
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన సైన్స్ కాంగ్రెస్ తరలిపోవడానికి.. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనిక్కడ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా వర్సిటీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని తెలిపారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ, ఇతర అంశాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోలేదన్నారు. వర్సిటీలో పరిస్థితులను కాంగ్రెస్ చెడగొడుతోందని విమర్శించారు.
కాగా, ఓయూలో నిర్వహించాల్సిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా మణిపూర్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment