
సాక్షి,అమరావతి: కరోనా కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కొనసాగుతున్న ఈ కర్ఫ్యూను ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది.
కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,535 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 2,075 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment