సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రభుత్వ సలహాదారులు వీరే..
► హర్కర వేణుగోపాల్- ప్రోటోకాల్,పబ్లిక్ రిలేషన్
► వేం నరేందర్ రెడ్డి- సీఎం వ్యవహారాలు
► షబ్బీర్ అలీ- ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ, మైనారిటీ శాఖలు
► మల్లు రవి- ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
ఈ నలుగురికీ కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. ఇక.. ఆర్టీసీ చైర్మన్ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి తన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చాక పలు నియామకాలపై స్పష్టత రానున్నట్లు చర్చ జరుగుతోంది.
చదవండి: ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment