూపాయల రుణమిస్తే అందులో 20 శాతం మాత్రమే లబ్ధిదారులు కట్టాలి. మిగతా రుణమంతా ప్రభుత్వమే సాయం చేస్తుంది. ఒకవేళ ఆ 20శాతం కూడా కట్టలేని స్థితి ఉన్నవాళ్లకు మాత్రం బ్యాంకులు సాయం చేస్తాయి. వాళ్లు వ్యాపారం చేసుకుంటూ ఆ 20 శాతం రుణమాఫీ చేసుకోవాల్సి ఉంటుంది. గంప నెత్తిన పెట్టుకుని పొద్దు పొడవకముందే దళిత, బీసీ వాడలకు పోయి వాళ్లను నిద్రలేపి సబ్బులు, పౌడర్లు, గాజులు, దినుసులు, పొగాకు, తాళాలు, జ్వరం వస్తే ఇచ్చే మందుగోలీలు విక్రయిస్తారు. దళిత, బీసీ వాడలకు ముందే ఎందుకు వెళతారంటే వాళ్లు పొద్దున్నే వ్యవసాయపనులకు, కూలీ పనులకు వెళతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పేదలకు మొదట సబ్బు, పౌడర్లను పరిచయం చేసింది పూసల తల్లులే. వీళ్లు బుట్టలు, గంపలు నెత్తిన పెట్టుకుని రోజులపాటు సంచారం చేస్తూ తిరుగుతారు. అంగళ్లు, జాతరలు జరిగినప్పుడు నెలల తరబడి సంచారం చేయటం వల్లనే వీరి పిల్లలు చదువులో వెనుకబడ్డారు. సిరాజుల్ హుస్సేన్ రాసిన డొమోనియన్లో కులాలు, తెగలు, వాల్యుంలో పూసల కులస్తుల పుట్టు పూర్వోత్తరాలు రాశారు. వీళ్లు ‘‘చెంచు’’ తెగకు చెందినవారు. పూసలవాళ్లు అడవులను వదిలారు. గ్రామాలలోకి వచ్చారు. కానీ ఆదిమ ఆచారాలను మాత్రం విడువలేదు. వీళ్లునివసించే ప్రదేశాలను గూడెం, మిట్ట అంటారు. ఊరిపెద్దను మిట్టగాడు అని పిలుస్తారు. ఇతని ఆజ్ఞలను అమలు చేసేవారిని ‘‘కొండిగాడు’’ అంటారని సిరాజుల్ హుస్సేన్ రాశారు. వీళ్లకు మరుగుభాష కూడా ఉంది. ఈ మరుగు భాష తెలిసిన వారిని పరదేశి గాండ్లు అంటారు. వీళ్ల కులం వాళ్లు కలుసుకున్నప్పుడు ‘‘అడిమేన్ దాసోహం’’ అని ప్రత్యేక భాషలో నమస్కారం అని చెప్పుకుంటారు. వీళ్లు గ్రామాల్లో తిరిగి స్వేచ్ఛగా వస్తువులను అమ్ముకోవటానికి నిజాం రహదారి పత్రాలు ఇచ్చేవారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా బాగా వెనుకబడివున్న వీరి కులంలో చదువుకున్న వారి సంఖ్య తక్కువగా ఉన్నది. సివిల్ సర్వీస్, గ్రూప్ వన్ ఉద్యోగులు ఈ కులం నుంచి కనిపించరు. ఈ పూసల వారి జీవన విధానాన్ని తెలి యజేస్తూ గతంలో ‘‘మేము మనుషులమే’’, ‘‘మైనర్‌బాబు’’ వంటి సినిమాలు తీశారు.రాష్ట్ర ప్రభుత్వం పూసల కులస్తులకు చేసే సహాయ పథకానికి ‘పూసలతల్లి’’ పథకంగా పెట్టాలని సీఎం కేసీఆర్‌ని కోరుతూ బీసీ కమిషన్‌కు విన్నవిం చారు. పూసల కులాలకు ఆ కులంలో మహిళలే ప్రధాన జీవన ఆధారం కాబట్టి వారికి అందించే ఆర్థిక సహాయం పథకం పేరు ‘‘పూసలతల్లి’’ అని పెట్టాలని వీరు కోరుకుంటున్నారు. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
‘తెలంగాణ కంటి వెలుగు’లు
సాక్షి, హైదరాబాద్ : కంటి చూపు సమస్యలు లేని తెలంగాణే లక్ష్యంగా సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందించేందుకుగాను ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమం చేపడుతోంది. కార్యక్రమం అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ పంపింది. కళ్లద్దాల కొనుగోలు, పరీక్షలు చేసేందుకు పరికరాలు, తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ, పరీక్ష కేంద్రాల కోసం రూ.100 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కార్యక్రమం మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ మూడో వారంలోనే కార్యక్రమం ప్రారంభించాలనుకున్నా ‘రైతు బంధు’చెక్కుల పంపిణీ నేపథ్యంలో మే మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 3.5 కోట్ల మంది కోసం ఏర్పాట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల వయస్సు వారికి ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తుండటంతో వారు మినహా రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి పరీక్షల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గ్రామాల వారీ షె డ్యూల్‌ను వైద్య, ఆరోగ్య శాఖ ఖరారు చేస్తోంది. రోగులకు ఇచ్చే మందులు, దృష్టి లోపాలున్న వారి కోసం 40 లక్షల కళ్లద్దాలు కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ కళ్లద్దాల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. దేశంలో భారీ సంఖ్యలో కళ్లద్దాలు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఫ్రాన్స్, చైనా వంటి దేశాల్లోనే ఉత్పత్తి ఎక్కువగా ఉంది. టెండర్లలో ఎంపికయ్యే కంపెనీలు తక్కువ సమయంలో కళ్లద్దాలు సరఫరా చేసేలా నిబంధనలు రూపొందించారు. బాధ్యతల పంపిణీ కంటి పరీక్షల నిర్వహణ పూర్తిగా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చూసుకుంటారు. అవసరమైన వారికి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తారు. రోగుల వివరాల నమోదు సహా అవసరమైన ఏర్పాట్లు సమకూర్చుతారు. వివరాల నమోదులో మెడికల్ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణుడికి ఏఎన్ఎం (ఎంపీహెచ్ఏ) సహాయం చేస్తారు. రక్త, మూత్ర పరీక్షలకు నమూనాలు సేకరిస్తారు. ఫార్మసిస్టు పరీక్షల నివేదికల ఆధారంగా మందులు, కళ్లద్దాలను వైద్య నిపుణులు రోగులకు ఇస్తారు. కంటి పరీక్షల శిబిరానికి గ్రామ ప్రజలను తీసుకొచ్చేలా ఆశా కార్యకర్తలు పని చేస్తారు. స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలో.. కంటి పరీక్షల నిర్వహణకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణుడు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆశా కార్యకర్తలతో బృందాలు ఏర్పాటు చేస్తోంది. నేత్ర వైద్య నిపుణులు, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ కార్యక్రమ లక్ష్యాలు, ఉద్దేశాలు వివరిస్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో స్కూళ్లు, కమ్యూనిటీ భవనాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు ఎక్కడ నిర్వహించాలో మండల స్థాయి అధికారులు నిర్ణయించనున్నారు. 43 శాతం శుక్లాల వల్లే.. మారుతున్న జీవన శైలి, పౌష్టికాహారలోపాలే దృష్టి లోపాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దశాబ్దం క్రితంతో పోల్చితే కంటి చూపు సమస్యలున్న రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయస్సు వారికి శుక్లాలు (పొర), చిన్న పిల్లల్లో పోషకాహార లోపం వల్ల దృష్టి లోపం ఏర్పడుతున్నాయి. కంటి చూపు కోల్పోయిన వారిలో 43 శాతం మంది శుక్లాల వల్లే చూపు కోల్పోయారని నిర్ధారించారు. రాష్ట్రంలోని 7 శాతం జనాభా మధుమేహం కారణంగా కంటిచూపు సమస్య (డయాబెటిక్ రెటీనోపతి)తో బాధపడుతున్నారు. వీటితోపాటు మరో 7 శాతం మంది నీటి కాసులు (గ్లకోమా)తో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో గ్లకోమా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్నవారు శుక్లాలు 43 శాతం నీటి కాసులు 7 శాతం డయాబెటిక్ రెటీనోపతి 7 శాతం బాల్యంలో అంధత్వం 4 శాతం నెలలు నిండని శిశువులకు సమస్యలు 4 శాతం చూపు మందగించడం 3 శాతం -
‘కౌలు’కు కష్టమే !
బూర్గంపాడు: పంటల సాగుకు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయంపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సర్కారు రూపొందించిన విధివిధానాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. సాయం చేసే విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు రైతులను ఆలోచనలో పడేస్తున్నాయి. పంటలు సాగు చేసేవారికి కాకుండా భూముల పట్టాదారులకే పెట్టుబడి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కౌలురైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో ఏళ్ల తరబడి పోడుభూములు సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు కూడా పెట్టుబడి సాయం అందే పరిస్థితులు లేవు. దీంతో జిల్లాలో 35వేల మందికి పైగా రైతులకు నష్టం జరిగే అవకాశాలున్నాయి. కౌలురైతులకు మొండిచేయి... పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం కేవలం భూములు పట్టాదారులకే సాయమందిస్తే... వాస్తవానికి ఆ భూముల్లో పంటలు సాగు చేసే కౌలురైతుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో 28వేల మందికి పైగా కౌలురైతులున్నారు. వీరికి సాగు పెట్టుబడులకు బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వటం లేదు. కేవలం ప్రైవేటు వడ్డీలతో సాగు చేయాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, గిట్టుబాటు ధరలు దక్కకపోవటంతో ఏటా నష్టాలే చవిచూస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ కౌలు వ్యవసాయమే చేస్తున్నారు. వరుస పంటనష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల్లో ఎక్కువమంది కౌలురైతులే కావటం గమనార్హం. ఇప్పుడు ప్రభుత్వ పెట్టుబడి సాయం కూడా ఇవ్వబోమని ప్రకటించటం వారిని మరింత కుంగదీస్తోంది. పంటలు సాగు చేసేవారికి పెట్టుబడి సాయం అందించకుండా భూములు కౌలుకు ఇచ్చి పంటలు సాగుచేయని పట్టాదారులకు పెట్టుబడి సాయం ఇస్తే లాభమేమిటని కౌలురైతులు ప్రశ్నిస్తున్నారు. తమకే సాయమందించాలని కోరుతున్నారు. కాగా, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులకు కౌలు కూడా చెల్లదని అధికారులు చెబుతున్నారు. దీంతో కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని రైతుసంఘాల నాయకులు కోరుతున్నారు. అటవీ భూములకు సాయం పూజ్యం... ఏళ్ల తరబడి పోడుభూములు సాగుచేసుకుంటూ అటవీహక్కు పత్రాలు పొందిన గిరిజన రైతులకు కూడా పెట్టుబడి సాయం అందే పరిస్థితి లేదు. అటవీ హక్కులు కలిగిన భూములను రెవెన్యూ అధికారులు సాగు పెట్టుబడి పథకంలోకి తీసుకురాలేదు. దీంతో పోడుసాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు కూడా ప్రభుత్వం మొండిచేయి చూపించే పరిస్థితి నెలకొంది. గిరిజనేతర రైతులకు భూములున్నా పట్టాహక్కులు లేక సాయం అందటం లేదు. దీంతో జిల్లాలో సగం మందికి మాత్రమే పెట్టుబడి ఖర్చులు రానున్నాయి. ఏజెన్సీలోనే సాగు అధికం.. జిల్లాలో సాగు విస్తీర్ణం ఏజెన్సీ ప్రాంతంలోనే ఎక్కువగా ఉంది. గిరిజనులు, గిరిజనేతరులు ఏళ్ల తరబడి పోగు వ్యవసాయం చేస్తున్నారు. వీరిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఐదెకరాల లోపు భూమి ఉన్నవారే మూడొంతుల మంది ఉన్నారు. గిరిజనేతర రైతులు తమకున్న ఎకరా, రెండెకరాలకు తోడు మరో నాలుగైదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తున్నారు. కేవలం పంటల సాగుపైనే వీరి జీవనం ఆధారపడి ఉంది. పోడుభూములు సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకు కూడా పదెకరాలలోపు భూములే ఉన్నాయి. వీరిలో చాలా మందికి అటవీహక్కు పత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఆ భూములకు కూడా పంట సాయం అందదని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతుల్లో కలవరం మొదలైంది. -
సేకరణపై చేతులెత్తేసిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: పంట ఉత్పత్తుల సేకరణ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. వరి, పత్తి మినహా కంది, పెసర, సోయాబీన్, మొక్కజొన్న తదితర ఉత్పత్తులను రాష్ట్రాలే కొనుగోలు చేసేలా కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టనుంది. దీంతో బీజేపీయేతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త పథకంపై విభేదిస్తూ పలు సూచనలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తోంది. సేకరణ నుంచి కేంద్రం తప్పుకుంటే దాని ప్రభావం రాష్ట్రాలపై పడుతుందని, రైతులు ఇబ్బంది పడే అవకాశముందని వ్యవసాయాధికారులు అంటున్నారు. పథకం ఉద్దేశమేంటంటే... కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కూడా లభించక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. వచ్చే బడ్జెట్లో దీన్ని వెల్లడించే అవకాశముంది. ఎఫ్‌సీఐ లేదా ఇతర సంస్థల ద్వారా వరి, గోధుమ ఉత్పత్తులను మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేసే విధానముంది. అయితే, సోయాబీన్, కంది, మినుము, పెసర, వేరుశెనగ, నువ్వులు, మొక్కజొన్న తదితర పంటలకు మద్దతుధర అమలు కావడంలేదు. ఆయా రాష్ట్రాల్లో పంటల దిగుబడిలో 30 శాతం వరకు మాత్రమే కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఇది సరికాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ఆధ్వర్యంలోని మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ తదితర సంస్థలే మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నాయి. విక్రయించేటప్పుడు ఆ సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టంలో కేవలం 40 శాతమే భరిస్తానని కేంద్రం చెబుతుండగా దానిని 55 శాతానికి పెంచాలని తెలంగాణ కోరుతోంది. పంట ఉత్పత్తుల సేకరణకు అవసరమైన నిధులను కేంద్రం సమకూర్చాలని తెలంగాణ సూచిస్తోంది. కనీసం 50 శాతం రివాల్వింగ్ ఫండ్ సమకూర్చాలని విన్నవిస్తోంది. 55 శాతం భరించాలి: పార్థసారథి, కార్యదర్శి, వ్యవసాయశాఖ పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో రాష్ట్రాల్లోని ఆయా సంస్థలకు నష్టం వాటిల్లితే 40 శాతమే భరిస్తానని కొత్త పథకంలో కేంద్రం చెబుతోంది. దాన్ని 55 శాతానికి పెంచాలని కోరుతున్నాం. 50 శాతం రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలని, కేంద్ర సంస్థలు, నాఫెడ్ చేదోడు వాదోడుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. -
తెలంగాణ సర్కార్‌కు జాతీయ సైన్స్ కాంగ్రెస్ షాక్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ షాకిచ్చింది. ఓయూలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేసింది. దాదాపు 100 ఏళ్లలో సైన్స్ కాంగ్రెస్‌కు విఘాతం కలగడం ఇదే తొలిసారి. ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాల వల్లే సైన్స్ కాంగ్రెస్‌ను వాయిదా వేసినట్లు ప్రకటించింది. 2018, జనవరి 3-7వరకు జరగనున్న 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వంచడం సాధ్యం కాదని ఓయూ వీసీ రామచంద్రం చెప్పడంతోపాటు, ఇంటెలిజెన్స్ నివేదిక కూడా పరిశీలించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఓయూలో ఇటీవల విద్యార్థి ఆత్మహత్య, నాన్ టీచింగ్ స్టాఫ్ వరుస దీక్షలు, ఆదివాసీలు, ఎమ్మార్పీఎస్ ఉద్యమాలువంటి కారణాలు కూడా సైన్స్ కాంగ్రెస్‌ను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 11 ఏళ్ల తర్వాత సైన్స్ కాంగ్రెస్ హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం రాగా ప్రస్తుతానికి అది కాస్త వాయిదా పడింది. మరోపక్క, ఇప్పటికే జాతీయ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుందని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోవద్దనే ఉద్దేశంతో ఇప్పటికే యూనివర్సిటీలోని పీజీ హాస్టల్ విద్యార్థులకు వచ్చే నెల 16వరకు సెలవులిచ్చి ఇళ్లకు పంపించిన విషయం తెలిసిందే. అలాగే, ఓయూ క్రీడా ప్రాంగణాల్లో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం కోసం ఏర్పాట్లు కూడా జరుగుతుండగా తాజా నిర్ణయంతో అర్ధాంతరంగా నిలిపేసినట్లయింది.