
సాక్షి, హైదరాబాద్: వచ్చే సంవత్సరం (2021)లో 28 సాధారణ సెలవు దినాలు, 25 ఐచ్ఛిక సెలవు దినాలు ఉండనున్నాయి. ఈ మేరకు సాధారణ, ఐచ్ఛిక సెలవు దినాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఆదివారాలతో పాటు అన్ని రెండో శనివారాలు (ఫిబ్రవరి 13 మినహా) మూసి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులకు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా 25 ఐచ్ఛిక సెలవుల్లో అయిదుకు మించకుండా వాడుకోవచ్చు.
రాష్ట్రంలోని పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలకు, విద్యా సంస్థలు, పబ్లిక్ వర్క్స్ శాఖల ఉద్యోగులకు ఈ సాధారణ సెలవులు వర్తించవు. ఆయా పండుగలు/సందర్భాల్లో ఈ సంస్థలకు వర్తించనున్న సెలవులను ప్రకటిస్తూ సంబంధిత శాఖలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. ఇక నెల వంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్ ఉన్ నబీ వంటి పర్వదినాల్లో ఏవైనా మార్పులు చేసుకుంటే ప్రభుత్వం ఆ మేరకు సెలవు దినాలను సైతం మార్చనుంది. ( ట్రాఫిక్ చిక్కుల పరిష్కారానికి లింక్‌రోడ్లు )
Comments
Please login to add a commentAdd a comment