National Science Congress
-
శత్రు సైన్యంపై మూషికాస్త్రం!
యుద్ధ క్షేత్రంలో శత్రు శిబిరం ఎత్తుగడలు, రహస్యాలను తెలుసుకోవడానికి సైన్యం రకరకాల మార్గాల్లో ప్రయత్నించడం తెలిసిందే. శత్రువులు ఎక్కడెక్కడ ఏయే ఆయుధాలు మోహరించారో తెలుసుకోవడం యుద్ధంలో కీలకం. ఇలాంటివి పసిగట్టే ఎలుకలపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) నిర్విరామంగా ప్రయోగాలు సాగిస్తోంది. డీఆర్డీఓలో అంతర్భాగమైన అసిమ్మెట్రిక్ టెక్నాలజీ ల్యాబ్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైంది. మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసి, రెండో దశలోకి ప్రవేశించింది. ఏమిటీ ప్రయోగం? సైనికులు జంతువులు, పక్షులను ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఎలుకలను రంగంలోకి దించాలన్నదే భారత సైన్యం వ్యూహం. ఇవి ఏమాత్రం అనుమానం రాకుండా శత్రు సైనికుల శిబిరాల్లోకి వెళ్లి, అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా సైన్యం వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఎలుకలను యానిమల్ ౖసైబర్గ్స్ అని పిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీనిగురించి ఇటీవల జరిగిన 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. యానిమల్ సైబర్గ్స్ అంటే? జీవించి ఉన్న ఎలుకల సామర్థ్యాన్ని మరింత పెంచుతారు. ఇందుకోసం ఎలక్ట్రికల్, మెకానికల్ పరికరాలు ఉపయోగిస్తారు. సాధారణ ఎలుకలు చేయలేని ఎన్నో పనులను ఇవి సులువుగా చేసేస్తాయి. కేవలం సైన్యంలోనే కాదు, పరిశోధనలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, భూమిల పాతిపెట్టిన బాంబుల జాడ కనుక్కోవడంతోపాటు శస్త్రచికిత్సల్లోనూ యానిమల్ సైబర్గ్స్ సేవలను వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జంతువుల్లో మార్పులు చేయడాన్ని జంతు ప్రేమికులు, జంతు హక్కుల సంఘాల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. జంతువుల్లోని సహజ సామర్థ్యాలను దూరం చేయడం వాటిని బాధకు గురిచేయడమే అవుతుందని అంటున్నారు. ఎలుకలే ఎందుకు? భారత్‌లో ఎలుకలపై మొదటి దశ ప్రయోగాలు ముగిశాయి. ఎలుకల కదలికలను నియంత్రించడానికి సర్జరీల ద్వారా వాటి శరీరంలో ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఇక సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వాటిని పరీక్షించబోతున్నారు. కొండలను ఎంత వరకు అధిరోహించగలవో చూస్తారు. మొదటి దశ ప్రయోగంలో ఎలుకలు కొంత ఇబ్బందికి గురయ్యాయని డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ వెల్లడించారు. కార్యాచరణకు సిద్ధమైన ఎలుకలను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. ఏ దిశగా వెళ్లాలి? ఎంత దూరంగా వెళ్లాలి? ఎక్కడ ఆగాలి? ఎంతసేపు ఆగాలి? అనేదానిపై వాటి మెదడుకు ఎప్పటికప్పుడు సంకేతాలు అందిస్తారు. ప్రయోగానికి ఎలుకలనే ఎన్నుకోవడానికి కారణంగా ఏమిటంటే.. అవి వేగంగా కదులుతాయి. లోతైన బొరియల్లోకి సైతం తేలిగ్గా వెళ్లగలవు. గోడలు, చెట్లు ఎక్కగలవు. యానిమల్ ౖౖసైబర్గ్స్ను చైనాలో ఇప్పటికే అభివృద్ధి చేశారు. యానిమల్ సైబర్గ్స్ సినిమాల్లో కూడా ఉన్నాయి. స్టార్‌వార్స్ సినిమాలోని చ్యూబాకా కూడా ఇలాంటిదే. ఒళ్లంతా రోమాలతో కనిపించే వింత జంతువు చ్యూబాకాలో శరీరం లోపల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్లోబల్ లీడర్లుగా ఎదగండి
నాగపూర్: భారత్‌ను స్వావలంబన దేశంగా తీర్చిదిద్దడానికి సైంటిస్టులు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారు తమ పరిజ్ఞానాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఉపయోగించాలని కోరారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది. శాస్త్రీయ విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. క్వాంటమ్ టెక్నాలజీ, డేటా సైన్స్‌తోపాటు కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు సూచించారు. కొత్తగా పుట్టకొచ్చే వ్యాధులపై నిఘా పెట్టే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఆదరణ పొందుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో విశేష కృషి చేయడం ద్వారా గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సైంటిస్టులకు ఉద్బోధించారు. సెమి కండక్టర్ల రంగంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని కోరారు. పరిశోధకులు తమ ప్రాధాన్యతల జాబితాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీని చేర్చుకోవాలని చెప్పారు. ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 40వ స్థానం సైంటిస్టులు ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి రావాలని, అప్పుడే వారి ప్రయత్నాలు గొప్ప ఘనతలుగా కీర్తి పొందుతాయని ప్రధానమంత్రి వెల్లడించారు. సైన్స్ ప్రయోగాల ఫలితాలను సామాన్య ప్రజలకు అందించాలన్నారు. టాలెంట్ హంట్, హ్యాకథాన్లతో యువతను సైన్స్ వైపు ఆకర్షితులను చేయాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లను రీసెర్చ్ ల్యాబ్‌లు, విద్యాసంస్థలతో అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేశారు. క్వాంటమ్ కంప్యూటర్స్, కెమిస్ట్రీ, కమ్యూనికేషన్, సెన్సార్స్, క్రిప్టోగ్రఫీ, న్యూ మెటీరియల్స్ దిశగా మన దేశం వేగంగా ముందుకు సాగుతోందని మోదీ వివరించారు. మన దేశంలో ఇంధన, విద్యుత్ అవసరాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయని, ఈ రంగంలో కొత్త ఆవిష్కరణ ద్వారా దేశానికి లబ్ధి చేకూర్చాలని సైంటిఫిక్ సమాజానికి పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి కోసం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించుకుంటున్నామని తెలియజేశారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మనదేశం 2015లో 81వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 40వ స్థానానికి చేరిందని అన్నారు. -
'వాటిలో ప్రభుత్వ జోక్యం లేదు'
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్ తరలిపోవడానికి.. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనిక్కడ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా వర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని తెలిపారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ, ఇతర అంశాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోలేదన్నారు. వర్సిటీలో పరిస్థితులను కాంగ్రెస్ చెడగొడుతోందని విమర్శించారు. కాగా, ఓయూలో నిర్వహించాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా మణిపూర్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. -
'కేసీఆర్ క్షమాపణ చెప్పాలి'
సాక్షి, హైదరాబాద్: సైన్స్ కాంగ్రెస్‌ను ఓయూలో నిర్వహించలేమని చేతులెత్తేసిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను అవమానించారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు.133 వ జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన గాంధీ భవన్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరో వైపు హైకోర్టు విభజనపై టీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదన్నారు. హైకోర్టు కోసం పోరాడుతున్నట్టుగా టీఆర్ఎస్ నేతలు నాటాకాలాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. -
తెలంగాణ సర్కార్‌కు జాతీయ సైన్స్ కాంగ్రెస్ షాక్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ షాకిచ్చింది. ఓయూలో జరగాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వాయిదా వేసింది. దాదాపు 100 ఏళ్లలో సైన్స్ కాంగ్రెస్‌కు విఘాతం కలగడం ఇదే తొలిసారి. ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాల వల్లే సైన్స్ కాంగ్రెస్‌ను వాయిదా వేసినట్లు ప్రకటించింది. 2018, జనవరి 3-7వరకు జరగనున్న 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వంచడం సాధ్యం కాదని ఓయూ వీసీ రామచంద్రం చెప్పడంతోపాటు, ఇంటెలిజెన్స్ నివేదిక కూడా పరిశీలించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఓయూలో ఇటీవల విద్యార్థి ఆత్మహత్య, నాన్ టీచింగ్ స్టాఫ్ వరుస దీక్షలు, ఆదివాసీలు, ఎమ్మార్పీఎస్ ఉద్యమాలువంటి కారణాలు కూడా సైన్స్ కాంగ్రెస్‌ను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 11 ఏళ్ల తర్వాత సైన్స్ కాంగ్రెస్ హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం రాగా ప్రస్తుతానికి అది కాస్త వాయిదా పడింది. మరోపక్క, ఇప్పటికే జాతీయ సైన్స్ కాంగ్రెస్ జరుగుతుందని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోవద్దనే ఉద్దేశంతో ఇప్పటికే యూనివర్సిటీలోని పీజీ హాస్టల్ విద్యార్థులకు వచ్చే నెల 16వరకు సెలవులిచ్చి ఇళ్లకు పంపించిన విషయం తెలిసిందే. అలాగే, ఓయూ క్రీడా ప్రాంగణాల్లో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం కోసం ఏర్పాట్లు కూడా జరుగుతుండగా తాజా నిర్ణయంతో అర్ధాంతరంగా నిలిపేసినట్లయింది. -
ఓయూలోనే జాతీయ సైన్స్ కాంగ్రెస్
హైదరాబాద్: జనవరి 3 నుంచి 7 వరకు జరిగే 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఓయూ క్యాంపస్‌లోనే ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు క్యాంపస్‌లో ముమ్మరంగా సాగుతున్నాయి. వేదికల ఏర్పాటుకు కావాల్సిన సామగ్రిని అధికారులు తీసుకొచ్చారు. క్యాంపస్‌లోని ఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసి న వేదికపై ప్రధాని సదస్సును ప్రారంభిస్తారు. సీ గ్రౌండ్స్‌లో దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల వస్తువుల కోసం ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌ను టెక్నాలజీ కళాశాలలో, ఠాగూర్ ఆడిటోరియంలో మహిళా సైన్స్ కాంగ్రెస్, యూనివర్సిటీ లైబ్రరీలోని ఐసీఎస్ఎస్ఆర్ హాలులో సైన్స్ కమ్యూనికేటర్ సమ్మిట్ జరగనున్నాయి. తొలుత సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ వేడుకలను హైటెక్స్‌లో జరపాలని అధికారులు నిర్ణయించినా ప్రధాని సూచన మేరకు ఓయూలోనే నిర్వహిస్తున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో నిర్వహించే ఈ సదస్సులో పాల్గొననున్న 15 వేల మంది ప్రతినిధులకు నగరం లోని ప్రముఖ హోటల్స్‌లో వసతి కల్పిస్తున్నట్లు సైన్స్ కాంగ్రెస్ సెక్రటరీ ప్రొ.శివరాజ్ తెలిపారు. -
జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు దరఖాస్తులు
ప్రొఫెసర్ రెడ్యానాయక్ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2018, జనవరి 3 నుంచి 7 వరకు జరిగే 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనదలచిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఓయూ స్థానిక కార్యదర్శి, ప్రొఫెసర్ రెడ్యానాయక్ తెలిపారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనే అభ్యర్థులు నవంబరు 30లోగా రూ.2 వేలు, డిసెంబరు 15లోగా రూ.2,500, విద్యార్థులు రూ.1500 చెల్లించి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. ‘బెస్ట్ పేపర్, పోస్టర్ ప్రెజెంటేషన్, పరిశోధనపత్రాలకు సంబంధించి ఈ నెల 31 వరకు, యువ శాస్త్రవేత్త అవార్డుల కోసం ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. చిల్డ్రన్స్, ఉమెన్ సైన్స్ కాంగ్రెస్, సైన్స్ కమ్యూనికేటర్స్ మీట్ తదితర కార్యక్రమాలు జరుగుతాయి. సైన్స్ కమ్యూనికేటర్ మీట్లో చిత్రపరిశ్రమ, జర్నలిస్టులు, విద్యావంతులు పాల్గొనవచ్చు. ఇందుకు వంద పదాలతో కూడిన బయోడేటాను పంపించాలి. సైన్స్ ఎగ్జిబిషన్, ప్లీనరీ లెక్చర్స్, 14 టెక్నికల్ సెషన్స్, 30 సింపోజియాలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.టఛిజ్ఛీnఛ్ఛిఛిౌnజట్ఛటట.nజీఛి.జీn వెబ్సైట్లో లేదా 9290491044 నంబర్లో సంప్రదించాలి’అని రెడ్యానాయక్ వివరించారు. -
అయ్యో కజిటా! చంద్రబాబు ఎంతపని చేశాడు..
అవసరంలేని సందర్భంలోనూ గొప్పలు చెప్పుకోవడం, హామీలను గుప్పించడం, మరునిమిషంలోనే వెంటనే వాటిని మర్చిపోవడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలవాటే. అందుకే వాగ్ధానాల అమలుదాకా వచ్చేసరికి ఆయన తేలి(కై)పోతారు! ఇటీవల నిర్వహించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లోనూ చంద్రబాబు తనదైన శైలిలో ‘నోబెల్ బహుమతి సాధిస్తే రూ.100 కోట్లు బహుమానం ఇస్తా’నని గప్పాలు కొట్టిన ఆయన.. తన పక్కనే కూర్చున్న నోబెల్ గ్రహీత పట్ల మాత్రం కనీస మర్యాద పాటించలేదు. ‘నోబెల్’ సాధించడమెలాగో చెబుతారా?’ అంటూ ఎవరినైతే టిప్స్ అడిగారో.. ఆ జపాన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటాను అవమానించేలా సీఎం ప్రవర్తించారు. ఇలా చేసినందుకు పలు జాతీయ వార్తా సంస్థలు బాబు తీరును ఎండగట్టగా, సోషల్ మీడియాలోనైతే ‘అయ్యో కజిటా.. చంద్రబాబు ఎంతపని చేశాడు!’ తరహా కామెంట్లు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. (‘నోబెల్’ సాధిస్తే రూ.100 కోట్లు: సీఎం చంద్రబాబు) శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన 104 నేషనల్ సైన్స్ కాంగ్రెస్ వేడుకల్లో భాగంగా జనవరి 4న చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభోత్సవం జరిగింది. శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ వేదికపై జరిగిన ఆ కార్యక్రమానికి వర్సిటీ ఉపకులపతి దుర్గాభవాని అధ్యక్షత వహించారు. వేదికపై ఏర్పాటుచేసిన కుర్చీల్లో సీఎం చంద్రబాబు, నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటా, మరికొందరు శాస్త్రవేత్తలు ఆసీనులయ్యారు. ప్రతిసారిలాగే మైక్ అందుకున్న చాలా సేపటికిగానీ చంద్రబాబు ప్రసంగం పూర్తికాలేదు. ఆ ప్రసంగంలోనే కజిటాను నోబెల్ చిట్కాలు అడిగారు. షెడ్యూల్ ప్రకారం సీఎం ప్రసంగం తర్వాత శాస్త్రవేత్త టకాకి కజిటా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయాల్సిఉంది. కానీ అలా జరగలేదు. ప్రసంగం ముగిసిన వెంటనే చంద్రబాబు గబగబా వేదిక నుంచి కిందికి దిగారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనా చౌదరి సహా అధికారులంతా సీఎంను అనుసరించారు. వేదిక మొత్తం ఖాళీ అవుతోన్న దృశ్యాలను చూసి విద్యార్థులు కూడా బయటికి అడుగులు వేశారు. మాటమాత్రమైనా చెప్పకుండా ఎటువాళ్లు అటు వెళ్లిపోవడంతో సైంటిస్ట్ కజిటా వేదికపై ఒంటరయ్యారు. ఖాళీ అయిన ఆడిటోరియంలో దిక్కులు చూస్తూ కూర్చున్న ఆయనను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోని కజిటా.. కాసేపు ల్యాప్‌టాప్‌ను ఓపెన్‌చేసి పరిశీలించారు. ఇంకొన్ని నిమిషాల తర్వాత.. అక్కడి వాలంటీర్లు కజితా దగ్గరికి మాట్లాడారు. బహుమతి ప్రదానాల కార్యక్రమం రద్దయిందని వాలంటీర్ల ద్వారా తెలుసుకున్నతర్వాత కజిటా వేదికదిగి వెళ్లిపోయారు. ఆ విధంగా శాస్త్ర, సాంకేత శాఖ, చంద్రబాబు చేతుల్లో బుక్కయ్యారు! (వంద కోట్లు సరే.. సదుపాయాలేవీ!: యువశాస్త్రవేత్తల పెదవివిరుపు) -
రూ.1,500 కోట్లతో సైన్స్ మ్యూజియం
నేడు తిరుపతిలో శంకుస్థాపన సాక్షి, తిరుపతి: తిరుపతిలో రూ. 1,500 కోట్లతో మెగా సైన్స్ మ్యూజి యాన్ని నెలకొల్ప నున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మ్యూజియం నిర్మాణ పనులకు బుధవారం ఉదయం 7.30 గంటలకు భూమి పూజ చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో భాగంగా ఎస్వీయూ ఆవరణ లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన మెగా సైన్స్ ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డుతూ.. ఇస్కా సదస్సుల్లో భాగంగా బుధవారం ఉదయం 11 గంటలకు చిల్డ్రన్స్, ఉమెన్ సైన్స్ కాంగ్రెస్‌లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో జాతి గర్వించే దళిత నేతల స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. మంగళవారం తన నివాసంలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు సీఎం నివాళులర్పించారు.