బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్టీసీకి మినహాయింపు | Banks, post offices, artisiki exception | Sakshi
Sakshi News home page

బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్టీసీకి మినహాయింపు

Published Mon, Nov 28 2016 1:41 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్టీసీకి మినహాయింపు - Sakshi

బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆర్టీసీకి మినహాయింపు

కరెన్సీ కష్టాలకు వ్యతిరేకంగా జరుగు తున్న బంద్ కాబట్టి బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ఎలాంటి ఆందోళనలు చేయకూడ దని విపక్షాలు నిర్ణరుుంచాయి. ఆర్టీసీ బస్సులు యథాతథంగా తిరగనున్నా యి. ప్రజలు యథావిధిగా బ్యాంకులు,పోస్టాఫీసుల్లో కార్యకలాపాలు ప్రకటించింది. ప్రతిపక్షాలు, వామపక్షాల నేతృత్వంలో సామాన్య ప్రజలు తమ ధిక్కార స్వరాన్ని వినిపించనున్నారు. 

నల్లధనాన్ని వెలికి తీయడానికంటూ కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసి నేటికి సరిగ్గా ఇరవై రోజులు. ఈ ఒక్క నిర్ణయం దేశ వ్యాప్తంగా పెనుసంచలనమవ్వడంతోపాటు జనానికి కష్టాలు మొదలయ్యారుు. కొద్ది రోజులే కదా సర్దుకుంటుంది అనుకున్నా సమస్య పెద్దదైంది తప్ప సద్దుమణగలేదు. ముందు చూపు లేకపోవడంతో ఏటీఎంలు మొరారుుస్తున్నారుు. నగదు ఉపసంహరణకు పరిమితి విధించడంతో చిన్న వాళ్ల పనులు ఆగిపోయారుు. జిల్లా వ్యాప్తంగా 738 బ్యాంక్ బ్రాంచ్‌ల వద్ద జనం బారులుదీరారు. గంటలు, రోజులపాటు నోట్ల మార్పిడి కోసం పడిగాపులు కాస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, బాలింతలు నరకం చూస్తున్నారు. చివరికి ఈ సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే శుభకార్యాలు రద్దు చేసుకునే వరకూ వెళ్లింది. చిరు వ్యాపారాలు కుదేలయ్యారుు. సామాన్య మధ్యతరగతి వారికి ఇల్లు గడవడమే కష్టంగా మారింది. 

ఇదే అదనుగా కొందరు స్వార్ధ పరులు నోట్ల మార్పిడికి అడ్డ దారులు చూపిస్తామంటూ సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఆర్టీసీ, రైల్వే, పెట్రోల్ బంక్‌లలో పాత నోట్లు అనుమతిస్తారన్నప్పటికీ చిల్లర లేకపోవడంతో అక్కడా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో స్పష్టత కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జనం మండిపడుతున్నారు. గడిచిన 20 రోజుల్లో ఒక్క నల్ల కుబేరుడైనా బ్యాంకుల వద్ద క్యూలో నిలబడ్డాడా అని ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనకు ప్రతీకగా నేడు జిల్లా వ్యాప్తంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహించనున్నారుు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement