న్యూఢిల్లీ: పెట్టుబడి సలహాదారుల(ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్స్)కు నిబంధనల అమలు గడువును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండేళ్లపాటు పొడిగించింది. దీంతో అర్హత, అనుభవం తదితర అంశాలను అందుకునేందుకు 2025 సెప్టెంబర్‌వరకూ సమయం లభించింది.
వ్యక్తిగత ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్స్, వ్యక్తిగతేతర పెట్టుబడి సలహాదారుల ప్రధాన ఆఫీసర్లు, పెట్టుబడుల వర్క్‌తో సంబంధం కలిగిన వ్యక్తులు అర్హత, అనుభవం తదితర నిబంధనలను పాటించేందుకు ప్రస్తుత గడువు 2023 సెప్టెంబర్30తో ముగియనుంది. అయితే వివిధ వాటాదారులు, సంస్థల నుంచి అందిన అభ్యర్ధనలమేరకు సెబీ నిబంధనల అమలు గడువును రెండేళ్లపాటు పొడిగించింది.
ఎవరీ పెట్టుబడి సలహాదారులు?
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల సలహాల కోసం నియమించుకునే వ్యక్తులు లేదా సంస్థలనే ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అంటారు. సాధారణంగా వీరిని అసెట్ మేనేజర్‌లు, ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సెలర్లు, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్లు, పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, వెల్త్ మేనేజర్‌లు అని కూడా అంటారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో నమోదైన వారినే ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌గా నియమించుకునేందుకు వీలుంటుంది. వీరి అర్హతలు, అనుభవాలకు సంబంధించిన నిబంధనలను సెబీ ఇటీవల మరింత పెంచింది. అందు కోసం 2023 సెప్టెంబర్ 30 గడువు విధించగా తాజాగా దాన్ని మరో రెండేళ్లు పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment