advisers
-
TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ సలహాదారులు వీరే.. ► హర్కర వేణుగోపాల్- ప్రోటోకాల్,పబ్లిక్ రిలేషన్ ► వేం నరేందర్ రెడ్డి- సీఎం వ్యవహారాలు ► షబ్బీర్ అలీ- ఎస్సీ, ఎస్టీ,ఓబీసీ, మైనారిటీ శాఖలు ► మల్లు రవి- ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ నలుగురికీ కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. ఇక.. ఆర్టీసీ చైర్మన్ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి తన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చాక పలు నియామకాలపై స్పష్టత రానున్నట్లు చర్చ జరుగుతోంది. చదవండి: ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం -
పెట్టుబడి సలహాదారులకు గడువు పెంపు
న్యూఢిల్లీ: పెట్టుబడి సలహాదారుల(ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్)కు నిబంధనల అమలు గడువును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండేళ్లపాటు పొడిగించింది. దీంతో అర్హత, అనుభవం తదితర అంశాలను అందుకునేందుకు 2025 సెప్టెంబర్‌వరకూ సమయం లభించింది. వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్స్, వ్యక్తిగతేతర పెట్టుబడి సలహాదారుల ప్రధాన ఆఫీసర్లు, పెట్టుబడుల వర్క్‌తో సంబంధం కలిగిన వ్యక్తులు అర్హత, అనుభవం తదితర నిబంధనలను పాటించేందుకు ప్రస్తుత గడువు 2023 సెప్టెంబర్30తో ముగియనుంది. అయితే వివిధ వాటాదారులు, సంస్థల నుంచి అందిన అభ్యర్ధనలమేరకు సెబీ నిబంధనల అమలు గడువును రెండేళ్లపాటు పొడిగించింది. ఎవరీ పెట్టుబడి సలహాదారులు? స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల సలహాల కోసం నియమించుకునే వ్యక్తులు లేదా సంస్థలనే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అంటారు. సాధారణంగా వీరిని అసెట్ మేనేజర్లు, ఇన్వెస్ట్మెంట్ కౌన్సెలర్లు, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, వెల్త్ మేనేజర్లు అని కూడా అంటారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో నమోదైన వారినే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌గా నియమించుకునేందుకు వీలుంటుంది. వీరి అర్హతలు, అనుభవాలకు సంబంధించిన నిబంధనలను సెబీ ఇటీవల మరింత పెంచింది. అందు కోసం 2023 సెప్టెంబర్ 30 గడువు విధించగా తాజాగా దాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. -
పాఠ్యపుస్తకాల సలహాదారులుగా కొనసాగలేం
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైయినింగ్(ఎన్సీఈఆర్టీ) పాఠ్యపుస్తకాల సిలబస్‌లో కోతలపై ప్రధాన సలహాదారులుగా వ్యవహరిస్తున్న సుహాస్ పల్షికర్, యోగేంద్ర యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 9 నుంచి 12వ తరగతి వరకు పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకాల సిలబస్ నుంచి కొన్ని అంశాల తొలగింపు ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని వారు పేర్కొన్నారు. హేతుబద్ధీకరణ అంటూ పాఠ్యాంశాలను వికృతీకరించి, వాటిని విద్యాపరంగా పనికిరానివిగా మార్చారని ఆరోపించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, అభిప్రాయం తెలుసుకోకుండా ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ చర్య ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఆయా పాఠ్యపుస్తకాల్లో ప్రధాన సలహాదారుల జాబితాలో ఉన్న తమ పేర్లను వెంటనే తొలగించాలని కోరుతూ ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీకి లేఖ రాశారు. మహాత్మాగాంధీ మరణం దేశంలో మత సామరస్యతపై చూపిన సానుకూల ప్రభావం, ఆర్ఎస్ఎస్పై కొంతకాలం నిషేధం, 2002లో గుజరాత్ అల్లర్లు వంటి విషయాలను సిలబస్ నుంచి తొలగిస్తూ గత నెలలో ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. 2006–07లో ముద్రించిన ఎన్సీఈఆర్టీ 9 నుంచి 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలకు వీరిద్దరూ ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. పల్షికర్, యోగేంద్ర యాదవ్ రాజనీతి శాస్త్ర నిపుణులు. కాగా, యోగేంద్ర యాదవ్ స్వరాజ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్నారు. -
SEBI: అన్ని వివరాలూ వెల్లడించాలి
న్యూఢిల్లీ: పెట్టుబడి సలహాలిచ్చే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, పరిశోధనా అనలిస్టులకు సంబంధించి పారదర్శకత పెంచే దిశగా సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రకటనల్లో సెబీ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తి పేరు, లోగో, పూర్తి చిరునామా, టెలిఫోన్ నంబర్లను వెల్లడించాలని పేర్కొంది. సెబీ ఇచ్చిన రిజిస్ట్రేషన్ కానీ, బీఎస్ఈ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్ సభ్యత్వం కానీ, రాబడులు, పనితీరుకు భరోసాగా, హామీగా చూడొద్దంటూ విధిగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది. వారు ప్రచురించే పబ్లికేషన్లు, కేవైసీ పత్రాలు, క్లయింట్లతో చేసుకునే ఒప్పంద పత్రాలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే అన్ని రకాల సంప్రదింపుల్లోనూ ఈ వివరాలు ఉండాలని సెబీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, రీసెర్చ్ అనలిస్టులు ఇచ్చే ప్రకటనల్లో సెబీ లోగో వాడకుండా నిషేధం విధించింది. కొంత మంది పెట్టుబడుల సలహాదారులు, పరిశోధనా విశ్లేషకులు తమ ప్రకటనలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే సంప్రదింపులు, ఒప్పందాల సమయంలో సెబీ వద్ద నమోదు చేసుకున్న పేరు, రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులు బ్రాండ్ లేదా లోగోను వాడుతున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ మేరకు ఆదేశించింది. -
ఇన్వెస్ట్మెంట్ సలహాదారులకు సెబీ చెక్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు(ఐఏలు), రీసెర్చ్ ఎనలిస్టు(ఆర్ఏ)లకు ప్రకటనల కోడ్ ను జారీ చేసింది. దీంతో ఇకపై తమ ప్రకటనల్లో.. నంబర్ వన్, టాప్ సలహాదారులు, టాప్ రీసెర్చ్ విశ్లేషకులు, లీడింగ్ సంస్థ వంటి అత్యుక్తులను వినియోగించేందుకు వీలుండదు. తమ ప్రకటనల్లో ఇకపై ఇలాంటి పదాలను నిషేధిస్తూ సెబీ అడ్వర్టయిజ్మెంట్ కోడ్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా క్లిష్టమైన భాషను సైతం వాడేందుకు అనుమతించరు. అయితే ఏదైనా అవార్డులవంటివి పొంది తే వీటి వివరాలు పొందుపరచేందుకు అవకాశముంటుంది. ఇందుకు సర్క్యులర్‌ను జారీ చేసింది. మే 1నుంచి అమలుకానున్న తాజా నిబంధనల ద్వారా ఐఏ, ఆర్ఏల నిబంధనలు మరింత పటిష్టంకానున్నాయి. అనుభవం, అవగాహనలేని ఇన్వెస్టర్ల ను తప్పుదారి పట్టించే అంచనాలు, స్టేట్మెంట్లు వంటివి ప్రకటనల్లో వినియోగించకూడదు. ఇదేవిధంగా రాబడి(రిటర్న్) హామీలను ఇవ్వడానికి వీ లుండదు. ఐఏలు, ఆర్ఏల గత పనితీరును సైతం ప్రస్తావించేందుకు అనుమతించరు. సెబీ లోగోను వినియోగించరాదు. ఐఏ లేదా ఆర్ఏ జారీ చేసే ప్రకటనల్లో వాళ్ల పేర్లు, లోగో, కార్యాలయ చిరునామా, రిజిస్ట్రేషన్ సంఖ్యలు వెల్లడించవలసి ఉంటుంది. సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. పెట్టుబడులు చేపట్టే ముందు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి అంటూ ప్రా మాణిక హెచ్చరికను జారీ చేయవలసి ఉంటుంది. -
హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగం గడిచిన పదిహేనేళ్లుగా అతిపెద్ద బూమ్‌ను చూస్తోందని హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ, సీఈవో విపుల్ రూంగ్తా తెలిపారు. ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక స్థోమత (అఫర్డబులిటీ), సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష తదితర ఎన్నో అంశాలు బూమ్‌ను నడిపిస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రూంగ్తా మాట్లాడారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన ‘‘గత 15 ఏళ్లలో అతిపెద్ద బూమ్‌ను నేను వ్యక్తిగతంగా చూస్తున్నాను. నివాస విభాగంలో మధ్యాదాయ, అందుబాటు ధరల విభాగం అయినా, ప్రీమియం విభాగం అయినా ఇదే పరిస్థితి నెలకొంది’’అని రూంగ్తా అన్నారు. ఫిక్కీ రియల్ ఎస్టేట్ కమిటికీ కో చైర్మన్‌గానూ రూంగ్తా వ్యవహరిస్తున్నారు. రెరా కింద సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ డెవలపర్లపై ఉందని గుర్తు చేస్తూ, ఈ విషయంలో విఫలమైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. బడ్జెట్ ఇళ్లకు డిమాండ్.. దేశంలో హౌసింగ్ డిమాండ్ ప్రధానంగా అందుబాటు ధరల, మధ్యాదాయ వర్గాల కేంద్రంగా ఉన్నట్టు విపుల్ రూంగ్తా చెప్పారు. కనుక ఈ విభాగాల్లో హౌసింగ్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఇదే సరైన తరుణమని సూచించారు. వడ్డీ రేట్లు గత ఏడాది కాలంలో పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ ఉత్సాహంగానే ఉన్నట్టు చెప్పారు. అఫర్డబుల్ హౌసింగ్‌లో హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ 3.2 బిలియన్ డాలర్ల ఫండ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణ, గృహ ఆదాయంతో నివాస గృహాలకు అసాధారణ స్థాయిలో డిమాండ్ ఉన్నట్టు ఇదే సదస్సులో పాల్గొన్న ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా ధరల వృద్ధి ఉన్న టాప్–10 హౌసింగ్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో 3.65 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. -
ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ (ప్రజా వ్యవహారాలు) సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ఈనెల 18వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. అలాగే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం పదవీ కాలం ఈ నెల 4వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్ పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగుస్తోంది. అప్పటి నుంచి మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ప్రభుత్వ సలహాదారు (కో–ఆర్డినేటర్–కార్యక్రమాలు) తలశిల రఘురాం పదవీ కాలం ఈ నెల 7వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని అప్పటి నుంచి మరో ఏడాది పాటు ప్రభుత్వం పొడిగించింది. చదవండి: 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ! -
థెరిసా సలహాదారుల రాజీనామా
లండన్: బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నిరాశజనక ఫలితానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని థెరిసా మే సన్నిహిత సలహాదారులైన నిక్ తిమోతి, ఫియోనా హిల్లు శనివారం రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని కార్యాలయంలో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌గా వీరు పనిచేస్తున్నారు. ముందుస్తు ఎన్నికలకు వెళ్తే కన్జర్వేటివ్ పార్టీకి భారీ మెజార్టీ ఖాయమని థెరిసాను ఒప్పించడంలో వీరు కీలక పాత్ర పోషించారు. కన్జర్వేటివ్ పార్టీ చీఫ్‌గా కొనసాగాలంటే నిక్, ఫియోనాను తప్పించాల్సిందేనని సొంత పార్టీ సభ్యులు అల్టిమేటం నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయని, ఎన్నికల ప్రచారంలో తన ప్రమేయానికి బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నానని ఒక ప్రకటనలో నిక్ పేర్కొన్నారు. -
జాతీయ భద్రతా సలహాదారుల రహస్య సమావేశం
-
చంద్రబాబుతో గవర్నర్ సలహాదారుల భేటీ
-
చంద్రబాబుతో గవర్నర్ సలహాదారుల సమావేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో గవర్నర్ సలహాదారులు సమావేశమయ్యారు. అంతకు ముందు పోలీసు ఉన్నతాధికారులతో భేటీ ముగిసిన మరుక్షణమే గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో గవర్నర్ సలహాదారులు చంద్రబాబుతో సమావేశం కావడం అందరిలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. అయితే, వీరు చంద్రబాబు ఆహ్వానం మేరకు భేటీ అయ్యారా.. లేక గవర్నర్ పంపించారా అనే విషయం స్పష్టం కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఈ భేటీ జరిగింది. అంతకుముందే గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ సర్కార్ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఆయన నోరు మెదపడం లేదని టీడీపీ నేతలు నేరుగా గవర్నర్ ను విమర్శిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. విభజన చట్టానికి సంబంధించిన సెక్షన్ 8 అంశాన్ని కూడా గవర్నర్ సలహాదారులు చంద్రబాబునాయుడితో చర్చించినట్లు సమాచారం. -
గవర్నర్ సలహాదారుల నియామకం