జర్మనీకి చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తన ప్లాంట్లను మూసివేయాలని యోచిస్తోంది. దాంతోపాటు కాస్ట్ కటింగ్ ప్రణాళికలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని తొలగించనున్నట్లు కంపెనీ వర్క్స్ కౌన్సిల్ హెడ్ డానియెలా కావల్లో తెలిపారు. అంతర్జాతీయంగా కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.
ఈ సందర్భంగా డానియెలా కావల్లో మాట్లాడుతూ..‘యూరప్‌లో వోక్స్‌వ్యాగన్ సంస్థ తన తయారీ యూనిట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిపోతోంది. దాంతో యూరప్‌లో మూడు ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించాం. అయితే ఏ ప్లాంట్లను నిలిపేయాలో ఇంకా స్పష్టత రాలేదు. కంపెనీలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని కొలువుల నుంచి తొలగించనున్నాం. జర్మనీలోని వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో దాదాపు 3,00,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!
వోక్స్‌వ్యాగన్ కంపెనీ ఉత్పత్తులకు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్న చైనా, యూరప్ నుంచి డిమాండ్ తీవ్రంగా పడిపోయింది. దానికితోడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఆదరణ కరవైంది. దాంతో చేసేదేమిలేక చివరకు ఉద్యోగుల తగ్గింపునకు పూనుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment