
సాక్షి, అమరావతి: ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ వేళల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మ.12 గంటల వరకు సడలింపు యథాతథంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌పై సమీక్ష చేపట్టారు. ఏపీలో నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియడంతో జూన్ 10 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చదవండి: 14 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన
వారెప్పటికీ అనాథలు కారు..!