
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన మైనర్ బాల బాలికల అదృశ్యం కేసుపై న్యాయవాది రాపోల్ భాస్కర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. పోలీసులు బాలికల మిస్సింగ్ కేసును మూసివేశారని, ఇట్టి కేసులను మళ్లీ రీ ఓపెన్ చేయాలని ఆయన కోర్టును కోరారు. అదేవిధంగా ప్రతి జిల్లాకు స్పెషల్ అధికారులను నియమించి విచారణ చేపట్టాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే హాజిపూర్ ఘటనలో అదృశ్యమైన బాలికల తరహాలోనే వీరి అదృశ్యం జరిగి ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా క్లోన్ చేసిన 2 వేల కేసులను మళ్లీ తిరిగి విచారణ జరిపించాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపి..కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment