Telangana Government: రాష్ట్రంలో వ్యవసాయానికి కీలకమైన సాగునీటి సౌకర్యం, రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం నేపథ్యంలో భూముల ధరలు పెరిగిపోతున్నాయి. దీన్ని రాష్ట్ర ఖజనాకు కచ్చితమైన ఆదాయం తెచి్చపెట్టే వనరుగా ప్రభుత్వం మార్చుకుంటోంది. ఏడేళ్ల పాటు భూముల విలువల పెంపుపై దృషి?ట్పట్టని ప్రభుత్వం ఏడెనిమిది నెలల క్రితం భూ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచింది. తాజాగా మరోసారి భూముల విలువలు పెంచేందుకు కసరత్తు దాదాపు పూర్తిచేసింది.
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురవడంతో.. నల్లధనాన్ని కొద్దిగానైనా అరికట్టే అవకాశాలుంటాయని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది జూలైలో సవరించిన విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో నెలకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుండగా, తాజాగా భూ విలువల పెంపుతో ప్రతినెలా మరో రూ.200 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది.
దీంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున రూ.1,200 కోట్లుంటుందని, సాలీనా ఇది రూ.15 వేల కోట్లకు చేరుతుందని చెబుతున్నారు. గతేడాది వరకు రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా కేవలం రూ.5,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు రాబడులు వచ్చేవని గత నాలుగేళ్లలో జరిగిన లావాదేవీల గణాంకాలు స్పష్టం చే స్తుండగా, తాజా సవరణలు అమల్లోకి వస్తే అది ఏటా రూ.15 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభు త్వ సొంత పన్నుల ఆదాయం ఒక్క స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే ఏడాదికి అదనంగా రూ.8,000 కోట్ల వరకు పెరగనుందన్నమాట.
ఇప్పటికి రూ.9 వేల కోట్ల పైమాటే
ఈ ఆర్థిక సంవత్సరంలో రిజి్రస్టేషన్ల ఆదాయాన్ని పరిశీలిస్తే జూలైలో ప్రభుత్వ విలువల సవరణకు ముందు మూడు నెలలు కలిపి వచి్చంది కేవలం రూ.1,500 కోట్లపైమాటే. అంటే నెలకు సగటున రూ.500 కోట్లకు పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా ఆదాయం వచి్చంది. కానీ జూలైలో భూముల ప్రభుత్వ విలువలను సవరించడంతో పాటు అప్పటివరకు 6 శాతంగా ఉన్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతానికి పెంచారు.
అలాగే యూజర్ చార్జీలను కూడా భారీగా పెంచారు. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. జూలైలో ఏకంగా 2.2 లక్షల డాక్యుమెంట్ లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,201 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఒక్క ఆగస్టులో మినహా అన్ని నెలల్లోనూ ఆదాయం రూ.1,000 కోట్లకుపైనే వస్తోంది. ఇప్పుడు తాజాగా కేవలం భూముల విలువలను మాత్రమే సవరిస్తుండడంతో నెలకు అదనంగా రూ.200 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
‘వ్యవసాయ’ఆదాయంలోనూ పెరుగుదల
2021–22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే ఆదాయం క్రమంగా పెరుగుతోందని తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో రూ.81.93 కోట్లు వచి్చన ఆదాయం జూలైలో అత్యధికంగా రూ.156.43 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఆగస్టు, అక్టోబర్ నెలల్లో మినహా అన్ని నెలల్లో రూ.150 కోట్లు దాటింది. మొత్తమ్మీద ధరణి పోర్టల్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 6,00,443 లావాదేవీలు జరగ్గా రూ.1,220.54 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment