
సాక్షి, మహబూబ్‌బాద్(వరంగల్): తన ఇంటి ముందు ఉన్న స్కూల్‌ను కూల్చివేసి పార్కింగ్‌కు వాడుకుంటున్న ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌పై అదే గ్రామానికి చెందిన డిఎస్ వెంకన్న నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన 3 ఎకరాల స్థలాన్ని రెడ్యా నాయక్ కబ్జా చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన తన భార్య, ఇద్దరు కొడుకుల పేర్లను మార్చి మొదటి విడతలో ఇందిరమ్మ గృహలు పొందారని, ఉపాధి హామీ పథకం కింద తన పేరున ఉన్న భూమిని కొడుకు పేరు మీద ఉన్నట్లు చూపించి నిధులు పొందారని కోర్టుకు తెలిపారు. వెంకన్న నాయక్ పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు పూర్తి వివరాలు ఇవ్వాలని హోంశాఖను అదేశించింది. కాగా తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment