ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో గవర్నర్ సలహాదారులు సమావేశమయ్యారు. అంతకు ముందు పోలీసు ఉన్నతాధికారులతో భేటీ ముగిసిన మరుక్షణమే గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో గవర్నర్ సలహాదారులు చంద్రబాబుతో సమావేశం కావడం అందరిలో ఆసక్తికర చర్చకు తెరలేపింది.