న్యూఢిల్లీ: పాత రూ.500, రూ. 1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లోకి రూ.36,631 కోట్లు డిపాజిట్ల రూపంలో వచ్చినట్లు ఒక అధికారి తెలిపారు. నవంబర్ 10-24 మధ్య రూ.3,680 కోట్ల విలువైన పాత నోట్లను మార్చి ఇచ్చినట్లు చెప్పారు.
జిల్లా చెస్టుల్లో పాత నోట్ల నిల్వ
ముంబై: బ్యాంకులకు అందుతున్న పాత నోట్లను జిల్లా స్థాయిల్లోని కరెన్సీ చెస్ట్‌లలో భద్రపరచుకోవడానికి ఆర్‌బీఐ సోమవారం అనుమతినిచ్చింది. ఇందుకోసం చెస్ట్ ప్రత్యేకంగా చెస్ట్ గ్యారెంటీ వాల్ట్(జీసీవీ)ను నిర్వహించాలి. కరెన్సీ చెస్టులు లేని బ్యాంకులు నోట్లను సీల్డ్ బాక్స్‌లలో డిపాజిట్ చేసి వాటి విలువకు సమానమైన మొత్తాన్ని చెస్ట్ శాఖలో ఉన్న తమ కరెంట్ ఖాతాకు జమచేసుకునే వెసులుబాటును కల్పించింది.
పోస్టాఫీసుల్లోకి రూ.36 వేల కోట్లు
Published Mon, Nov 28 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
Advertisement