
హైదరాబాద్: జనవరి 3 నుంచి 7 వరకు జరిగే 105వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఓయూ క్యాంపస్‌లోనే ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు క్యాంపస్‌లో ముమ్మరంగా సాగుతున్నాయి. వేదికల ఏర్పాటుకు కావాల్సిన సామగ్రిని అధికారులు తీసుకొచ్చారు. క్యాంపస్‌లోని ఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసి న వేదికపై ప్రధాని సదస్సును ప్రారంభిస్తారు. సీ గ్రౌండ్స్‌లో దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల వస్తువుల కోసం ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్‌ను టెక్నాలజీ కళాశాలలో, ఠాగూర్ ఆడిటోరియంలో మహిళా సైన్స్ కాంగ్రెస్, యూనివర్సిటీ లైబ్రరీలోని ఐసీఎస్‌ఎస్‌ఆర్ హాలులో సైన్స్ కమ్యూనికేటర్ సమ్మిట్ జరగనున్నాయి. తొలుత సైన్స్ కాంగ్రెస్ ప్రారంభ వేడుకలను హైటెక్స్‌లో జరపాలని అధికారులు నిర్ణయించినా ప్రధాని సూచన మేరకు ఓయూలోనే నిర్వహిస్తున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో నిర్వహించే ఈ సదస్సులో పాల్గొననున్న 15 వేల మంది ప్రతినిధులకు నగరం లోని ప్రముఖ హోటల్స్‌లో వసతి కల్పిస్తున్నట్లు సైన్స్ కాంగ్రెస్ సెక్రటరీ ప్రొ.శివరాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment