ప్రొఫెసర్ రెడ్యానాయక్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2018, జనవరి 3 నుంచి 7 వరకు జరిగే 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనదలచిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఓయూ స్థానిక కార్యదర్శి, ప్రొఫెసర్ రెడ్యానాయక్ తెలిపారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనే అభ్యర్థులు నవంబరు 30లోగా రూ.2 వేలు, డిసెంబరు 15లోగా రూ.2,500, విద్యార్థులు రూ.1500 చెల్లించి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. ‘బెస్ట్ పేపర్, పోస్టర్ ప్రెజెంటేషన్, పరిశోధనపత్రాలకు సంబంధించి ఈ నెల 31 వరకు, యువ శాస్త్రవేత్త అవార్డుల కోసం ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
చిల్డ్రన్స్, ఉమెన్ సైన్స్ కాంగ్రెస్, సైన్స్ కమ్యూనికేటర్స్ మీట్ తదితర కార్యక్రమాలు జరుగుతాయి. సైన్స్ కమ్యూనికేటర్ మీట్‌లో చిత్రపరిశ్రమ, జర్నలిస్టులు, విద్యావంతులు పాల్గొనవచ్చు. ఇందుకు వంద పదాలతో కూడిన బయోడేటాను పంపించాలి. సైన్స్ ఎగ్జిబిషన్, ప్లీనరీ లెక్చర్స్, 14 టెక్నికల్ సెషన్స్, 30 సింపోజియాలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.టఛిజ్ఛీnఛ్ఛిఛిౌnజట్ఛటట.nజీఛి.జీn వెబ్‌సైట్‌లో లేదా 9290491044 నంబర్లో సంప్రదించాలి’అని రెడ్యానాయక్ వివరించారు.
జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు దరఖాస్తులు
Published Mon, Jul 3 2017 1:57 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
Advertisement
Advertisement