న్యూఢిల్లీ : అమెరికాలో తాజాగా ఏర్పడ్డ షట్‌డౌన్ పరిస్థితుల వల్ల భారత వియానయాన రంగానికి కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏమీ లేవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ భారత్ నుంచి అమెరికా వెళ్లే ఒక్క విమాన సర్వీసు కూడా రద్దు కాలేదని విమానయాన రంగానికి చెందిన అధికారులు చెబుతున్నారు. షట్‌డౌన్ ప్రభావం ప్రయాణికులు మీద ఇప్పటికిప్పుడు పడదని కాక్స్ అండ్ కిక్స్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే ఈ పరిస్థితి సుధీర్ఘకాలం కొనసాగితే మాత్రం ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు.
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించిన తరువాత కూడా విమానయాన రంగం మీద ఎటువంటి ప్రభావం పడలేదని చెప్పారు. విమానాలన్నీ షెడ్యూల్ టైమ్‌కు బయలుదేరుతున్నాయని, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు తమ సేవలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇదిలావుంటే.. సమీప భవిష్యత్తులో మాత్రం అమెరికాలో పర్యటించాలనుకునేవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని యాత్రాడాట్‌కామ్ సీఓఓ శరత్ దాల్ తెలిపారు.
భారత ప్రభుత్వ వియానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రం అమెరికాకు వియానయాన సేవలు కొనసాగిస్తామని ప్రకటించింది. అమెరికాలోని ప్రధాన పట్టణాలైన శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్‌లకు విమానాలను నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment