
సాక్షి, అమరావతి: ఏపీలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని సీఎం పేర్కొన్నారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందని ఆయన పేర్కొన్నారు. రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కరోనా కట్టడి చర్యలపై సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారికి ఆదుకునేలా ఆర్థికసహాయంపై తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. వారి పేరు మీద కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసేలా, దానిపై వచ్చే వడ్డీ ప్రతినెలా వారి ఖర్చులకోసం వచ్చేలా ఆలోచనలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
చదవండి: వారి అంత్యక్రియలకు రూ.15 వేలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు
గ్రామ–వార్డు సచివాలయాల సేవలకు సలాం
Comments
Please login to add a commentAdd a comment