
సాక్షి, హైదరాబాద్: సైన్స్ కాంగ్రెస్‌ను ఓయూలో నిర్వహించలేమని చేతులెత్తేసిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను అవమానించారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు.133 వ జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన గాంధీ భవన్‌లో మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరో వైపు హైకోర్టు విభజనపై టీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. హైకోర్టు కోసం పోరాడుతున్నట్టుగా టీఆర్‌ఎస్ నేతలు నాటాకాలాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు.