ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా..
ఖమ్మం: ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 4, 5 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల బంద్‌కు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా సీపీఐ మావోయిస్టుల కమిటీ మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజలపై, విప్లవోద్యమాలపై ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ సీఎం హిందూ పాసిస్టులతో కుమ్మక్కై భూ స్వామ్య, నల్లదొరల పాలన కొనసాగిస్తున్నారని విమర్శించింది. పోలవరం ప్రాజెక్టుల నిర్వాసిత మండలాల పీడిత ప్రజలకు అన్యాయం చేస్తున్న పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.