సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా నియంత్రణ పిటీషన్‌పై శుక్రవారం హైకోర్ట్‌లో విచారణ ప్రారంభమయ్యింది. నేటితో నైట్ కర్ఫ్యూ ముగుస్తుండటంతో తదుపరి తీసుకోబోయే చర్యలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాక డెడ్ లైన్ విధించింది. 45 నిముషాల్లో ప్రభుత్వ నిర్ణయం తెలపాలని హైకోర్టు ఆదేశించింది. లేకపోతే తామే ఆదేశాలు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున హాజరైన ఏజీ నైట్ కర్ఫ్యూ పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపాడు. ఈ సమాధానంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది.
కర్ఫ్యూ జీవో ముగియడానికి 24 గంటల సమయం కూడా లేదు. అయినా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం ఏంటని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూపై జీవో ఈరోజుతో ముగుస్తుంది.. మరీ రేపటి నుంచి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించింది. ఈ క్రమంలో రేపు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉందని ఏజీ కోర్టుకు తెలిపాడు. ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి 45 నిముషాలు సమయం ఇస్తానున్నామని.. ప్రభుత్వ నిర్ణయం ఏంటో తెలిపాలని హై కోర్టు ఆదేశించింది. పిటీషన్ పాస్ ఓవర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment