రూ.1,500 కోట్లతో సైన్స్‌ మ్యూజియం | Science Museum with the of Rs 1,500 crore | Sakshi
Sakshi News home page

రూ.1,500 కోట్లతో సైన్స్‌ మ్యూజియం

Published Wed, Jan 4 2017 2:02 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

రూ.1,500 కోట్లతో సైన్స్‌ మ్యూజియం - Sakshi

రూ.1,500 కోట్లతో సైన్స్‌ మ్యూజియం

నేడు తిరుపతిలో శంకుస్థాపన

సాక్షి,  తిరుపతి: తిరుపతిలో రూ. 1,500 కోట్లతో మెగా సైన్స్‌ మ్యూజి యాన్ని నెలకొల్ప నున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మ్యూజియం నిర్మాణ పనులకు బుధవారం ఉదయం 7.30 గంటలకు భూమి పూజ చేస్తున్నట్లు చెప్పారు. జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో భాగంగా ఎస్వీయూ ఆవరణ లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన మెగా సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లా డుతూ.. ఇస్కా సదస్సుల్లో భాగంగా బుధవారం ఉదయం 11 గంటలకు చిల్డ్రన్స్, ఉమెన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. రాజధాని అమరావతిలో జాతి గర్వించే దళిత నేతల స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. మంగళవారం తన నివాసంలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు సీఎం నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement