యూకే రాజధాని లండన్‌లో భారత్‌కి చెందిన ఓ ఐకానిక్ రెస్టారెంట్ మూతపడుతోంది. దీన్ని "ఇండియా క్లబ్" అని కూడా పిలుస్తారు. ఇది సెంట్రల్ లండన్‌లో రద్దీగా ఉండే రహదారిలో హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఉంది. ఇది దశాబ్దాలుగా నగరంలోని దక్షిణాసియా ప్రజలకు బాగా సుపరిచితమైనది. ఎన్నో రకాల దక్షిణ భారతదేశ వంటకాలను సుపరిచితం చేసిన ఈ రెస్టారెంట్ అనూహ్యంగా మూతపడుతోంది. స్వాతంత్య్రం కోసం పోరాడిని ఎందరో త్యాగధనులకు ఆతిధ్యం ఇచ్చింది. భారతదేశ స్వాతంత్య్రానికి సంబంధించిన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం అయిన ఈ రెస్టారెంట్ ఎందుకు మూతపడనుందంటే..
నిజానికి 1950 దశకంలో భారతీయ వలసదారులను కలుసుకునేందుకు ఓ ప్రదేశం ఏర్పాటయ్యింది. ఇది సెంట్రల్ లండన్‌లో రద్దీగ ఉండే రహదారిలో హోటల్ స్ట్రాండ్ కాంటినెంటల్ లోపల ఉంది. దీన్ని ఇండియా లీగ్ సభ్యులు ప్రారంభించారు. బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ 1900లలో ఈ క్లబ్‌లో భారతదేశానికి స్వాతంత్య్రం కోసం ప్రచారం చేసింది. అలాగే భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు ఈ క్లబ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1990లలో పరిపాలనాధికారులు దీన్ని లీజుకు కొనుగోలు చేశారు. స్వాతంత్య్ర కార్యకర్తలు దీన్ని సమావేశ స్థలంగా ఉపయోగించుకున్నారు.
1950, 60లలో భారతీయులు తమ భాష మాట్లాడే వారు, తమ దేశ ఆహారం తినడం కోసం ఇక్కడకు వచ్చేవారని క్రమం తప్పకుండా సందర్శించే చరిత్రకారురాలు కసూమ్ వడ్గామ చెప్పారు. ప్రజలు పుట్టిన రోజులు, వివాహాలు, దీపావళి వంటి పండుగలను జరుపుకోవడానికి తరుచుగా ఇక్కడకు వచ్చేవారు. వడ్గామా తూర్పు ఆఫ్రికా వలస పాలనలో పెరిగారు. చదువుకోవడానికి యూకే వెళ్లారు. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తరువాత సంవత్సరాలలో చాలామంది ప్రజలు యూకేకి వలస వచ్చారు. అయితే లండన్‌లో భారతీయ ప్రవాసుల కోసం సాంస్కృతిక సంస్థలు ఏవీ లేవు.
ఆ లోటును ఈ ఇండియన్ క్లబ్ పూరించింది. ఈ రెస్టారెంట్‌లో దోశలు, పప్పులతో చేసే మసాల కర్రీలు, బట్టర్ చికెన్, కూరగాయాల వడలు, కాఫీ, మసాలా చాయ్ తదితర భారతీయ వంటకాలను అందించేది. ఈ క్లబ్ ఇంటీరియర్ కూడా భారతదేశంలోని కాఫీ షాపులను అనుకరించేలా రూపొందించారు. 70 ఏళ్ల క్రిత ఏర్పాటు చేసిన స్ట్రెయిట్ బ్యాక్డ్ కుర్చీలనే వాడుతున్నారు. ఇంకా మారలేదు. అంతేగాదు నాటి సామాజికి రాజకీయ చరిత్రకు గుర్తుగా గోడలపై భారతీయ బ్రిటీష్ వ్యక్తుల చిత్రాలు ఉన్నాయి. దాదాభాయ్ నౌరోజీ నుంచి తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ వరకు, జర్నలిస్ట్‌లు, వలసదారులకు ప్రసిద్ధమైన ప్రాంతంగా ఉంది.
ఎందుకు మూతపడుతోందంటే..
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న అలాంటి క్లబ్ మూతపడుతోంది. ఆ భవనం ఉన్న ప్రదేశంలోని యజమానులు నిర్మాణంలో కొంత భాగాన్ని కూల్చివేయాలని కోరుతున్నారు. మరింత ఆధునికరించిన హోటల్‌గా మార్చాలని డిసైడ్ అయ్యారు. క్లబ్‌ని మూసివేయడం వల్ల నగర చరిత్రలో కొంత భాగాన్ని కోల్పోతుందని చాలామంది ఆవేదనగా చెబుతున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కూడా. ఆ క్లబ్ యజానులు యాద్గార్ మార్కర్, అతని కుమార్తె ఫిరోజా ఈ స్థలాన్ని కాపాడేందుకు మద్దతు కోసం వేలాది మంది నుంచి సంతకాలను తీసుకుని కూల్చివేత పోరాటంలో విజయం సాధించారు కూడా. అయితే గతవారమే వారు క్లబ్ తెరిచి ఉండటానికి సెప్టెంబర్ 17 చివరి రోజు అని ఆవేదనగా ప్రెస్‌తో చెప్పడం గమనార్హం.
(చదవండి: మహిళ మెదడులో.. కొండచిలువలో ఉండే..)
Comments
Please login to add a commentAdd a comment