సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ షాకిచ్చింది. ఓయూలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేసింది. దాదాపు 100 ఏళ్లలో సైన్స్ కాంగ్రెస్‌కు విఘాతం కలగడం ఇదే తొలిసారి. ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాల వల్లే సైన్స్ కాంగ్రెస్‌ను వాయిదా వేసినట్లు ప్రకటించింది. 2018, జనవరి 3-7వరకు జరగనున్న 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వంచడం సాధ్యం కాదని ఓయూ వీసీ రామచంద్రం చెప్పడంతోపాటు, ఇంటెలిజెన్స్ నివేదిక కూడా పరిశీలించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఓయూలో ఇటీవల విద్యార్థి ఆత్మహత్య, నాన్ టీచింగ్ స్టాఫ్ వరుస దీక్షలు, ఆదివాసీలు, ఎమ్మార్పీఎస్ ఉద్యమాలువంటి కారణాలు కూడా సైన్స్ కాంగ్రెస్‌ను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 11 ఏళ్ల తర్వాత సైన్స్ కాంగ్రెస్ హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం రాగా ప్రస్తుతానికి అది కాస్త వాయిదా పడింది. మరోపక్క, ఇప్పటికే జాతీయ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుందని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోవద్దనే ఉద్దేశంతో ఇప్పటికే యూనివర్సిటీలోని పీజీ హాస్టల్ విద్యార్థులకు వచ్చే నెల 16వరకు సెలవులిచ్చి ఇళ్లకు పంపించిన విషయం తెలిసిందే. అలాగే, ఓయూ క్రీడా ప్రాంగణాల్లో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం కోసం ఏర్పాట్లు కూడా జరుగుతుండగా తాజా నిర్ణయంతో అర్ధాంతరంగా నిలిపేసినట్లయింది.
తెలంగాణ సర్కార్‌కు జాతీయ సైన్స్ కాంగ్రెస్ షాక్
Published Thu, Dec 21 2017 9:52 AM | Last Updated on Thu, Dec 21 2017 10:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment