
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ రాష్ట్ర ఆదాయాన్ని కాటేసింది. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మార్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్‌లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వేతనాలు, పెన్షన్ల చెల్లింపులపై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి నెలకు సంబంధించి ఏప్రిల్‌లో చెల్లించనున్న వేతనాలు, పెన్షన్లపై భారీ కోత పడనుంది. పలు ఉద్యోగ వర్గాల వేతనాల కోతలు ఇలా ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment